వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారతీయుల్ని విడిచిపెట్టిన టెర్రరిస్ట్‌లు, భార్యకు మెసేజ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: లిబియా రాజధాని ట్రిపోలీలో కిడ్నాప్‌కు గురైన భారతీయులు క్షేమంగానే ఉన్నారు. దీంతో వారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. అపహరించిన నలుగురిని ఉగ్రవాదులు విడిచిపెట్టారు. తాము క్షేమంగానే ఉన్నట్లు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.

శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన బలరాం తన భార్యకు.. తాము క్షేమంగానే ఉన్నట్లు సందేశం పంపించారు .బలరాం తన భార్య శ్రీదేవికి సందేశం పంపించారు. యూనివర్సిటీలో తాము క్షేమంగా ఉన్నట్లు సందేశంలో పేర్కొన్నారు. వారు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కిడ్నాప్‌కు గురైన వారిలో గోపీకృష్ణ (టెక్కలి), బలరాం (కరీంనగర్), లక్ష్మీకాంత్ (కర్నాటక), విజయ్ కుమార్‌ (కర్నాటక)లు ఉన్నారు. వీరిని టెర్రరిస్టులు బుధవార కిడ్నాప్ చేశారు. అయితే, వారు ఏ టెర్రరిస్టులు అనేది తెలియాల్సి ఉంది.

సుష్మా స్వరాజ్ ట్వీట్

Two of the four indians who were abducted allegedly by the ISIS have been released

లిబియాలో అపరహణకు గురైన భారతీయులను క్షేమంగా విడిపించుతున్నామని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. లక్ష్మీకాంత్, విజయ్ కుమార్‌లు విడిపించామని, మిగతా ఇద్దర్నీ విడిపిస్తామని చెప్పారు. ఇంకా విడుదల కాలేదని పేర్కొన్న ఆ ఇద్దరు తెలుగువారు. ఆ తర్వాత వారిని కూడా కిడ్నాపర్లు విడుదల చేశారు. అందుకే భార్యకు బలరాం సందేశం పెట్టారని తెలుస్తోంది.

అంతకుముందు....

లిబియాలో నలుగురు భారతీయులు కిడ్నాప్‌కు గురైన విషయం తెలియగానే కేంద్రం వెంటనే స్పందించింది. వారిని క్షేమంగా విడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. వారిని ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదులు కిడ్నాప్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి.

కిడ్నాప్‌కు గురైన నలుగురు భారతీయులను వెనక్కి తీసుకువచ్చేందుకు చర్యలు ప్రారంభించామని భారత విదేశాంగ శాఖ శుక్రవారం తెలిపింది. ఢిల్లీలో విదేశాంగ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ... లిబియాలోని అధికారులతో చర్చలు ప్రారంభించామన్నారు.

నలుగురికి ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని తెలిపారు. బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడామని చెప్పారు. వారిని కిడ్నాపర్ల నుంచి విడిపిస్తామని చెప్పారు. వారికి ఎలాంటి ప్రమాదం వాటిల్లదన్నారు. క్షేమంగా తీసుకు వచ్చేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు.

తెలుగువారిని క్షేమంగా విడిపించాలని కంభంపాటి లేఖ

లిబియాలో అపహరణకు గురైన తెలుగు వారిని, ఇతరులను క్షేమంగా విడిపించేందుకు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు శుక్రవారం లేఖ రాసింది. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు విదేశాంగ శాఖ అధికారుల్ని కలిసి విడిపించేందుకు త్వరగా చర్యలు చేపట్టాలన్నారు. తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ కూడా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

ఐసిస్ ఉగ్రవాదులు నలుగురు భారతీయులను కిడ్నాప్ చేసిన, ఆ తర్వాత విడుదల చేశారు. ఇందులో ఇద్దరు తెలుగువారు ఉన్నారు. అపహరణకు గురైన వారిలో... తెలుగువారు బలరాం, గోపీకృష్ణలు, కర్నాటకవాసులు లక్ష్మీకాంత్, విజయ్ కుమార్‌లు ఉన్నారు.

బలరాం, గోపీకృష్ణలు కొన్నేళ్లుగా అక్కడ ప్రొఫెసర్లుగా పని చేస్తున్నారు. బలరాం స్వస్థలం కరీంనగర్. వారి కుటుంబం అల్వాల్‌లో ఉంటోంది. 2010లో బలరాం లిబియా వెళ్లారు.

కిడ్నాప్‌కు గురైన విషయం తెలిసి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం కాపాడేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇక, గోపీకృష్ణది శ్రీకాకుళం జిల్లా టెక్కలి. లక్ష్మీకాంత్, విజయ్ కుమార్‌లలో ఒకరిది రాయచూర్, మరొకరిది బెంగళూరు.

ఈ నలుగురు లిబియా రాజధాని ట్రిపోలీకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిరిటీ వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పని చేస్తున్నారు. కిడ్నాప్‌కు గురైన తమ కుటుంబ సభ్యులను విడిపించాలని బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

English summary
Two of the four indians who were abducted allegedly by the ISIS have been released, the MEA has said. Two others are still being held hostage and are expected to be released soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X