వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా వైరాలజిస్ట్‌కు షాక్: కరోనా గుట్టురట్టు: నిజాన్ని నిర్భయంగా చెప్పినందుకేనా?

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ప్రపంచాన్ని కబలించి పారేస్తోన్న కరోనా వైరస్ పుట్టుకకు సంబంధించిన అంశాలను వెలుగులోకి తీసుకొచ్చిన చైనా వైరాలజిస్ట్‌కు ట్విట్టర్ షాక్ ఇచ్చింది. చైనాలోని వుహాన్ ల్యాబొరేటరీలో ఉద్దేశపూరకంగా ఈ వైరస్‌ను సృష్టించారంటూ బాంబు పేల్చిన ఆ వైరాలజిస్ట్‌ అకౌంట్‌ను సస్పెండ్ చేసింది. వుహాన్‌లో ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తోన్న ఓ ల్యాబొరేటరీలో ఈ వైరస్‌ పుట్టుకొచ్చిందని, దాన్ని కృత్రిమంగా తయారు చేశారని, దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు తన వద్ద ఉన్నాయనీ వెల్లడించిన మూడురోజుల వ్యవధిలోనే ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ అయింది.

Recommended Video

COVID-19 : Coronavirus ను సృష్టించారంటూ బాంబు పేల్చిన China Virologist అకౌంట్‌ బ్లాక్! || Oneindia

క్రైస్తవ సన్యాసినిపై రేప్: నిందితుడిగా చర్చి బిషప్‌: విచారణ వార్తలపై కేరళ కోర్టు నిషేధంక్రైస్తవ సన్యాసినిపై రేప్: నిందితుడిగా చర్చి బిషప్‌: విచారణ వార్తలపై కేరళ కోర్టు నిషేధం

చైనా బండారాన్ని బయట పెట్టిన వెంటనే..

చైనా బండారాన్ని బయట పెట్టిన వెంటనే..

ఆమె పేరు డాక్టర్ లీ-మెంగ్ యాన్. హాంకాంగ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పూర్వ విద్యార్థిని. వైరాలజీ అండ్ ఇమ్యునాలజీలో ఆమె స్పెషలైజేషన్‌ను సాధించారు. కరోనా గుట్టు రట్టు చేసిన అనంతరం భద్రతా కారణాల వల్ల ఆమె బలవంతంగా హాంకాంగ్‌ను వీడాల్సి వచ్చింది. అమెరికాకు వెళ్లిపోయారు. అక్కడే నివసిస్తున్నారు. ఈ నెల 12వ తేదీన ఆమె `లూస్ విమెన్` అనే ఓ బ్రిటీష్ టీవీ టాక్‌షోలో పాల్గొన్నారు. చైనా బండారాన్ని బయట పెట్టారు. కరోనా వైరస్ వూహాన్‌లోని ల్యాబొరేటరీలో తయారైందనడానికి తన వద్ద శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు.

నిబంధనల ఉల్లంఘన కింద..

నిబంధనల ఉల్లంఘన కింద..

నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా డాక్టర్ లీ-మెంగ్ యాన్ అకౌంట్‌ను బ్లాక్ చేసినట్లు ట్విట్టర్ వెల్లడించింది. లీ ట్విట్టర్ అకౌంట్‌లోకి వెళ్లిన వారికి.. ఈ సమాచారం కనిపిస్తోంది. కరోనా వైరస్‌పై ఎలాంటి వివాదాస్పద ప్రకటనలు చేసినప్పటికీ.. ట్విట్టర్ యాజమాన్యం తక్షణమే స్పందిస్తోంది. కరోనా వైరస్‌పై వివాదాస్పదమైన, సందేహాస్పదమైన, అపోహలను కలిగించే ఎలాంటి సమాచారాన్ని ఎవరు పోస్ట్ చేసినా దాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ట్విట్టర్ విధానాలు, నిబంధనలను ఉల్లంఘించేలా లీ-మెంగ్ యాన్ ఎలాంటి సమాచారాన్ని పోస్ట్ చేశారనేది తెలియరాలేదు.

ఫిష్ మార్కెట్‌లో పుట్టుకొచ్చిందనే వార్తలను కొట్టేసిన లీ..

ఫిష్ మార్కెట్‌లో పుట్టుకొచ్చిందనే వార్తలను కొట్టేసిన లీ..

వూహాన్‌లోని ఫిష్ మార్కెట్ నుంచి వైరస్ పుట్టుకొచ్చిందనడం పూర్తిగా అవాస్తవమని లీ-మెంగ్ తెలిపారు. చైనా ప్రభుత్వ ఆధీనంలోన పనిచేస్తోన్న వుహాన్‌లోని లాబొరేటరీలో వైరస్‌ను కృత్రిమంగా తయా చేశారంటూ బ్రిటీష్ టీవీ టాక్‌షోలో ఆమె పదే పదే వెల్లడించారు. తన వద్ద ఉన్న ఆధారాలతో వైరస్ ల్యాబ్ నుంచే వచ్చిందని చెప్పడానికి ప్రయత్నించానని, చైనా ప్రభుత్వం తనను బెదిరించినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వం తనను ఏం చేస్తుందోననే భయాందోళనలతో హాంకాంగ్‌ను వీడానని అన్నారు. కరోనా వైరస్‌ను వుహాన్‌ ల్యాబులోనే తయారుచేశారని, ఈ విషయాన్ని చైనా దాచిపెడుతోందనడంలో సందేహాలు అక్కర్లేదని తేల్చి చెప్పారు.

English summary
Twitter has suspended the social media account of the Chinese virologist Dr Li-Meng Yan, who claimed that coronavirus was developed in a Wuhan laboratory.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X