• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

యూఎస్ ఎలక్షన్ టైమ్ లో కరోనా ఉధృతి .. కోటికి చేరువగా కేసుల వేగం .. ట్రంప్ కొంప ముంచేస్తుందా ?

|

282 రోజుల క్రితం వాషింగ్టన్ స్టేట్‌లో మొట్టమొదటి కరోనావైరస్ కేసు నమోదు కాగా యునైటెడ్ స్టేట్స్, నిన్నటివరకు మొత్తం తొమ్మిది మిలియన్ల కరోనా వైరస్ కేసులను దాటింది . గత వారంలో అర మిలియన్ కు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయంటే అక్కడ కరోనా ఉధృతి ఎంతగా ఉందో అర్ధం చేసుకోవచ్చు . అసలే ఎన్నికల వేడి పీక్స్ కి చేరిన సమయంలో పెరుగుతున్న కరోనా కేసులు ట్రంప్ కు తలనొప్పిగా మారాయి. యూఎస్ లో కరోనా మహమ్మారి ట్రంప్ కొంప ముంచేసేలా పంజా విసురుతుంది .

వారంరోజుల్లో భారీగా నమోదైన కేసులు

వారంరోజుల్లో భారీగా నమోదైన కేసులు

ఒకపక్క యూఎస్ ఎన్నికల సమయంలో కోవిడ్ -19 అత్యధిక కేసుల నమోదుతో దూసుకెళ్తోంది. దేశవ్యాప్తంగా, భయంకరమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే 89,000 కేసులు నమోదుజరిగిందంటే మహమ్మారి పరిస్థితి అర్ధం అవుతుంది . ఒకపక్క ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉధృతంగా మాటల తూటాలు ఎక్కుపెడుతుంటే ట్రంప్ కి ఇబ్బంది కలిగించేలా 20 కి పైగా రాష్ట్రాలు గత వారంలో ఎక్కువ కేసులను నివేదించాయి.

తాజా పరిస్థితిపై అధికారుల ఆందోళన ..

తాజా పరిస్థితిపై అధికారుల ఆందోళన ..

ఇక పెరుగుతున్న కరోనా కేసులతో యూఎస్ సతమతమవుతుంది .ఇక కోవిడ్ బారిన పడిన రోగులను ఎల్ పాసో మరియు మిల్వాకీ శివారులోని క్షేత్ర ఆసుపత్రులకు తరలించారు . పెరుగుతున్న వ్యాప్తి చికాగోలో వ్యాపారాలపై కొత్త ఆంక్షలకు దారితీసింది. ఇక ఏ రాష్ట్రాలు కేసులలోక్షీణతను నివేదించలేదు . ప్రస్తుత పరిస్థితిపై షుగర్ కోట్ వేసి చెప్పటానికి వీలు లేదు . మేము అత్యవసర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని, మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు, మీ పొరుగువారికి ప్రమాదం పొంచి ఉంది అని విస్కాన్సిన్ ప్రభుత్వ అధికారి టోనీ ఎవర్స్ అన్నారు.

  US Election 2020 : Biden Leads Trump ఆ రాష్ట్రాల్లో జో బైడెన్ కు మెజారిటీ ఓట్లు..!!
  ఉప్పెనలా కరోనా ... ట్రంప్ కి ప్రతికూలంగా పరిస్థితి

  ఉప్పెనలా కరోనా ... ట్రంప్ కి ప్రతికూలంగా పరిస్థితి

  ఆసుపత్రులు దెబ్బతిన్నాయి, కేసుల సంఖ్య బాగా పెరిగిందని పేర్కొన్నారు . గత వారంలో 200 కి పైగా కరోనావైరస్ మరణాలు సంభవించాయని చెప్పారు . యూఎస్ ప్రెసిడెంట్ ఎన్నికలకు కేవలం కొద్ది రోజులు మిగిలి ఉండటంతో ఒకపక్క ఎన్నికల్లో దేశం ఇప్పుడు రోజుకు సగటున 75,000 కొత్త కేసులను నమోదు చేస్తుంది. ఈ లెక్కల ప్రకారం మహమ్మారి పంజా విసురుతుంది. విస్కాన్సిన్-మిల్వాకీ యూనివర్శిటీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విశ్వవిద్యాలయంలో ఎపిడెమియాలజిస్ట్ అమండా సిమనెక్ మాట్లాడుతూ, "ఈ ఉప్పెన మనం ఇప్పటివరకు చూసిన ఇతర వైరస్ ల కంటే చాలా డేంజర్ " అని అన్నారు.

  యూఎస్ లో కోటి కేసులకు చేరుకునే అవకాశం

  యూఎస్ లో కోటి కేసులకు చేరుకునే అవకాశం

  చల్లటి వాతావరణంలో ఇది చాలా మందికి వ్యాపించే ప్రమాదం ఉంది అని పేర్కొన్నారు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అని హెచ్చరించారు . యూఎస్ లో తాజా కరోనా కేసుల ఉధృతి బట్టి అది త్వరలోనే కోటి కేసులను నమోదు చేస్తుందన్న ఆందోళన వ్యక్తం అవుతుంది. వింటర్ సీజన్ లో కరోనా బాగా వ్యాపిస్తుందని ఇప్పటికే పలు అధ్యయనాలు యూఎస్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశాయి. ఈ నేపధ్యంలో కరోనా మహమ్మారి యూఎస్ లో కంట్రోల్ లేకుండా పెరుగుతుంది . ఇది అధికారంలో ఉన్న ట్రంప్ కి ఎన్నికల్లో ఇబ్బందిగా మారింది.

  అధ్యక్ష ఎన్నికల్లో ఎదురీదుతున్న ట్రంప్... కరోనా కొంప ముంచేసిందా ?

  అధ్యక్ష ఎన్నికల్లో ఎదురీదుతున్న ట్రంప్... కరోనా కొంప ముంచేసిందా ?

  తాజా కరోనా తీవ్రత ప్రభావం యూఎస్ ఎన్నికల మీద తప్పక ఉంటుందనే భావన వ్యక్తం అవుతుంది. ఈ పరిణామాలు ట్రంప్ కు ఇబ్బందికరంగా మారే అవకాశం లేకపోలేదు . అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌కు ఎదురీత తప్పేలా లేదు . అత్యంత ప్రతికూల పరిస్ధితుల మధ్య దేశ అధ్యక్ష ఎన్నికలు ఎదుర్కొంటున్న ట్రంప్‌ అధికారం నిలబెట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నా, కరోనా మాత్రం ట్రంప్ కు చుక్కలు చూపిస్తుంది. తాజా ఎన్నికల సమయంలో కరోనా పంజా విసురుతుంది. దీంతో క్షేత్రస్ధాయిలో మాత్రం ట్రంప్ కి అనుకూలత కనిపించడం లేదు. కరోనా ప్రభావం, దేశ ఆర్ధిక వ్యవస్ధ తలకిందులు కావడంతో ట్రంప్ కు ప్రతికూల సంకేతాలు కనిపిస్తున్నాయి.

  English summary
  The first case of coronavirus was reported in Washington state 282 days ago, and the United States has crossed nine million coronavirus cases by yesterday. If more than half a million corona cases were registered in the last week. The rising corona cases have become a headache for Trump as the president election heats up. The corona epidemic in the US throws the claw to drown Trump.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X