వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

US elections 2020: అమెరికా అధ్యక్ష పోరులో నువ్వా నేనా .. తేల్చుకోనున్న ట్రంప్ , జో బైడెన్

|
Google Oneindia TeluguNews

డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ లు నువ్వానేనా అన్నట్టుగా ప్రచారం సాగించిన అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. క్లైమాక్స్ కు చేరుకున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనూ డోనాల్డ్ ట్రంప్, జో బైడెన్ లు మాటల తూటాలు పేల్చారు. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచం మొత్తం ఆసక్తి కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

మళ్ళీ తానే గెలుస్తానంటున్న ట్రంప్ .. జో బైడెన్ పై తీవ్ర వ్యాఖ్యలు

మళ్ళీ తానే గెలుస్తానంటున్న ట్రంప్ .. జో బైడెన్ పై తీవ్ర వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ మళ్లీ తానే గెలుస్తానని, అధ్యక్షుడిని అవుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. డెమోక్రాట్లకు పట్టం కడితే అమెరికా ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుందని హెచ్చరిస్తున్నారు. ప్రచారంలో ముమ్మరంగా పాల్గొన్న ట్రంప్ 2016లో కంటే భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని చెబుతున్నారు. జో బైడెన్ కు అవకాశం ఇస్తే దేశంలో పన్నులు విపరీతంగా పెరుగుతాయని, అతను పెద్ద అవినీతిపరుడని, అమెరికా ఎన్నికల చరిత్రలోనే ఇంత చెత్త అభ్యర్థిని తానెప్పుడూ చూడలేదని పరుష పదజాలంతో డోనాల్డ్ ట్రంప్ జో బైడెన్ పై విరుచుకుపడుతున్నారు .

 కరోనా కల్లోలం ట్రంప్ నిర్ణయాల వల్లే .. గద్దె దించండంటున్న జో బైడెన్

కరోనా కల్లోలం ట్రంప్ నిర్ణయాల వల్లే .. గద్దె దించండంటున్న జో బైడెన్

డెమోక్రాట్ల నుండి బరిలోకి దిగిన జో బైడెన్ డొనాల్డ్ ట్రంప్ పై మండిపడుతున్నారు. గత నాలుగేళ్లలో అన్నిరంగాల్లో దేశాన్ని డోనాల్డ్ ట్రంప్ నాశనం చేశారని, దేశంలో కరోనా కేసులు పెరగడానికి, ప్రపంచంలోనే అత్యధికంగా కరోనాతో అమెరికా దెబ్బతినడానికి ట్రంప్ తీసుకున్న నిర్ణయాలే కారణమంటూ విరుచుకుపడుతున్నారు. ట్రంప్ ను గద్దె దించాలని ఓటర్లను విజ్ఞప్తి చేస్తున్నారు. అమెరికాను విభజించి ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అంటూ మండిపడుతున్నారు.

ఇక మరోవైపు తాజాగా అమెరికాలో కరోనా సెకండ్ వేవ్ మొదలై కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ పరిణామాలు ట్రంప్ కు నష్టాన్ని చేకూరుస్తాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

 సర్వేలన్నీ జో బైడెన్ కే అనుకూలం

సర్వేలన్నీ జో బైడెన్ కే అనుకూలం


మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల పై జరిపిన సర్వేలన్నీ జో బైడెన్ కు అనుకూలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ కంటే జో బైడెన్ ప్రజారోగ్య సంక్షోభాన్ని ప్రస్తుతం సమర్థవంతంగా ఎదుర్కొంటారని అమెరికన్ ఓటర్లు చాలామంది విశ్వసిస్తున్నట్లు గా సర్వేలు చెబుతున్నాయి. ట్రంప్ కంటే బైడెన్ ఎక్కువ ప్రజాభిమానాన్ని సంపాదించారని తాజా సర్వేలు పేర్కొంటున్నాయి.
ట్రంప్‌ ప్రధానంగా అక్రమ వలసలు అదుపుచేయడం, ఆర్థిక అంశాలపై జాతీయ వాద కోణంలో తన హయాంలో సాధించిన విజయాలను ప్రచారం సాగించటం చేస్తున్నారు.

Recommended Video

US Election 2020 : అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో వైద్యులపై అక్కసు వెళ్లగక్కిన Donald Trump
అమెరికా సంక్షోభం నుండి గట్టెక్కించేవారెవరు ?

అమెరికా సంక్షోభం నుండి గట్టెక్కించేవారెవరు ?


ఓటర్లలో 65 శాతం ఉన్న శ్వేత జాతీయుల ఓట్లు తనకే పడతాయన్న ధీమా లో ట్రంప్ ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలో 2016 తరహాలో ట్రంప్ సాగిస్తున్న ప్రచారం అమెరికా ఫస్ట్ అంటూ సాగిస్తున్న జాతీయవాద నినాదం ఈసారి డోనాల్డ్ ట్రంప్ కు కలిసొస్తుందా ? ఒకపక్క సర్వేలన్నీ ట్రంప్ కు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఉండబోతుందని చెబుతుంటే ఇప్పటికే కరోనా కారణంగా ఆరోగ్య సంక్షోభంలో, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న అమెరికాను గట్టెక్కించడానికి ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికర అంశం. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో అధ్యక్షుడిగా పట్టం కట్టడానికి కీలక భూమిక పోషించే వారిలో తెలుగువారు వుండడం గమనార్హం. ఏది ఏమైనా ఈ ఎన్నికలు అధ్యక్షుడిగా ఎవరిని కూర్చోబడతాయి అనేది తేలేందుకు కౌంట్ డౌన్ మొదలైంది.

English summary
The countdown to the US presidential election has begun, with Donald Trump and Joe Biden campaigning for their winning. Donald Trump and Joe Biden also criticised each other during the US presidential election campaign, which reached its climax. It is interesting to see who is the American president that americans are going to elect . The world continues to be interested in the US presidential election this time around.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X