• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇప్పట్లో యూఏఈ వెళ్లలేం: భారత ప్రయాణికులపై ట్రావెల్ బ్యాన్: రెడ్‌లిస్ట్‌లో పాకిస్తాన్ సహా

|

అబుధాబి: దేశంలో కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టింది. ఈ మహమ్మారి వల్ల సంభవిస్తోన్న మరణాల సంఖ్య కూడా భారీగా తగ్గింది. వైరస్ మిగిల్చిన సంక్షోభ పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే దేశం గట్టెక్కుతోంది. రాష్ట్రాలు ఒక్కొక్కటిగా కుదుట పడుతున్నాయి. లాక్‌డౌన్ ఆంక్షలను సడలిస్తోన్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, వేర్వేరు రంగాలకు చెందిన వర్కర్లు..ఇలా అన్ని వర్గాల వారు కూడా విదేశీ ప్రయాణాలకు సమాయాత్తమౌతోన్నారు. డబుల్ డోస్ వ్యాక్సిన్లు తీసుకుని.. విమానం ఎక్కడానికి సిద్ధపడుతోన్నారు. విదేశాలకు వెళ్లడానికి సిద్ఢపడుతోన్న వారికి ఈ నెల అత్యంత కీలకంగా మారింది.

ఈ పరిస్థితుల మధ్య- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తన ట్రావెల్ బ్యాన్‌ (UAE travel ban)ను మరి కొంతకాలం పొడిగించింది. భారత్‌, పాకిస్తాన్‌లతో పాటు మరో 12 దేశాల కోసం రెడ్ లిస్ట్ జారీ చేసింది. కరోనా వైరస్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఇదివరకే ఆయా దేశాలపై రాకపై నిషేధాన్ని విధించిన యుఏఈ.. దీన్ని మరింత కొంతకాలం పొడిగించింది. ఈ నెల 21వ తేదీ వరకు ట్రావెల్ బ్యాన్ కొనసాగుతుందని తెలిపింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ, నేషనల్ ఎమర్జెన్సీ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఓ ప్రకటనను విడుదల చేసింది.

UAE extended the travel ban on passengers from 14 countries including India and Pakistan

దీన్ని ధృవీకరిస్తూ యుఏఈ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ నోటీస్ టు ఎయిర్‌మెన్ (NOTAM)ను జారీ చేసింది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, వియత్నాం, నమీబియా, జాంబియా, కాంగో, ఉగాండా, సియర్రా లియోన్, దక్షిణాఫ్రికా, నైజీరియాలను ఈ జాబితాలో చేర్చింది. ట్రావెల్ బ్యాన్ విధించిన నేపథ్యంలో- ఆయా దేశాలకు చెందిన ప్రయాణికులకు ఎలాంటి విసాలను జారీ చేయబోమని తెలిపింది. ఈ నెల 21వ తేదీ వరకు ఈ నిషేధం కొనసాగుతుందని, ఆ తరువాత పరిస్థితులను బట్టి దీన్ని ఎత్తేయాలా? లేదా అనేది నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. కార్గో విమానాలు, బిజినెస్ ఛార్టెడ్ ఫ్లయిట్లకు మినహాయింపు ఇచ్చినట్లు పేర్కొంది.

కాగా- ఇదివరకు భారత్, నైజీరియా, దక్షిణఫ్రికా ప్రయాణికుల కోసం దుబాయ్‌ తన విమానయాన ఆంక్షలను సడలించిన విషయం తెలిసిందే. కిందటి నెల 23వ తేదీ నుంచి సడలింపులను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పరిస్థితుల్లో యుఏఈ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఈ ఉత్తర్వులు దుబాయ్‌కు కూడా వర్తిస్తాయా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. తాజా ఉత్తర్వులపై దుబాయ్ అధికారులు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అదే సమయంలో- ఈ నెల 7వ తేదీ నుంచి భారత్-దుబాయ్ మధ్య విమాన సర్వీసులను అందుబాటులోకి తెస్తామంటూ ఎమిరేట్స్ సమాచారం ఇచ్చినప్పటికీ- ఇందులో సవరణలు కూడా ఉండొచ్చని మెలిక పెట్టింది.

English summary
United Arab Emirates extended the travel ban on passengers from 14 countries including India and Pakistan. Travel ban on citizens to India, Bangladesh, Nepal, Sri Lanka, Vietnam, Namibia, Zambia, Congo, Uganda, Sierra Leone, Liberia, South Africa and Nigeria.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X