వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళకు కవలలు, తండ్రులు వేరే: ఒకే వారంలో ఆమె ఇద్దరితో..

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అమెరికాలో విచిత్ర సంఘటన జరిగింది. ఓ తల్లి ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. ఆమెకు సెకండ్ల తేడాలో ఇద్దరు పిల్లలు జన్మించారు. అయితే ఆమె భర్త ఇద్దరు పిల్లలలో ఒకరికే తాను తండ్రిని అంటు న్యాయపోరాటం చేశాడు. చివరికి ఆమెకు జన్మించిన ఇద్దరు పిల్లలకు ఇద్దరు తండ్రులు అని వెలుగు చూసింది.

న్యూజెర్సీ లోని దంపతులకు రెండు సంవత్సరాల క్రితం కవలలు జన్మించారు. ఆ సమయంలో తను ఒక బిడ్డకు మాత్రమే తండ్రిని ఆ బిడ్డ మంచి చెడ్డలు చూసుకుంటానని, ఇంకో బిడ్డ గురించి తనకు తెలియదని భర్త తేల్చి చెప్పాడు.

అయితే తల్లి మాత్రం ఇద్దరు పిల్లల ఆలనాపాలన నీవే చూసుకోవాలని భర్తకు చెప్పింది. ఇద్దరు ఈ విషయంలో గొడవపడ్డారు. చివరికి పిల్లలకు తండ్రి ఎవరు అనే గొడవ కోర్టు వరకు వెళ్లింది. కోర్టు రికార్డులలో భార్య పేరు టీ ఎమ్ గా, భర్త పేరు ఏఎస్ గా నమోదు చేసి విచారణ జరిపారు.

Twins have different fathers, jadge finds in paternity case

కోర్టులో భార్య, భర్త వారి వారి వాదనలు వినిపించారు. తల్లి జరిగిన విషయం మొత్తం చెప్పింది. ఒకే వారంలో తన భర్తతో పాటు మరో వ్యక్తితో తాను శృంగారంలో పాల్గొన్నానని ఆమె కోర్టులో అంగీకరించింది. న్యాయస్థానం దంపతులతో పాటు, ఇద్దరు కవలలకు డీఎన్ఏ పరిక్షలు చేయించాలని ఆదేశాలు జారీ చేసింది.

నలుగురికి డీఎన్ఏ పరిక్షలు నిర్వహించారు. ఆ సమయంలో భర్తకు ఒకే బిడ్డ పుట్టిందని ఇటివల వెలుగు చూసింది. వేరే వ్యక్తికి ఇంకో బిడ్డ జన్మించారని స్పష్టం అయ్యింది. ఆ మహిళ ఒకే వారంలో ఇద్దరితో శృంగారంలో పాల్గొనడం వలన ఇద్దరు పిల్లలు జన్మించారని వెలుగు చూసింది.

ఇద్దరు పిల్లలకు తండ్రులు ఇద్దరు అని వెలుగు చూడటంతో ఆమె అయోమయంలో పడింది. భర్త మాత్రం ముందు చెప్పినట్లు ఒక బిడ్డ బాగోగులు చూసుకుంటున్నాడు. ఇంకోక బిడ్డను తల్లి చూసుకుంటున్నది. ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతుంటాయని వైద్య నిపుణులు అంటున్నారు.

English summary
A DNA test showed that he was almost certainly the father of one twin but wasn't the father of the other.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X