వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జెట్ ఇంజిన్ సమాచారం దొంగిలించిన చైనా అధికారులు, అమెరికాలో కేసు నమోదు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: జెట్ ఇంజిన్ డాటా హ్యాక్‌కు సంబంధించి ఇద్దరు చైనా అధికారులపై అమెరికా మంగళవారం కేసు నమోదు చేసింది. వాణిజ్య విమానాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని తస్కరిస్తున్నారని వారిపై కేసులు నమోదు చేసింది. గత కొన్నేళ్లుగా వీరు అమెరికా రహస్యాలను చైనాకు చేరవేస్తున్నారని పేర్కొన్నారు.

షాకింగ్ వీడియో: హఠాత్తుగా పెరిగిన ఎస్కలేటర్ వేగం, భయంతో ఫ్యాన్స్ అరుపులుషాకింగ్ వీడియో: హఠాత్తుగా పెరిగిన ఎస్కలేటర్ వేగం, భయంతో ఫ్యాన్స్ అరుపులు

జియాంగ్‌సు ప్రావిన్స్ మినిస్ట్రీ ఆప్ స్టేట్ సెక్యూరిటీలో ఝా రాంగ్, చై మెంగ్ అనే అధికారులు పని చేస్తున్నారు. వీరితో పాటు మరికొందరు చైనా జాతీయులు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో చాలామంది ఇంటెలిజెన్స్ అధికారులు, హ్యాకర్లు, ప్రయివేటు కంపెనీల్లో వ్యక్తులు ఉన్నారు.

కంపెనీల కంప్యూటర్లలోకి చొరబడి సమాచారం

కంపెనీల కంప్యూటర్లలోకి చొరబడి సమాచారం

వీరంతా గత అయిదేళ్ల నుంచి ఆయా కంపెనీల కంప్యూటర్లలోకి చొరబడి సమాచారాన్ని దొంగిలిస్తున్నారని అమెరికా జస్టిస్ డిపార్టుమెంట్ ఓ ప్రకటనలో పేర్కొంది.

 రహస్య సమాచారం సేకరణ

రహస్య సమాచారం సేకరణ

అమెరికా రక్షణ సమాచారమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు జస్టిస్ డిపార్టుమెంట్ పేర్కొంది. కమర్షియల్ విమానాల టర్పోఫ్యాన్ ఇంజిన్ సమాచారం, మేధో సంపద, రహస్య సమాచారం, వ్యాపార సంబంధ వివరాలు వీరు సేకరిస్తున్నారు.

టర్బో ఫ్యాన్ ఇంజిన్ సమాచారం దొంగిలించారు

టర్బో ఫ్యాన్ ఇంజిన్ సమాచారం దొంగిలించారు

జనవరి 10వ తేదీ నుంచి 2015 మే వరకు వాణిజ్య విమానానికి సంబంధించిన టర్బో ఫ్యాన్ ఇంజిన్ సమాచారాన్ని దొంగిలించారు. ఫ్రాన్స్‌కు చెందిన ఓ విమాన తయారీ సంస్థ, చైనాలోని ఓ సంస్థ, అమెరికా సంస్థతో కలిసి ఈ ఇంజిన్‌ను అభివృద్ధి చేస్తోంది.

కంప్యూటర్లను హ్యాక్ చేశారు

కంప్యూటర్లను హ్యాక్ చేశారు

కానీ చైనా ఇంటెలిజెన్స్ అధికారులు ఝా, మెంగ్‌లు తమ బృందంతో కలిసి ఆ సంస్థకు చెందిన అరిజోనా, మసాచ్యుసెట్స్ ఆఫీసుల్లోని కంప్యూటర్లను హ్యాక్ చేశారు. జియాంగ్‌సు ప్రావిన్స్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ సంస్థకు చెందిన ఓ ఇంజినీర్ జెట్ విమానాల ఇంజిన్ సమాచారాన్ని తస్కరిస్తుండగా సెప్టెంబర్‌లో అరెస్టు చేశారు. ఆ సమయంలో టర్పోఫ్యాన్ ఇంజిన్ సమాచార దొంగతనం విషయం అధికారులకు తెలిసింది.

English summary
Chinese intelligence officers conspired with hackers and company insiders to break into private companies’ computer systems and steal information on a turbo fan engine used in commercial jetliners, according to a U.S. indictment unsealed on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X