వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అధ్యక్షుడి ట్వీట్స్‌ను తప్పుబట్టిన ట్విటర్..అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకుంటోందా..?

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్ : ఎప్పుడూ వివాదాస్పద ట్వీట్లతో వార్తల్లో నిలిచే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సారి మళ్లీ వార్తల్లో నిలిచారు. అయితే ఈ సారి కాస్త ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ట్రంప్ ట్వీట్లు రెచ్చగొట్టేలా ఉండటమే కాదని పక్కదోవ పట్టించేలా ఉన్నాయంటూ స్వయంగా ట్విటర్‌ పేర్కొనడం విశేషం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించి రెండు ట్వీట్లను ఈ సందర్భంగా ట్విటర్ ప్రస్తావించింది. ఇక తాను చేసిన ట్వీట్లపై ట్విటర్ ఫ్యాక్ట్ చెక్ కూడా నిర్వహించింది.

 హమ్మయ్యా: కరోనా థెరపీ అయిపోయింది..హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ చక్కగా పనిచేసింది: డొనాల్డ్ ట్రంప్ హమ్మయ్యా: కరోనా థెరపీ అయిపోయింది..హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ చక్కగా పనిచేసింది: డొనాల్డ్ ట్రంప్

ట్రంప్ ట్వీట్‌పై ఫ్యాక్ట్ చెక్

ప్రస్తుతం అమెరికాలో ఓ వైపు కరోనా వైరస్ విజృంభిస్తున్నా... మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల వేడి కూడా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ట్రంప్ పలు ట్వీట్లు చేశారు. ఇందులో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నో మోసాలు పాల్పడే అవకాశం ఉందని, మెయిల్ ద్వారా ఓటు వేసినప్పటికీ వాటిని కూడా తస్కరించే పరిస్థితులు కనిపిస్తున్నాయంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు బ్యాలట్ పేపర్లపై ఫోర్జరీ సంతకాలు కూడా కనిపిస్తాయని అదే సమయంలో అక్రమంగా కూడా ప్రింట్ అయ్యే అవకాశం ఉందంటూ వివాదాస్పద ట్వీట్ చేశారు. అదే సమయంలో క్యాలిఫోర్నియా గవర్నర్ ఇలాంటి బ్యాలట్ పేపర్లను కొన్ని మిలియన్లు పంపుతున్నారని ఆరోపణలు చేశారు. దీన్నే ట్విటర్ తప్పుబట్టింది. తాము ఫ్యాక్ట్ చెక్ చేశామని ఓటింగ్ పద్ధతిలో ఎలాంటి అక్రమాలు మోసాలు జరిగే అవకాశాలు లేవని ట్విటర్ వెల్లడించింది.

 ఈ మధ్యే ఫ్యాక్ట్ చెక్ ప్రవేశపెట్టామన్న ట్విటర్

ఈ మధ్యే ఫ్యాక్ట్ చెక్ ప్రవేశపెట్టామన్న ట్విటర్

అయితే ఇంతకుముందు ఇలాంటి ఫ్యాక్ట్ చెక్ అనేది లేదని ఈ మధ్యే కంపెనీ తన కొత్త పాలసీలో భాగంగా ఫ్యాక్ట్ చెక్‌ను ప్రవేశపెట్టిందని వివరణ ఇచ్చింది. కొన్ని ట్వీట్లు ప్రమాదకరంగా మారుతున్నాయని సమాజహితం కోసమే ఫ్యాక్ట్ చెక్ నిర్వహిస్తున్నామని సంస్థ స్పష్టం చేసింది. అయితే ట్విటర్ చేసిన ఫ్యాక్ట్ చెక్‌పై ట్రంప్ క్యాంపెయిన్ మేనేజర్ స్పందించారు. పక్షపాతంతో వ్యవహరించే మీడియాతో ట్విటర్ కుమ్మక్కైందని ఆరోపించారు. ఫ్యాక్ట్ చెక్ అనేది ప్రవేశ పెట్టి తమ ప్రత్యర్థులకు పరోక్షంగా ట్విటర్ సహాయం చేసే పనిలో పడిందని ఆయన ధ్వజమెత్తారు.

Recommended Video

VVS Laxman : 'Salute To Spirit Of Human Endurance & Strength'

వాక్‌స్వాతంత్య్రాన్ని ట్విటర్ హరించివేస్తోంది

ఇదిలా ఉంటే ట్విటర్‌పై మండిపడ్డారు డొనాల్డ్ ట్రంప్. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్విటర్ సంస్థ జోక్యం చేసుకుంటోందని ఆరోపించారు. అదే సమయంలో వాక్‌స్వాంత్ర్యంను హరించివేసేలా ట్విటర్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం రోజున ట్రంప్ వరస ట్వీట్లు వేశారు. ఇదిలా ఉంటే డెమొక్రాట్లను టార్గెట్ చేస్తూ అమెరికా అధ్యక్షుడు రెచ్చిపోయినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.

English summary
Twitter says that US President Trump tweets were potentially misleading after it got fact checked.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X