వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పునాదుల తవ్వకాల్లో బయటపడ్డ భారీ బాంబు... అందరి గుండెలూ గుభేల్

బ్రిటన్ లో ఓ ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్వుతుండగా ఉన్నట్లుండి ఓ భారీ బాంబు బయటపడింది. రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి ఆ బాంబును చూడగానే అందరి గుండెలూ గుభేలుమన్నాయి.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

లండన్: బ్రిటన్ లో ఓ ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్వుతుండగా ఉన్నట్లుండి ఓ భారీ బాంబు బయటపడింది. రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి ఫిరంగి గుండులాంటి 500 పౌండ్ల బరువున్న బాంబును చూడగానే అందరి గుండెలూ గుభేలుమన్నాయి.

వాయువ్య లండన్ లోని బ్రెంట్ ప్రాంతంలో బ్రాండెస్బరి పార్క్ ఏరియాలో ఈ బాంబు బయటపడింది. ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడికి పోలీసులు, బాంబు నిర్వీర్య దళం, సైనికులు చేరుకున్నారు.

ఆ ప్రాంతంలోని రెండు పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులను వెంటనే ఇళ్లకు పంపించి వేశారు. చాలామంది ఈ విషయం తెలియగానే తమ ఇళ్లు వదిలేసి బయటికి పరుగుదీశారు.

Two schools evacuated and army called in over unexploded Second World War bomb

దాదాపు 200 మీటర్ల దూరం వరకు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసి.. ఎవరినీ ఆ చుట్టుపక్కలకు రానీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ 'బాంబును గుర్తించిన వెంటనే మాకు సమాచారం ఇచ్చారు. అందుకు ఈ ప్రాంత వాసులకు ధన్యవాదాలు. స్థానికులు కూడా దూరంగా వెళ్లిపోయి మాకు చక్కగా సహకరించారు. ఎవరికీ ఎలాంటి హాని జరగకుండా మేం తీవ్రంగా శ్రమిస్తున్నాం..' అని వ్యాఖ్యానించారు.

పునాదుల తవ్వకాల్లో బయటపడింది కచ్చితంగా రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు అని, దానిని చూడగానే అదిరిపోయామని, ఎలాంటి విస్ఫోటనం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ దాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు.

English summary
Two schools and nearby homes have been evacuated after a suspected Second World War bomb was discovered on a building site. A huge cordon is in place and roads have been closed after the unexploded device was found near Brondesbury Park in Brent, north-west London. The army has been called in to deal with the bomb while police and the fire service also remain on the scene, Brent Council said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X