వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Twitter నుంచి కొత్త అప్‌డేట్: ఆ టాపిక్స్‌ పై వివరణ..యూజర్ కోసమేనంటూ..!

|
Google Oneindia TeluguNews

టెక్నాలజీ యుగంలో సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఏదైనా విషయాన్ని లేదా అభిప్రాయాన్ని ప్రపంచంతో పంచుకోవాలంటే సోషల్ మీడియానే ప్రధాన అస్త్రంగా వినియోగిస్తున్నారు చాలామంది. ఈ క్రమంలోనే ఫేస్‌బుక్, ట్విటర్ లాంటి దిగ్గజ సంస్థలు పుట్టుకొచ్చాయి. ఇక యూజర్‌ ఏం కావాలనుకుంటున్నాడో, ఎలాంటి మార్పులు చూడాలనుకుంటున్నాడో ఒక యూజర్‌కు అనుకూలంగా ఈ రెండు సోషల్ మీడియా దిగ్గజ సంస్థలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ వస్తున్నాయి. తాజాగా మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ నుంచి ఒక అప్‌డేట్ వచ్చింది. ట్రెండింగ్ టాపిక్స్ పైన ట్విటర్ సంస్థ అప్‌డేట్ తీసుకొచ్చింది.

సాధారణంగా ట్విటర్ ఓపెన్ చేయగానే కుడివైపున ట్రెండింగ్ టాపిక్స్ కనిపిస్తుంటాయి. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా ఏ అంశంపై యూజర్లు ట్వీట్ చేస్తున్నారన్న విషయాన్ని మనకు తెలుపుతుంది. అయితే ఇప్పటి వరకు ట్రెండింగ్ టాపిక్స్ మాత్రమే ఇస్తూ వచ్చిన ట్విటర్... తాజాగా ఎందుకు ఆ టాపిక్ ట్రెండ్ అవుతుందోనన్న వివరణ కూడా చెబుతోంది. ఒక టాపిక్ ఎందుకు ట్రెండ్ అవుతోందని ప్రశ్నిస్తూ గతేడాది 5 లక్షల ట్వీట్లు వచ్చాయని ట్విటర్ సంస్థ పేర్కొంది. సాధారణంగా ఒక అంశం ట్రెండ్ అవుతోందంటే అది ఎందుకు ట్రెండ్ అవుతోందో, అసలు చర్చ ఎక్కడ ప్రారంభమైందని తెలుసుకునేందుకు యూజర్ కిందకు స్క్రోల్ చేసి వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదని ట్విటర్ సంస్థ ట్వీట్ చేసింది.

ఒక టాపిక్ ఎందుకు ట్రెండ్ అవుతోందో తెలుసుకునేందుకు ఇకపై కష్టపడాల్సిన పరిస్థితి ఉండదని చెబుతూ ట్విటర్ తన అధికారిక ట్విటర్ సపోర్ట్ ద్వారా ట్వీట్ చేసింది. చర్చ దేనిపై అనేది తెలుసుకునేందుకు ఇక సులభతరం చేస్తున్నట్లు వెల్లడించింది. ఇకపై కిందకు స్క్రోల్ చేయాల్సిన పనిలేదని బుధవారం నుంచి ఆండ్రాయిడ్, మరియు ఐఓఎస్ వినియోగిస్తున్న వినియోగదారులకు ఒక ట్రెండింగ్ టాపిక్ వెంటనే ఎందుకు ట్రెండ్ అవుతుందో తెలిసిపోయేలా మార్పులు చేసినట్లు ట్విటర్ సంస్థ తెలిపింది. అంతేకాదు ట్రెండింగ్ ట్వీట్లకు సంబంధించి వచ్చే ఆర్టికల్స్ కూడా జతచేయాలని భావిస్తున్నట్లు ట్విటర్ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఒక అంశం ఎందుకు ట్రెండింగ్‌లో ఉందో చెబుతూ యూజర్‌కు ఈజీగా అర్థమయ్యేందుకు పిన్డ్ ట్వీట్స్ అండ్ డిస్క్రిప్షన్స్‌ను యాడ్ చేస్తున్నట్లు పేర్కొంది.

Twitter gives a new update on why a certain topic is trending

ఇందుకోసం ట్విటర్ క్యూరేషన్ టీమ్ ట్రెండింగ్ టాపిక్స్‌ రిఫ్లెక్ట్ అయ్యేందుకు ఒక అల్గారిథమ్‌పై పనిచేస్తున్నట్లు ట్విటర్ సంస్థ పేర్కొంది. ఉదాహరణకు ఒక ట్వీట్ ట్రెండ్ అవుతూ పాపులర్ అయితే అలాంటి ట్వీట్స్‌ను గుర్తించి ట్రెండింగ్ టాపిక్స్‌లోకి తీసుకొచ్చేలా అల్గారిథమ్ డెవలప్ చేస్తున్నట్లు ట్విటర్ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లపైనే పనిచేస్తుందని త్వరలో వెబ్ వెర్షన్‌లో కూడా తీసుకొస్తామని ట్విటర్ పేర్కొంది. ట్విటర్ యాప్‌పై ఈ కొత్త అప్‌డేట్ కనిపించాలంటే ముందుగా యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుందని సంస్థ తెలిపింది. ఈ కొత్త అప్‌డేట్‌ను తీసుకురాగానే చాలామంది ట్విటర్ యాప్‌లో పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యాప్ కూడా ఓపెన్ కాలేదు. దీన్ని గుర్తించిన ట్విటర్ సంస్థ కొన్ని క్షణాల్లోనే బగ్స్‌ను తొలగించింది.

English summary
Twitter is all set to add more context to its trending tweets so that people don’t have to specifically ask - “Why is this trending?”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X