వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్‌కే కాదు! ట్విట్టర్ డేటానూ అమ్మేశారు

|
Google Oneindia TeluguNews

లండన్: ఇప్పటి వరకు ఫేస్‌బుక్ మాత్రమే వినియోగదారుల డేటాను అమ్ముుకుందని అనుకుంటే.. ఇప్పుడు మరో సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ కూడా అదే పని చేసిందనే విషయం బహిర్గతమైంది. ఖాతాదారుల నుంచి ఎటువంటి అనుమతి తీసుకోకుండానే ట్విట్టర్ కూడా కేంబ్రిడ్జ్ అనలిటికా అనే కంపెనీకి సమాచారాన్ని అమ్ముందనే విషయం తాజాగా వెలుగుచూసింది.

షాకింగ్ న్యూస్: 'కేంబ్రిడ్జ్ అనలిటికాకు కాంగ్రెస్ క్లైంటే'షాకింగ్ న్యూస్: 'కేంబ్రిడ్జ్ అనలిటికాకు కాంగ్రెస్ క్లైంటే'

ఫేస్‌బుక్ డేటా వ్యవహారంలో కీలక వ్యక్తిగా ఉన్న అలెగ్జాండర్ కోగన్‌కే ట్విట్టర్ ఈ డేటాను విక్రయించినట్లు సండే టెలిగ్రాఫ్ అనే పత్రిక తన కథనంలో పేర్కొంది. ఆ కథనం ప్రకారం.. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన అలెగ్జాండర్ కోగన్.. 'పర్సనాలిటీ క్విజ్' యాప్‌ను తయారు చేశారు. ఈ యాప్‌ను ఉపయోగించుకోవాలంటే ఫేస్‌బుక్ ద్వారా లాగిన్ కావాలి.

Twitter also sold data access to cambridge analytica-linked researcher

ఈ విధంగా దాదాపు 8.7కోట్ల మంది ఫేస్‌బుక్‌ యూజర్ల డేటాను కోగన్‌ సేకరించి కేంబ్రిడ్జ్‌ అనలిటికాకు అందించాడు. అంతేగాక, కోగన్‌కు సొంతంగా గ్లోబల్‌ సైన్స్‌ రీసెర్చ్‌(జీఎస్‌ఆర్‌) అనే సంస్థ ఉంది. ఈ సంస్థ ద్వారా ట్విట్టర్‌ నుంచి యూజర్ల డేటాను తీసుకున్నాడు. ఇందుకోసం 2015లో జీఎస్‌ఆర్‌ సంస్థకు ట్విట్టర్‌ వన్‌టైం అప్లికేషన్‌ ప్రొగ్రామింగ్‌ ఇంటర్‌ఫేస్‌ యాక్సెస్‌ కల్పించింది.

అసలేంటీ 'కేంబ్రిడ్జ్ అనలిటికా'? ఏం చేసింది?: డేటా చౌర్యం, ఎఫ్‌బీ సారీఅసలేంటీ 'కేంబ్రిడ్జ్ అనలిటికా'? ఏం చేసింది?: డేటా చౌర్యం, ఎఫ్‌బీ సారీ

2014 డిసెంబరు నుంచి 2015 ఏప్రిల్‌ వరకు యూజర్ల పబ్లిక్‌ ట్వీట్ల రాండమ్‌ శాంపిల్‌ కోసం ఒకరోజు యాక్సెస్‌ కల్పించామని ట్విట్టర్‌ కూడా అంగీకరించింది. ఈ సమయంలోనే ఖాతాదారుల వ్యక్తిగత సమాచారమంతా జీఎస్‌ఆర్‌కు చేరింది. ఈ సమాచారం కోసం జీఎస్‌ఆర్‌ తమకు కొంత మొత్తాన్ని కూడా చెల్లించినట్లు ట్విట్టర్‌ కూడా అంగీకరించింది.

అయితే, కేంబ్రిడ్జ్ అనలిటికా మాత్రం ఈ వ్యవహారాన్ని ఖండించింది. తాము కోగన్ లేదా జీఎస్ఆర్ ద్వారా ట్విట్టర్ నుంచి ఎలాంటి సమాచారం కొనుగోలు చేయలేదని స్పష్టం చేసింది. జీఎస్ఆర్ తమకు కంట్రాక్టర్ మాత్రమేనని తెలిపింది.

English summary
Since it was revealed that Cambridge Analytica improperly accessed the personal data of millions of Facebook users, one question has lingered in the minds of the public: What other data did Dr. Aleksandr Kogan gain access to?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X