• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మనుషులపైనే కాదు జంతువులపైనా కరోనా పంజా .. కరోనా సోకి రెండు తెల్లపులి పిల్లల మృతి

|

కరోనావైరస్ మహమ్మారి ఇప్పుడు మనుషులపైనే కాదు జంతువుల పైన కూడా తన ప్రభావాన్ని చూపిస్తుంది అని తెలుస్తోంది. గతంలో పాకిస్థాన్ జంతుప్రదర్శనశాలలో 11 వారాల వయసున్న రెండుతెల్ల పులి పిల్లలు మరణించాయి. ఇక ఈ పులి పిల్లలు కరోనా మహమ్మారి సోకడం వల్ల మరణించాయని తాజాగా వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్లో జనవరి 30వ తేదీన లాహోర్ జూలో పులి పిల్లలు చనిపోయాయి. అయితే జూ అధికారులు ఫెలైన్ పన్లూకోపెనియా వైరస్ అని భావించి చికిత్స చేసినప్పటికీ నాలుగు రోజుల తరువాత పులి పిల్లలు మరణించాయి.

 ధూమపానం చేసేవారికి , శాఖాహారులకు కరోనావైరస్ సంక్రమించే ప్రమాదం తక్కువ : సిఎస్ఐఆర్ సెరోసర్వే ధూమపానం చేసేవారికి , శాఖాహారులకు కరోనావైరస్ సంక్రమించే ప్రమాదం తక్కువ : సిఎస్ఐఆర్ సెరోసర్వే

 కరోనా వైరస్ సోకి తెల్ల పులి పిల్లలు మృతి చెందాయని పోస్ట్ మార్టం రిపోర్ట్

కరోనా వైరస్ సోకి తెల్ల పులి పిల్లలు మృతి చెందాయని పోస్ట్ మార్టం రిపోర్ట్


ఇక పులి పిల్లల పోస్టుమార్టం రిపోర్టులో ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయని, అవి తీవ్రమైన కరోనావైరస్ ఇన్ఫెక్షన్ తో బాధ పడడం వల్ల మరణించాయని తేలింది. పాథాలజిస్టులు తెల్ల పులి పిల్లలు కరోనా మహమ్మారి కారణంగా మరణించాయని ధృవీకరించారు.

కరోనా కారణంగా పులి పిల్లలు మృతి చెందడంతో, వాటి మరణం తర్వాత జూలో పనిచేస్తున్న అధికారులందరినీ, అలాగే జంతువులన్నింటికీ కరోనావైరస్ కోసం పిసిఆర్ పరీక్ష నిర్వహించినట్లుగా జూ డిప్యూటీ డైరెక్టర్ కిరణ్ సలీమ్ తెలిపారు.

జాంబిరెడ్డి హీరోయిన్ క్లీవేజ్ షో.. అందాలతో కవ్విస్తున్న యంగ్ హీరోయిన్

లాహోర్ జూలో మరో ఆరుగురికి పాజిటివ్ , జంతువుల హక్కుల కార్యకర్తలు ఆగ్రహం

లాహోర్ జూలో మరో ఆరుగురికి పాజిటివ్ , జంతువుల హక్కుల కార్యకర్తలు ఆగ్రహం

అయితే ఇందులో ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది. పాకిస్థాన్లో కరోనా మహమ్మారి కారణంగా 12, 256 ఆరు మంది మృతి చెందారని, అదేవిధంగా మరణించిన పులి పిల్లలు కూడా కరోనా కారణంగా మరణించినట్లు జూ డిప్యూటీ డైరెక్టర్ పేర్కొన్నారు. పులి పిల్లలకు వాటిని నిర్వహించే వ్యక్తి నుండి కరోనా వైరస్ సోకి ఉండొచ్చని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే సమయంలో లాహోర్ జంతుప్రదర్శనశాలలో అధికారుల నిర్లక్ష్యం, నిర్వహణ లోపం వల్లే రెండు తెల్ల పులి పిల్లలు చనిపోయాయని జంతువుల హక్కుల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యం వల్లే తెల్ల పులిపిల్లల మృతి : జంతువుల హక్కుల కార్యకర్తలు ఫైర్

అధికారుల నిర్లక్ష్యం వల్లే తెల్ల పులిపిల్లల మృతి : జంతువుల హక్కుల కార్యకర్తలు ఫైర్

జెఎఫ్‌కె (జస్టిస్ ఫర్ కికి) యానిమల్ రెస్క్యూ అండ్ షెల్టర్ వ్యవస్థాపకుడు జుఫిషన్ అనుషే అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు.
తెల్ల పులులు చాలా అరుదుగా ఉంటాయని , వాటికి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ఒక నిర్దిష్ట ఆవాసాలు మరియు వాతావరణం అవసరం అని పేర్కొన్నారు. వైద్య ఏర్పాట్లు లేని అపరిశుభ్రమైన పరిస్థితులలో వాటిని బోనులో ఉంచటం వల్ల అవి అనారోగ్యానికి గురయ్యాయి అని ఆరోపిస్తున్నారు.

ఆరోపణలను ఖండించిన జూ అధికారులు , ఎలాంటి లోపాలు లేవని వివరణ

ఆరోపణలను ఖండించిన జూ అధికారులు , ఎలాంటి లోపాలు లేవని వివరణ

జంతువుల హక్కుల కార్యకర్తల ఆరోపణలను జంతుప్రదర్శనశాల డిప్యూటీ డైరెక్టర్ సలీమ్ తిరస్కరించారు. జంతు హక్కుల కార్యకర్తలు జూ లో ఉన్న వసతులు , జంతువుల భద్రత మరియు పరిశుభ్రత ప్రోటోకాల్‌లను సందర్శించడానికి , తనిఖీ చేయడానికి రావచ్చని, జూలో ఎటువంటి భద్రతా లోపాలు, వసతుల లేమి లేవని పేర్కొన్నారు. ఏదిఏమైనప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే జంతువులు కూడా కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోతాయని , వాటి విషయంలోనూ జాగ్రత్తగా ఉండటం అవసరమని పలువురు చెబుతున్నారు.

English summary
Two 11-week-old white tiger cubs that died in a Pakistani zoo last month appear to have died of Covid-19, officials said. The cubs died in the Lahore Zoo on January 30, four days after beginning treatment for what officials thought was feline panleukopenia virus, a disease that zoo officials said is common in Pakistan and targets cats' immune system. But an autopsy found the cubs' lungs were badly damaged and they were suffering from severe infection, with pathologists concluding they died from Covid-19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X