వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టర్కీలో సైనిక తిరుగుబాటు: వీధుల్లోకి ప్రజలు, భారత్ అప్రమత్తం

By Pratap
|
Google Oneindia TeluguNews

అంకారా: టర్కీలో సైనిక తిరుగుబాటు చోటు చేసుకుంది. దేశాన్ని పూర్తి స్థాయిలో తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు సైన్యం ప్రకటించింది. దేశవ్యాప్తంగా మార్షల్‌ చట్టం, కర్ఫ్యూ విధించారు. రాజధాని అంకారా గగనతలంలో సైనిక విమానాలు, హెలికాఫ్టర్లు పహరా కాస్తున్నాయి. ప్రజలు వీధుల్లోకి వచ్చారు.

కొన్ని చోట్ల సైనిక హెలికాఫ్టర్ల నుంచి కాల్పులు జరిగాయి. ఇస్తాంబుల్‌ వీధుల్లో సైనిక ట్యాంకులు సంచరిస్తున్నాయి. నిరంకుశపాలన , పెరిగిన ఉగ్రవాదం కారణంగానే అధికారాన్ని చేతులోకి తీసుకున్నట్లు సైన్యం తెలిపింది. జాతీయ టీవీ, రేడియో పూర్తిగా సైన్యం హస్తగతమైంది.

Turkey military coup: Army says it seized control; people take to streets

టర్కీ ప్రభుత్వ విధేయులకు, సైనిక మద్దతుదారుల మధ్య రాజధానిలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. తిరుగుబాటుకు నిరసన తెలయజేయడానికి బోస్పోరస్ వంతెన దాటడానికి ప్రయత్నించిన గుంపుపై సైనికులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో కొంత మంది గాయపడ్డారు.

Turkey military coup: Army says it seized control; people take to streets

సైనిక దాడిలో 17 మంది పోలీసులు మరణించినట్లు తెలుస్తోంది. ప్రజలు, పోలీసులు ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారు. పార్లమెంటుపై సైనికులు బాంబులతో దాడి చేశారు. ఆ దాడికి పాల్పడినవారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అధ్యక్షుడు అన్నారు. సైనిక తిరుగుబాటును తిప్పికొట్టినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

కాగా, భారత్ అప్రమత్తమైంది. పరిస్థితి సాధారణ స్థాయికి వచ్చేవరకు భారతీయులు ఇళ్లలోంచి బయటకు రావద్దని భారత రాయబార కార్యాలయం సూచించింది. కాగా, ఈ సైనిక తిరుగుబాటును అధ్యక్షుడు ఎర్డొగాన్‌ ఖండించారు

టర్కీలో సైనిక తిరుగుబాటుకు ఐదు కారణాలు

సైనికులకు, ప్రభుత్వ అనుకూలరకు మధ్య జరుగుతున్న సమరంలో ఇప్పటి వరకు 60 మంది మరణించినట్లు తెలుస్తోంది. టర్క్‌సాట్ శాటిలైట్‌ ఏజెన్సీపై బాంబులు వేయడానికి బయలుదేరిన సైనికుల హెలికాప్టర్‌ను కూల్చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇస్తాంబుల్‌లోని ప్రసిద్ధ టక్మిమ్ కూడలి వద్ద సైనికులకు, ప్రజలకు మధ్య ఘర్షణ జరుగుతోంది.

టర్కీ పోలీసు హెడ్ క్వార్టర్స్‌పై హెలికాప్టర్ గన్ షిప్పుతో సైనికులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 42 మంది సైనికులు మరణించినట్లు తెలుస్తోంది. టర్కీ పార్లమెంటుపై సైన్యం మూడు బాంబులను ప్రయోగించింది. దాంతో ఎంపిలు పార్లమెంటు షెల్టర్‌లో తలదాచుకున్నారు. కీలకమైన అదికారులను సైన్యం తన నిర్బంధంలోకి తీసుకుంది.

అంకారా, ఇస్తాంబుల్ నగరాల్లో పలు చోట్ల భారీ పేలుళ్లు సంభవించినట్లు తెలుస్తోంది. ఇస్తాంబుల్‌లోలని స్తానిక విమానాశ్రయం వద్ద భారీగా సైనికులు మోహరించారు. టర్కీ ఆర్మీ సీనియర్ అధికారి జనరల్ హుల్‌యుసి ్కర్‌ను సైనికులు నిర్బంధించారు. టర్కీలో ఇప్పటి వరకు నాలుగు సార్లు 1960, 1971, 1980, 1993ల్లో సైనిక తిరుగుబాట్లు జరిగాయి.

English summary
Members of Turkey's armed forces said they had taken control of the country Friday as explosions, gunfire and a reported air battle between loyalist forces and coup supporters erupted in the capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X