వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిమ్‌కు ట్రంప్ షాక్: ఖండాంతర క్షిపణి ప్రయోగించిన అమెరికా,ఇక మాటల్లేవ్

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

US Conducts Defence Test Off Hawaii Coast ఉత్తరకొరియా దూకుడుకు అమెరికా చెక్

వాషింగ్టన్: ఉత్తరకొరియా దూకుడుకు చెక్ పెట్టాలని అమెరికా ప్రయత్నాలను ప్రారంభించింది. అమెరికా హెచ్చరికలను ఖాతరు చేయకుండా ఉత్తరకొరియా క్షిపణులను ప్రయోగిస్తోంది. దీంతో అమెరికా కూడ ఉత్తరకొరియాకు చెక్ చెప్పేందుకు తాము సిద్దమనే సంకేతాలను పంపింది.

అమెరికాకు షాక్: మరోసారి అణుపరీక్షలకు ఉత్తరకొరియా రె'ఢీ'అమెరికాకు షాక్: మరోసారి అణుపరీక్షలకు ఉత్తరకొరియా రె'ఢీ'

జపాన్ మీదుగా ఖండాంతర క్షిపణిని ఉత్తర కొరియా మంగళవారం నాడు ప్రయోగించింది. అయితే ఈ క్షిపణి కేవలం శాంపిల్ మాత్రమేనని ఉత్తరకొరియా హెచ్చరించింది.

ఉత్తర కొరియా దూకుడును చూసిన ఇతర దేశాలు భయంతో వణికిపోతున్నాయి. మూడో ప్రపంచ యుద్దం వచ్చే అవకాశాలున్నాయనే అనుమానాలు కూడ వ్యక్తమౌతున్నాయి. ఉత్తరకొరియా దూకుడుకు చెక్ పెట్టాలని అమెరికా మిత్ర దేశాలు భావిస్తున్నాయి.

ఉత్తరకొరియాకు చెక్ పెట్టేందుకు సిద్దం: ట్రంప్ఉత్తరకొరియాకు చెక్ పెట్టేందుకు సిద్దం: ట్రంప్

జపాన్ మీదుగా ఉత్తరకొరియా ఖండాంతర క్షిపణిని ప్రయోగించడంతో దక్షిణ కొరియా కూడ అప్రమత్తమైంది. ఉత్తరకొరియా సరిహద్దుల్లో దక్షిణ కొరియా బాంబుదాడులకు దిగింది.

 ఉత్తరకొరియాకు షాకిచ్చిన అమెరికా

ఉత్తరకొరియాకు షాకిచ్చిన అమెరికా


జపాన్ మీదుగా ఖండాంతర క్షిపణిని ఉత్తరకొరియా ప్రయోగించిన ఉత్తరకొరియాకు అమెరికా షాకిచ్చింది.ఉత్తరకొరియా దూకుడు వైఖరికి కళ్లెం వేసేందుకు అగ్రరాజ్యం అమెరికా సన్నాహాలు ప్రారంభించింది. హవాయి తీరంలో అమెరికా వాయుసేన, క్షిపణి భద్రతా ఏజెన్సీ లు బుదవారం నాడు మధ్యతరహా ఖండాంతర క్షిపణి పరీక్ష నిర్వహించాయి. యూఎస్ఎస్ జాన్ పాల్ జోన్స్ నౌక నుంచి ఈ క్షిపణిని పరీక్షించాయి.

ఉత్తరకొరియా బెదిరింపులు

ఉత్తరకొరియా బెదిరింపులు

అమెరికాపై అణుబాంబులు వేయగలమని, అమెరికా మిత్ర దేశాలైన దక్షిణకొరియా, జపాన్ పై బాంబులు వేస్తామని, పసిఫిక్ సముద్ర తీరంలోని గువామ్ ద్వీపాన్ని నాశనం చేస్తామని బెదిరిస్తున్న ఉత్తరకొరియాపై అమెరికా మండిపడుతోంది. ఆ ద్వీపాన్నికనుక నాశనం చేస్తే, ప్రపంచ పటంలో ఉత్తరకొరియా అనేది లేకుండా చేస్తామని అగ్రరాజ్యం అమెరికా హెచ్చరించింది.

మాటలతో పని కాదన్న ట్రంప్

మాటలతో పని కాదన్న ట్రంప్

ఉత్తరకొరియాకు మాటలతో పనికాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో చర్చల ఆలోచనకు స్వస్తి చెప్పారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు. ‘అమెరికా 25 ఏళ్లుగా ఉత్తరకొరియాతో మాట్లాడుతోంది. వారికి బలవంతపు మామూళ్లను చెల్లిస్తోంది. మాటలు సమాధానం కాదు' అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

ఉత్తరకొరియాకు చెక్ పెట్టేందుకు

ఉత్తరకొరియాకు చెక్ పెట్టేందుకు

ఉత్తర కొరియాకు చెక్ పెట్టేందుకు అమెరికా సన్నాహాలను ప్రారంభించింది. ఉత్తరకొరియా అణు పరీక్షలు నిర్వహించడం, క్షిపణులను ప్రయోగించడంతో పొరుగుదేశాలు భయబ్రాంతులకు గురౌతున్నాయి. అమెరికాతో యుద్దానికి సై అంటూ ఉత్తరకొరియా కవ్వింపు చర్యలకు దిగుతోంది. పలుమార్లు ఉత్తరకొరియాకు అమెరికా అద్యక్షుడు ట్రంప్ హితవు చెప్పినా కానీ, ఆయన ప్రవర్తనలో మార్పు రాలేదు.

English summary
The United States conducted a missile-defense test on Wednesday off the coast of Hawaii and intercepted a medium-range ballistic missile, just days after North Korea’s bold missile test over Japan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X