వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్ బుక్, యూట్యూబ్ నిషేధం దిశగా.. 86ఏళ్ల తర్వాత హయా సోఫియా వద్ద నమాజ్.. టర్కీలో సంచలనాలు..

|
Google Oneindia TeluguNews

ప్రపంచాన్ని కలిపే అతిపెద్ద కూడళ్లలో ఒకటిగా, ఆసియా-యూరప్ ఖండాలకు వారధిగా, భిన్న సంస్కృతులు నిలయంగా ఉన్న టర్కీ.. కరడుగట్టిన ఇస్లామిక్ దేశంగా రూపాంతరం చెందే పనిని వేగవంతం చేసింది. అందులో భాగంగా సోషల్ మీడియాపై నిషేధం విధించే దిశగా అడుగులు వేసింది. ప్రఖ్యాత మ్యూజియం హయా సోఫియా ను మళ్లీ మసీదుగా మార్చేసే క్రమంలో శుక్రవారం అక్కడ సామూహిక ప్రార్థనలను నిర్వహించారు. ప్రెసిడెంట్ రెసెప్ తైపీ ఎర్దొగాన్ ముందు వరుసలో నిలబడి నమాజ్ చేశారు.

చైనా గుట్టు రట్టు.. రీసెర్చర్ వేషంలో స్పై - కాన్సులేట్‌లో నక్కి ఎఫ్‌బీఐకి చిక్కి - ట్రంప్ సీరియస్..చైనా గుట్టు రట్టు.. రీసెర్చర్ వేషంలో స్పై - కాన్సులేట్‌లో నక్కి ఎఫ్‌బీఐకి చిక్కి - ట్రంప్ సీరియస్..

సోషల్ వెబ్ సైట్లకు చుక్కలే..

సోషల్ వెబ్ సైట్లకు చుక్కలే..

సోషల్ మీడియా ద్వారా.. దేశంలో పాలకులపై వ్యతిరేక కామెంట్లు, ప్రభుత్వ విదానాలపై నిరసనలు తీవ్రతరమవుతోన్న నేపథ్యంలో ఎర్దొగాన్ సర్కారు సరికొత్త బిల్లును రూపొందించింది. నేడో రేపో పార్లమెంట్ ఆమోదం పొందనున్న ఈ బిల్లు.. ఫేస్ బుక్, ట్విటర్, యూట్యూబ్ లాంటి సోషల్ వెబ్ సైట్లకు శరాఘాతం కానుంది. అంతేకాదు, లోకల్ మీడియాపైనా తీవ్ర ఆంక్షలకు అవకాశమిచ్చే అంశాలు ఈ బిల్లులో ఉన్నాయి.

మాట వినకుంటే భారీ కోతలు..

మాట వినకుంటే భారీ కోతలు..

టర్కీ కేంద్రంగా పని చేయాలనుకుంటే.. సోషల్ వెబ్ సైట్లన్నీ ఇకపై జవాబుదారీగా వ్యవహరించాలని, ఓ ప్రతినిధిని తప్పకుండా నియమించాలని, టర్కీ ప్రభుత్వం చేసే ఫిర్యాదులపై 48 గంటల్లోగా సదరు సైట్లు స్పందించాల్సి ఉంటుందని, లేకుంటే భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుందని, తీవ్రత ఎక్కువ ఉన్న కేసుల్లో వెబ్ సైట్ల బ్యాండ్ విడ్త్ ను 90 శాతానికి తగ్గించేస్తామని రకరకాల ఆంక్షలను కొత్త బిల్లులో పొందు పర్చారు. దేశీ న్యూస్ వెబసైట్లు 24 గంటల్లోగా కంటెంట్ ను తొలగించేలా ఉత్తర్వులిచ్చే అధికారాన్ని కోర్టులకు కట్టబెట్టే అంశాన్ని కూడా బిల్లులో చేర్చారు. మొత్తంగా ఈ కొత్త బిల్లు సోషల్ మీడియా పాలిట శాపంగా మారనుంది.

జగన్ తీరు పెద్ద జోక్..నిమ్మగడ్డను కూర్చోనిద్దాం..సహజీవనానికి బెడ్లు చాలవు..సాయిరెడ్డి వల్లే: రఘురామజగన్ తీరు పెద్ద జోక్..నిమ్మగడ్డను కూర్చోనిద్దాం..సహజీవనానికి బెడ్లు చాలవు..సాయిరెడ్డి వల్లే: రఘురామ

86 ఏళ్ల తర్వాత అక్కడ ప్రార్థనలు..

86 ఏళ్ల తర్వాత అక్కడ ప్రార్థనలు..

టర్కీ పేరు చెప్పగానే ఠక్కున గుర్తొచ్చేది హయా సోఫియా కట్టడం. ఇస్తాంబుల్ లోని ఆ చారిత్రక కట్టడానికి 1500 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటిగా గుర్తింపు పొందిన హయా సోఫియా 1934 నుంచి మ్యూజియంగా కొనసాగుతోంది. అయితే, దాన్ని మళ్లీ పూర్తిస్థాయి మసీదుగా మార్చాలంటూ టర్కీ సుప్రీంకోర్టు ఇటీవలే తీర్పు చెప్పింది. దీంతో తొలిసారి శుక్రవారం అక్కడ సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. అధ్యక్షుడు రెసెప్ ఎర్దొగాన్ ముందు వరుసలో నిలబడి ప్రార్థనలు చేశారు. టర్కీలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టడంతో లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత జరిగిన తొలి సామూహిక వేడుక ఇదే కావడం గమనార్హం.

Recommended Video

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
ఇదీ హయా సోఫియా చరిత్ర..

ఇదీ హయా సోఫియా చరిత్ర..

ఇస్తాంబుల్ లోని చారిత్రక హయా సోఫియా భవంతిపై రకరకాల వాదనలున్నాయి. తొలుత చర్చిగా ఉండిన ఈ భవంతి.. తర్వాతి కాలంలో మసీదుగా మారింది. మారిన టర్కీ కల్చర్ కు అనుగుణంగా 1934 నుంచి దాన్ని మ్యూజియంగా మార్చారు. తిరిగి దాన్ని మసీదుగా మార్చాలనే డిమాండ్ టర్కీలో ఎప్పటి నుంచో ఉంది. ఎట్టకేలకు సుప్రీం తీర్పుకు అనుగుణంగా, హయా సోఫియాను మసీదుగా మార్చుతున్నట్లు ఈనెల 10న ప్రెసిడెంట్ ఎర్దొగాన్ ప్రకనట చేశారు. ఈ నిర్ణయాన్ని పోప్ ప్రాన్సిస్, వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ వ్యతిరేకించాయి. అయితే, టర్కీ మాత్రం.. ‘‘ఇస్తాంబుల్ ను జయించిన ఫతిహా కోరిన విధంగానే హయా సోఫియాను మళ్లీ మసీదుగా మార్చుతున్నాం''అని తన నిర్ణయాన్ని సమర్థించుకుంది.

English summary
Turkey’s parliament is preparing to vote on a bill that would effectively block sites such as Facebook, Twitter and YouTube unless they comply with strict new regulations. first in 86 years President Erdogan joins huge crowds for first Islamic prayers at Istanbul's iconic Hagia Sophia since
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X