వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్ధిక కష్టాలు: ట్విట్టర్‌కు తగ్గుతున్న ఆదరణ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ట్విట్టర్‌కు రోజు రోజుకు ఆదరణ తగ్గపోతుంది. దీనిని ట్విట్టర్ అంగీకరించకపోయినా ముమ్మాటికీ ఇది నిజం. సామాజిక మాధ్యమాల పట్ల యువతలో ఉన్నంత క్రేజ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో అగ్రస్థానంలో దూసుకుపోతున్న ఫేస్‌బుక్ ఖాతాదారుల సంఖ్య అమాంతం పెరుగుతుంటే, ట్విట్టర్‌ యూజర్లు మాత్రం తగ్గుతున్నారు.

ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ పేర్కొంది. గతేడాది చివరి మూడు నెలల్లో ట్విట్టర్‌ నుంచి 20 లక్షల మంది వైదొలగారు. ఇక షేర్ల విషయానికి వస్తే 12 శాతం తగ్గినట్టు ట్విట్టర్ యాజమాన్యం వెల్లడించింది. దీంతో ట్విట్టర్‌కు ఆదరణ తగ్గడంతో పాటు ఆర్ధికంగా నష్టాలను మూట గట్టుకుంటోంది.

అయితే ట్విట్టర్‌కు ఆదరణ తగ్గుతున్న విషయాన్ని గమనించిన యాజమాన్యం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా కొత్త ఉత్పత్తులను ప్రారంభించేందుకు సమాయత్తమవుతోంది. అయితే ఈ కొత్త ఉత్పత్తుల విషయంలో ట్విట్టర్ అడ్రస్ సమస్యను ఎదుర్కొంటుంది.

Twitter is losing customers and its stock is falling

దీంతో ఫేస్‌బుక్‌ తరహాలో అల్గారిథమిక్ టైమ్‌లైన్‌ను ప్రారంభించనున్నట్టు ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీ వెల్లడించారు. దీనివల్ల మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో ప్రతిదీ మరింత స్పష్టమైనదిగా చేయడానికి తగిన సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

మరోవైపు ఫేస్‌బుక్ మాత్రం తన ఖాతాదారులను అమాంతం పెంచుకుంటూ పోతోంది. ఇటీవలే ఫేస్‌బుక్ షేర్ల విలువ కూడా భారీగానే పెరిగింది. 2015 చివరకు ట్విటర్‌లో 30.50 కోట్ల మంది యూజర్లు ఉండగా, ఫేస్ బుక్ కు 160 కోట్లమంది ఖాతాదారులున్నారు.

ట్విట్టర్ తర్వాత వచ్చిన సోషల్ మీడియా సంస్థ ఇన్‌స్టాగ్రాం కూడా ట్విట్టర్‌ను దాటిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌కు ప్రస్తుతం 40 కోట్లమంది యూజర్లు ఉన్నారు.

Twitter Sales:
Fourth quarter of 2014: $479 million
Fourth quarter of 2015: $710 million, up 48%

Twitter Profit:
Fourth quarter of 2014: - $125 million
Fourth quarter of 2015: - $90 million, 28% improvement

Twitter Active customers:
Third quarter of 2015: 307 million
Fourth quarter of 2015: 305 million, down less than 1%

English summary
The social media company reported Wednesday that it lost 2 million users in the last three months of 2015. Shares plummeted as much as 12% in after-hours trading.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X