వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బైడెన్‌ అధికార దుర్వినియోగం,చైనాతో లింకులు..? దుమారం రేపుతున్న కథనాలు.. ట్రంప్‌కు ట్విట్టర్‌ షాక్

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ట్విట్టర్ షాకిచ్చింది. అధ్యక్ష ఎన్నికల కోసం ఉపయోగిస్తున్న 'ట్రంప్ రీ-ఎలక్షన్ క్యాంపెయిన్' ట్విట్టర్ హ్యాండిల్‌ను బ్లాక్ చేసింది. ట్రంప్ తన ప్రత్యర్థి జో బైడెన్‌ని టార్గెట్ చేసే క్రమంలో... బైడెన్ కుమారుడి వీడియో ఒకటి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ట్విట్టర్‌... ట్రంప్ నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో ఆయన ఖాతాను తాత్కాలికంగా బ్లాక్ చేసింది. ఈ చర్యను ట్రంప్ సోషల్ మీడియా క్యాంపెయిన్ నిర్వాహకులు తప్పు పడుతున్నారు. ట్రంప్ రీఎలక్షన్ ప్రయత్నాలను ట్విట్టర్‌ ప్రభావితం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

న్యూయార్క్ పోస్ట్ సంచలనాత్మక కథనం...

న్యూయార్క్ పోస్ట్ సంచలనాత్మక కథనం...

డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్‌పై ప్రముఖ మీడియా సంస్థ న్యూయార్క్ పోస్ట్ ఇటీవల సంచలనాత్మక కథనాలు ప్రచురించింది. అందులో ఓ కథనం ప్రకారం... జో బైడెన్ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉక్రెయిన్‌కి చెందిన బుర్సిమా అనే ప్రైవేట్ ఎనర్జీ కంపెనీ ప్రతినిధులతో వాషింగ్టన్‌లో సమావేశమయ్యారు. బుర్సిమా సంస్థ విదేశీ డైరెక్టర్లలో ఒకరైన హంటర్ జో బైడెన్ కుమారుడు కావడం... అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా అడ్మినిస్ట్రేషన్‌లో బైడెన్ యూఎస్-యూకె వ్యవహారాలను పర్యవేక్షిస్తుండటంతో... ఆనాటి సమావేశంపై రిపబ్లికన్ పార్టీ పలు సందేహాలు,అనుమానాలు లేవనెత్తుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ఎన్నికల క్యాంపెయిన్‌లో పదేపదే ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. బైడెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు.

చైనాతోనూ లింకులు..?

చైనాతోనూ లింకులు..?


జో బైడెన్ మాత్రం ఇదంతా తనపై జరుగుతున్న దుష్ప్రచారం అని కొట్టిపారేశారు. బైడెన్ ఎన్నికల క్యాంపెయిన్ నిర్వాహకులు కూడా రిపబ్లికన్ పార్టీ ఆరోపణలను తోసిపుచ్చారు. బైడెన్ ఉక్రెయిన్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమైనట్లు ఎక్కడా ఏ ఆధారాలు లేవని చెబుతున్నారు. అటు న్యూయార్క్ పోస్ట్ ప్రచురించిన కథనాల్లోనూ దీనికి సంబంధించిన ఆధారాలేవీ పేర్కొనలేదు. అదే న్యూయార్క్ పోస్ట్ బైడెన్ కుమారుడు హంటర్‌కి చైనాతో లింకులు ఉన్నట్లు కూడా కొన్ని కథనాలు ప్రచురించింది. చైనాకు చెందిన ఓ బిలియనీర్ నుంచి అతనికి 10మిలియన్ డాలర్లు అందినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. 2013లో హంటర్ బీజింగ్ పర్యటన సందర్భంగా ఇది జరిగిందని... ఆ సమయంలో బైడెన్ కూడా కుమారుడితో పాటు అక్కడికి వెళ్లారని పేర్కొన్నారు.

Recommended Video

Donald Trump's Telangana Fan Bussa Krishna Lost Life ట్రంప్‌ మీద పిచ్చి ప్రేమతో అభిమాని మృతి
ట్విట్టర్‌ ఎన్నికల్లో జోక్యం చేసుకుంటోందని...

ట్విట్టర్‌ ఎన్నికల్లో జోక్యం చేసుకుంటోందని...


న్యూయార్క్ పోస్ట్ ప్రచురించిన ఈ లింకులను,బైడెన్ కుమారుడికి చెందిన ఓ వీడియోను ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వాహకులు... ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే మరొకరి వ్యక్తిగత సమాచారాన్ని పబ్లిక్ డొమైన్‌లో పోస్ట్ పోసి నిబంధనలను అతిక్రమించినందుకు ట్విట్టర్ ఆ ఖాతాను తాత్కాలికంగా బ్లాక్ చేసింది. అయితే సరిగ్గా ఎన్ని గంటల పాటు ట్రంప్ ట్విట్టర్ ఖాతా బ్లాక్ అయిందన్న దానిపై స్పష్టత లేదు. ఇప్పుడైతే ఆ ఖాతా మళ్లీ యాక్టివేట్ అయింది. ట్విట్టర్ చర్యలను ట్రంప్ సోషల్ క్యాంపెయిన్ నిర్వాహకులు తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఇది ఎన్నికల్లో జోక్యం చేసుకోవడమేనని ఆరోపిస్తున్నారు.

English summary
Twitter temporarily blocked the TeamTrump account from sending tweets after it posted a video about Democratic presidential candidate Joe Biden’s son that it said violated its rules.The video referred to a New York Post story from Wednesday that contained alleged details of Hunter Biden’s business dealings with a Ukrainian energy company and said the former vice president had met with an adviser of the company.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X