• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమెరికాలో కాల్పులు... ట్రంప్ మద్దతుదారుల ర్యాలీపై గన్ ఎక్కుపెట్టిన అగంతకుడు

|

అమెరికాలో కాల్పుల కలకలం రేగింది. శుక్రవారం(నవంబర్ 6) సాయంత్రం ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్డేల్‌లో నిరసన చేపట్టిన ట్రంప్ మద్దతుదారులపై గుర్తు తెలియని అగంతకుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు మహిళలు స్వల్పంగా గాయపడ్డారు. కదులుతున్న వాహనం నుంచే అతను కాల్పులకు పాల్పడ్డాడని నిరసన ర్యాలీలో పాల్గొన్నవారు తెలిపారు. అయితే అతనెవరు... ఎందుకు కాల్పులకు పాల్పడ్డాడన్నది ఇంకా తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు.

'ట్రంప్‌కు మద్దతుగా పదుల సంఖ్యలో నిరసనకారులం ఈస్ట్ ఓక్లాండ్ పార్క్-నార్త్ ఫెడరల్ హైవే సమీపంలోని కోరల్ రిడ్జ్ మాల్‌ వద్దకు చేరుకున్నాం. ఇంతలో ఓ బ్లాక్ పోర్షే కారు అటువైపుగా వచ్చింది. అకస్మాత్తుగా అందులో నుంచి ఓ వ్యక్తి మా వైపు కాల్పులు జరిపాడు.' అని నిరసన ర్యాలీలో పాల్గొన్న కొంతమంది తెలిపారు. ఇలాంటి అనుభవం గతంలో ఎన్నడూ తమకు ఎదురుకాలేదన్నారు.

Two injured after shooter fires pellets into crowd of Trump supporters in Fort Lauderdale

ఇంతకుముందు ఎవరైనా వాటర్ బాటిల్స్ విసిరేయడం,తమవైపు చూస్తూ ఉమ్మివేయడం వంటి చర్యల ద్వారా నిరసన కార్యక్రమాల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసేవారని... కానీ ఇలా కాల్పులు మాత్రం ఎప్పుడూ చోటు చేసుకోలేదని అన్నారు. అయినప్పటికీ శాంతియుతంగా తాము నిరసన కొనసాగిస్తున్నామన్నారు.

తాజాగా ఫ్లోరిడాలో చోటు చేసుకున్న ఘటన తరహాలోనే గత శుక్రవారం విల్టన్ మానోర్స్‌లోనూ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ముఖానికి మాస్కు ధరించిన ఓ వ్యక్తి కదులుతున్న వాహనం నుంచేే పాదాచారులపై కాల్పులు జరిపి పారిపోయాడు. తాజాకాల్పుల ఘటనకు గత సంఘటనలతో సంబంధం ఉందా లేదా అన్నది ఇప్పటికైతే తెలియలేదు.

అమెరికా : తుది ఫలితం తేలే వేళ సుప్రీం ట్విస్ట్... ఎన్నికల అధికారులకు కీలక ఆదేశాలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల తుది ఫలితం దగ్గరపడుతున్న వేళ దేశవ్యాప్తంగా నిరసనలు,మద్దతు ర్యాలీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. రిపబ్లికన్లు బైడెన్ విజయాన్ని నిరసిస్తూ ట్రంప్‌కు మద్దతుగా ర్యాలీలు చేపడుతుండగా... డెమోక్రాట్స్ బైడెన్‌కు మద్దతుగా ర్యాలీలు చేపడుతున్నారు. శుక్రవారం రాత్రి ప్రసంగించిన బైడెన్.. ఇంకా తుది ఫలితం వెల్లడికానప్పటికీ.. ఇప్పటివరకూ వెల్లడైన ఫలితాలను గమనిస్తే తమ విజయం ఖాయమైపోయిందన్నారు. ఆందోళనలు,ఉద్రిక్తతలు చెలరేగే అవకాశం ఉన్నందునా... ప్రతీ ఒక్కరూ సంయమనం పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. చివరి ఓటు లెక్కింపు వరకు ఓపికగా ఎదురుచూద్దామని పిలుపునిచ్చారు. ఇకముందులా దేశ ప్రజలను విడగొట్టే రాజకీయాలు ఉండవని... అందరినీ ఏకం చేసే రాజకీయాలే ఉంటాయని చెప్పారు.

English summary
Just after dark on Friday, two people who were part of a group demonstrating support for President Donald Trump were shot with pellet rounds in a drive-by shooting in Fort Lauderdale, authorities said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X