వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిమ్‌కు షాక్: కొరియా వైపు అమెరికా బలగాలు, భద్రత కోసమేనా?

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: కొరియన్ ద్వీపకల్పం చుట్టూ అమెరికా తన బలగాలను మోహరిస్తోంది. భద్రతపరమైన చర్యల్లో భాగంగానే కొరియన్ ద్వీపకల్పం చుట్టూ స్టెల్త్ బాంబర్స్‌ను మోహరిస్తోంది అమెరికా.

దక్షిణ కొరియాతో చర్చలకు తాము సిద్దమని ఉత్తరకొరియా ఇటీవల ప్రకటించింది. ఈ మేరకు ఉత్తరకొరియాతో చర్చలకు దక్షిణ కొరియా కూడ సంసిద్దతను వ్యక్తం చేసింది. రెండు దేశాల అధికారులు ఇటీవల కాలంలోనే పలు అంశాలపై చర్చలు చేస్తున్నారు.

U.S. moves ships, bombers towards Korean peninsula ahead of Olympics

దక్షిణ కొరియాలో జరిగే వింటర్ ఒలంపిక్స్‌లో పాల్గొనేందుకు తమ దేశం నుండి క్రీడాకారులను పంపుతామని కూడ ఉత్తరకొరియా కూడ సంసిద్దతను వ్యక్తం చేసింది. ఈ మేరకు ఈ రెండు దేశాల మధ్య చర్చలు సఫలమైతే వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు ఉత్తరకొరియా క్రీడాకారులు కూడ పాల్గొనే అవకాశం లేకపోలేదు.

వచ్చే నెలలో వింటర్‌ ఒలింపిక్స్‌ జరగనున్న నేపథ్యంలో ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌తో సహా నేలమీద, నీటిమీద పోరాడగల షిప్‌ను ఆ ప్రాంతంలో దించుతోంది. ఇది అతి సాధారణ విషయమని, కేవలం భద్రతపరమైన చర్యల్లో భాగంగానే స్టెల్త్‌ బాంబర్స్‌ను రంగంలోకి దించుతున్నామని అమెరికా ప్రకటించింది.

ట్రంప్ ఆసక్తికరం: కిమ్‌తో ఫోన్‌లో చర్చలకు నేను రెఢీ, ఎలాంటి షరతులొద్దుట్రంప్ ఆసక్తికరం: కిమ్‌తో ఫోన్‌లో చర్చలకు నేను రెఢీ, ఎలాంటి షరతులొద్దు

ఒలింపిక్స్‌ ముగిసేవరకూ ఎలాంటి యుద్ధ విన్యాసాలను నిర్వహించటం లేదని వాషింగ్టన్‌ అధికార వర్గాలు తెలిపాయి. సియోల్‌తో చర్చలు జరిపేందుకు అమెరికా నెమ్మదిగా చేరుతోందని ఉత్తరకొరియా చెబుతోంది.

English summary
The U.S. is beefing up its presence around the Korean Peninsula ahead of next month’s Winter Olympics by deploying stealth bombers, at least one extra aircraft carrier and a new amphibious assault ship to the region.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X