వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాంబుల వాన: 100 మంది ఐఎస్ ఉగ్రవాదుల హతం

లిబియాలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై అమెరికా యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల ద్వారా దాదాపు 100 మంది ఉగ్రవాదులను అమెరికా హతమార్చింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: లిబియాపై వైమానిక దాడులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించి నెల కూడా గడవకుండానే ఆ దేశంలోని ఐఎస్ ఉగ్ర శిబిరాలపై అమెరికా యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి.

ఈ దాడుల ద్వారా దాదాపు 100 మంది ఉగ్రవాదులను అమెరికా హతమార్చింది. లిబియా నగరం సిర్త్ ఆగ్నేయ ప్రాంతంలోని రెండు ఐఎస్ శిబిరాలపై బుధవారం రాత్రి రెండు ఎయిర్ ఫోర్స్ బీ-2 స్టెల్త్ బాంబర్లు వందకు పైగా బాంబులు వేశాయి.

అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ పీటర్ కుక్ ఈ విషయం వెల్లడించారు. అమెరికా అధ్యక్ష్యుడి హోదాలో ఉండగా బరాక్ ఒబామా ఈ ఆపరేషన్ కు ఆమోదం తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు.

U.S. Bombs ISIS Camps in Libya

బీ-2 స్టెల్త్ బాంబర్లను రంగంలోకి దించడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఈ శిబిరాల్లో ఉన్న ఉగ్రవాదులు ఐరోపా దేశాల్లో పెద్ద ఎత్తున దాడులకు పన్నాగాలు పన్నుతున్నారని, ఈ నేపథ్యంలో ఈ దాడులు అత్యంత కీలకమని అమెరికా రక్షణ మంత్రి ఏబీ కార్టర్ పేర్కొన్నారు.

లిబియా నుంచి ఉగ్రవాదులను తరిమేయడానికి ఇటువంటి ముఖ్య ఆపరేషన్లు అవసరమని, ఈ దాడుల్లో ఎంక్యూ-9 సాయుధ డ్రోన్లు కూడా పాల్గొన్నట్లు వివరించారు. యుద్ధ విమానాల దాడుల తర్వాత ఇవి హెల్ ఫైర్ మిస్సైళ్ళను ప్రయోగించినట్లు వైమానిక దళ ప్రతినిధి కర్నాల్ ప్యాట్రిక్ రైడర్ తెలిపారు. ఈ ఉగ్రవాద శిబిరాలు మారుమూల ప్రాంతాల్లో ఉన్నాయని, వాటి సమీపంలో సాధారణ పౌరులు ఎవరూ లేరని ఆయన పేర్కొన్నారు.

English summary
Two United States Air Force B-2 bombers attacked Islamic State training camps in Libya overnight, killing more than 80 militants, including some who were involved in plotting terrorist attacks in Europe, the Pentagon said on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X