వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టర్కీ పెళ్లి వేడుకలో సూసైడ్ బాంబర్, 30 మంది మృతి

|
Google Oneindia TeluguNews

అంకారా: టర్కీ మరోసారి బాంబులతో దద్దరిల్లింది. సిరియా సరిహద్దులకు సమీపంలోని గజియంటెప్ సిటీలో ఓ పెళ్లి వేడుక పైన శనివారం రాత్రి ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ముప్పై మంది వరకు మృతి చెందారు. 90 మందికి పైగా గాయపడ్డారు.

ఉగ్రదాడులు రాత్రి వివాహ వేడుక పైన దాడికి పాల్పడ్డారు. గజియాంటెప్‌లో ఓ వివాహ వేడుక జరుగుతుండగా ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. బాంబులు అమర్చుకుని వేడుకలోకి వచ్చిన ఉగ్రవాది తనకుతాను పేల్చుకుని మారణహోమం సృష్టించాడు.

Turkey wedding blast: 30 dead and 90 hurt in Gaziantep

బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. టర్కీ సరిహద్దు ప్రాంతాలను మూసివేసిన అధికారులు, హై అలర్ట్‌ ప్రకటించారు. ఉగ్రవాదుల కోసం ముమ్మర గాలింపు కొనసాగుతోంది.

ఐసిస్‌కు అనుంబంధంగా ఉన్న కుర్దిష్‌ మిలిటెంట్లు దాడికి పాల్పడినట్లుగా గుర్తించారు. టర్కీలో ఉగ్రదాడి జరగడం గత ఏడాది కాలంలో ఇది మూడోసారి. ఈ దాడిని గజియంటెప్ గవర్నర్ అలి యెర్లికయ ఖండించారు. ఘటనకు బాధ్యులైన వైరిని వదిలి పెట్టేది లేదన్నారు.

English summary
An explosion at an outdoor wedding party in the southern Turkish city of Gaziantep has killed at least 30 people and injured 94 more, the region's governor says.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X