వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాస్ వెగాస్‌లో ఫెస్ట్‌లో కాల్పులు, 58 మంది మృతి: ఆర్తనాదాలు చేస్తూ పరుగెత్తారు

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చోటు చేసుకుంది. లాస్ వెగాస్‌లో ఓ మ్యూజిక్‌ ఫెస్టివల్‌లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 58 మంది మృతి చెందారు. చాలామంది గాయపడ్డారు.

|
Google Oneindia TeluguNews

లాస్ వెగాస్: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చోటు చేసుకుంది. లాస్ వెగాస్‌లో ఓ మ్యూజిక్‌ ఫెస్టివల్‌లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 58 మంది మృతి చెందారు. చాలామంది గాయపడ్డారు.

కాల్పులకు పాల్పడిన దుండగుడు స్థానిక మాన్‌డ్లే బే హోటల్‌ వద్ద దాక్కొన్నట్లు సమాచారం అందడంతో భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

లాస్‌వెగాస్‌ స్ట్రిప్‌లో నిర్వహిస్తున్న ది రూట్‌ 91 హార్వెస్ట్‌ కంట్రీ సంగీత కార్యక్రమంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. గన్‌ పేలుతున్న చప్పుడు వినిపిస్తుండగా వందలమంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగుతీస్తున్న దృశ్యం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

దీంతో పోలీసులు ఆ ప్రదేశానికి ఎవరినీ వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. తీవ్రవాద కాల్పులా, మరొకటా అనేది తేలాల్సి ఉంది. సంగీత విభావరికి వచ్చిన వారు ఆర్తనాదాలు చేస్తూ పరుగెత్తారు.

English summary
Two people have died from gunshot wounds and at least another 24 are injured after an early morning shooting in Las Vegas, Nevada, a city hospital confirmed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X