వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫలితాల వేళ ట్రంప్‌కు షాకిచ్చిన ట్విట్టర్‌- డెమోక్రాట్లపై వివాదాస్పద ట్వీట్ తొలగింపు

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న వేళ అధ్యక్ష అభ్యర్ధులు డొనాల్డ్‌ ట్రంప్‌, జో బిడెన్‌ తమ అనుచరుల్లో ఉత్సాహం నింపేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాము గెలవబోతున్నామని బిడెన్‌ ముందుగా ఓ ప్రెస్‌మీట్లో ప్రకటించగా.. దీనికి కౌంటర్‌ ఇస్తూ ట్రంప్‌ తాము భారీ విజయం ముంగిట ఉన్నామని, కానీ డెమోక్రాట్లు తమ నుంచి విజయాన్ని దొంగిలిస్తున్నారన్న అర్ధం వచ్చేలా ట్వీట్‌ చేశారు. దీనిపై వివాదం చెలరేగింది.

చైనాపై నిప్పులు చెరిగిన ట్రంప్‌- కరోనాతో డ్రాగన్‌ కొట్టిన దెబ్బను ఎలా మర్చిపోగలమని ప్రశ్నచైనాపై నిప్పులు చెరిగిన ట్రంప్‌- కరోనాతో డ్రాగన్‌ కొట్టిన దెబ్బను ఎలా మర్చిపోగలమని ప్రశ్న

ఓసారి పోలింగ్ ముగిశాక ఓట్లు వేసే అవకాశం లేదని, తాము అలా జరగనివ్వబోమని ట్రంప్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో ట్రంప్‌ ట్వీట్‌పై ట్విట్టర్‌ స్పందించింది. ఈ ట్వీట్‌ వివాదాస్పదంగా ఉందని, ప్రజలను ఎన్నికల విషయంలో తప్పుదోవ పట్టించేలా ఉందని ఆరోపించింది. దీన్ని ఫ్లాగ్‌ చేసింది. గతంలోనూ ట్రంప్‌ పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలను ట్విట్టర్‌ తమ సైట్‌ నుంచి తొలగించింది. దీంతో ఫలితాల వేళ ట్విట్టర్‌ నిర్ణయం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అటు ట్రంప్‌ ట్వీట్‌ కూడా అదే స్ధాయిలో చర్చనీయాంశంగా మారింది.

Twitter Flags Donald Trump’s Tweet on Democrats ‘Stealing the Election’ as Misleading

అంతకుముందు మీడియాతో మాట్లాడిన ట్రంప్‌ ప్రత్యర్ధి బిడెన్‌ తాము గెలువబోతున్నామని, ప్రతీ ఓటూ కీలకమని వ్యాఖ్యానించారు. గతంలో ట్రంప్‌ గెలిచిన కీలక రాష్ట్రాలు అరిజోనా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్‌లో గెలుపుపై బిడెన్‌ ధీమా వ్యక్తం చేశారు. దీంతో ట్రంప్‌కు ఎక్కడలేని కోపమొచ్చింది. దాన్ని ట్వీట్‌ రూపంలో బయటపట్టిన ట్రంప్.. ఈ రాత్రికి తాను ఓ కీలక ప్రకటన చేయబోతున్నట్లు కూడా చెప్పుకొచ్చారు. ట్రంప్‌ ట్వీట్లు పాజిటివ్‌గా కంటే నెగెటివ్‌గా ఎక్కువగా ప్రచారం పొందుతున్నాయి. ట్రంప్‌ ఓటమిని అంగీకరించి ప్రకటన చేస్తారా అన్న ప్రచారం కూడా సాగుతోంది.

English summary
Twitter on Wednesday flagged a tweet in which President Donald Trump accused Democrats of trying to steal the presidential election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X