• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భారత్‌కు మొదలైన అమెరికా కరోనా సాయం- ఢిల్లీకి భారీ విమానంలో సామాగ్రి, వ్యాక్సిన్లు

|

భారత్‌లో కరోనా రెండో దశ నేపథ్యంలో చేస్తానన్న సాయాన్ని అమెరికా ప్రారంభించింది. గతంలో భారత్‌ తమకు చేసినట్లుగానే ఈసారి వారికి సాయం అందిస్తామన్న అధ్యక్షుడు జో బైడెన్ మాటల్ని నిజం చేస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక విమానం కరోనా సామాగ్రి, వ్యాక్సిన్లు, వైద్య పరికరాలు, ఇతర సాయాన్ని మోసుకుంటూ కాలిఫోర్నియా నుంచి భారత్‌కు పయనమైంది. ఇవాళ ఈ ప్రత్యేక సైనిక విమానం న్యూఢిల్లీ చేరుకోబోతోంది. అటు భారత్లో వ్యాక్సిన్ల కొరత దృష్ట్యా తాము పెట్టిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ల ఆర్డర్‌ను కూడా అమెరికా మన దేశానికి మళ్లించింది.

మాట నిలబెట్టుకున్న బైడెన్‌

మాట నిలబెట్టుకున్న బైడెన్‌

భారత్‌లో కరోనా కల్లోలం నేపథ్యంలో అండగా ఉంటామన్న మాటను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గంటల వ్యవధిలోనే చేతల్లోకి తెచ్చారు. అమెరికా నుంచి భారత్‌కు అత్యవసర వైద్య సామాగ్రి, వ్యాక్సిన్లు, ఇతర సాయాన్ని పంపారు. ఇందులో 1700 ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్లు, 15 మిలియన్ల ఎన్‌ 95 మాస్కులు, పది లక్షల ర్యాపిడ్ టెస్ట్‌ కిట్‌లు, 20 వేల డోసుల రెమిడెసివిర్ ఇంజెక్షన్లు పంపుతున్నారు. తొలి విడత విమానంలో వీటిలో కొంత సామాగ్రి పంపారు. వీటి రాకతో కరోనాపై భారత్‌ చేస్తున్న పోరాటంపై ఎంతో ఉపయోగంగా ఉంటాయని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రరంచంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశంగా ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్న మోడీ సర్కార్‌కు అమెరికా సాయం గోప్ప ఊరట కానుంది.

ప్రపంచంలోన్ అతిపెద్ద సైనిక విమానంలో

ప్రపంచంలోన్ అతిపెద్ద సైనిక విమానంలో

భారత్‌కు చేస్తున్న కరోనా సాయం కూడా తమ స్ధాయికి తగినట్లుగా ఉండాలని బావించారో ఏమో.. జో బైడెన్ టీమ్‌ ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక విమానంలో ఈ సామాగ్రి, ఇతర సాయాన్ని మన దేశానికి పంపారు. కాలిఫోర్నియాలోని ట్రావిస్‌ ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌ నుంచి అమెరికాతో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక విమానం భారత్‌కు ఈ సాయాన్ని మోసుకుంటూ బయలుదేరింది. దీంతో ఈ దశాబ్దంలో భారత్‌కు అమెరికా చేస్తున్న అతిపెద్ద సాయం కూడా ఇదే కానుంది.

ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లు భారత్‌కు మళ్లింపు

ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లు భారత్‌కు మళ్లింపు


కరోనాతో అల్లాడుతున్న భారత్‌లో మూడో దశ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలవుతున్నా అందుకు తగినట్లుగా వ్యాక్సిన్‌ నిల్వలు లేవు. దీంతో భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిగా గాడితప్పింది. దీంతో అమెరికా తమ దేశానికి ఆర్డర్‌ పెట్టిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లను కూడా భారత్‌కు మళ్లించింది. తమ ప్రజల్ని కాదని జో బైడెన్‌ భారత్‌కు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లు పంపాలని తీసుకున్న సాహసోపేత నిర్ణయం కూడా చర్చనీయాంశమవుతోంది. ప్రస్తుతం కాలిఫోర్నీయా నుంచి బయలుదేరిన సైనిక విమానంలోనే ఈ వ్యాక్సిన్లు భారత్‌ చేరుకోనున్నాయి.

  PM Modi Announces India-US 2030 Climate Partnership || Oneindia Telugu
  తొలివిడతలో చేస్తున్న సాయం ఇదే

  తొలివిడతలో చేస్తున్న సాయం ఇదే


  భారత్‌కు ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక విమానంలో అమెరికా పంపుతున్న వైద్య సామాగ్రి, ఇతర సాయం వివరాలు ఇలా ఉన్నాయి. కాలిఫోర్నియా రాష్ట్రం విరాళంగా ఇచ్చిన 440 ఆక్సిజన్‌ సిలెండర్లు, లక్ష ఎన్‌ 95 మాస్కులు, 9.6 లక్షల ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్‌లు ఉన్నట్లు యూఎస్ అంతర్జాతీయ అభివృద్ది మండలి ఓ ప్రకటనలో తెలిపింది. వీటితో పాటు వెయ్యి ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్లు కూడా భారత్‌కు అందిస్తోంది. భారత్‌కు పంపుతున్న తొలి విడత ఆక్సిజన్ సిలెండర్లు అక్కడే ఉంచి వాటిని నింపుకుంటూ వాడతారని వైట్‌హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. త్వరలో మరిన్ని విమానాల్లో కరోనా సాయం పంపుతామని తెలిపింది. అంతే కాదు భారత్‌లోనే నేరుగా కొనుగోలు చేసి ఇక్కడి ఆస్పత్రులకు, ప్రభుత్వాలకు సాయం చేస్తామనీ వెల్లడించింది.

  English summary
  Supplies and assistance to help India battle a second COVID-19 wave began making their way from the United States on Wednesday, April 28, 2021, with the U.S. Agency for International Development (USAID) announcing that the “world’s largest military aircraft” had left Travis Air Force Base in California for New Delhi.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X