• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా వ్యాక్సిన్‌లో పంది మాంసం ఉన్నా పర్వాలేదు -ముస్లింలకూ అది ఔషధమే -ఇస్లామిక్ ఫత్వా కౌన్సిల్

|

ప్రపంచవ్యాప్తంగా కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య 8కోట్లకు, మరణాల సంఖ్య 18లక్షలకు చేరువయ్యాయి. కరోనా జన్యువుల్లో మార్పులు చోటుచేసుకుని, అది మరింత ప్రమాదకరంగా స్ట్రెయిన్ రూపాన్ని సంతరించుకుని విజృంభణ కోనసాగిస్తున్నది. ఈ దెబ్బకు పదులకొద్దీ దేశాలు మళ్లీ లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. అగ్రదేశాల్లో ఇప్పటికే మాస్ వ్యాక్సినేషన్ ప్రారంభంకాగా, మిగతా దేశాల్లోనూ టీకాల పంపిణీకి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈలోపే ఇస్లాం, యూదు మతాకుల చెందిన కొందరు మత పెద్దలు వ్యాక్సిన్ వాడకాన్ని వ్యతిరేకించడం సంచలనం రేపింది. ఈ క్రమంలోనే..

 కామాంధుడి ఖాకీ వేషం-అమ్మాయిలతో పరిచయాల కోసం నకిలీ పోలీస్ అవతారం -హోటల్‌కు తీసుకెళ్లి రేప్ కామాంధుడి ఖాకీ వేషం-అమ్మాయిలతో పరిచయాల కోసం నకిలీ పోలీస్ అవతారం -హోటల్‌కు తీసుకెళ్లి రేప్

వ్యాక్సిన్‌లో పంది మాంసం..

వ్యాక్సిన్‌లో పంది మాంసం..

కొవిడ్ వ్యాక్సిన్లలో పంది మాంసంతో చేసిన ఉత్ప‌త్తులు వాడ‌టంతో సదరు టీకాలను హలాల్(పవిత్ర పదార్థం)గా కాకుండా హరామ్(అపవిత్ర పదార్థం)గానే చూడాలని కొందరు ఔత్సాహిక ఇస్లామిక పండితులు పిలుపునిచ్చారు. దీంతో ఇస్లామిక్ దేశాలు కొవిడ్ టీకా వాడకంపై సందిగ్ధత ఏర్పడింది. వ్యాక్సిన్‌ల జీవిత‌కాలం పెంచ‌డానికి, స్టోరేజ్‌, ట్రాన్స్‌ఫోర్ట్‌లో అవి సుర‌క్షితంగా, స‌మ‌ర్థ‌వంతంగా ఉండ‌టానికి పంది మాంసంతో చేసిన జెలటిన్‌ను వాడుతుంటారు. కాగా,

జగన్‌ పరువు గంగలోకి -రంగు పడుద్ది -వైసీపీకి వేల కోట్లు ఎక్కడివి? రక్త దోపిడీ ఏంటయ్యా?: ఎంపీ రఘురామజగన్‌ పరువు గంగలోకి -రంగు పడుద్ది -వైసీపీకి వేల కోట్లు ఎక్కడివి? రక్త దోపిడీ ఏంటయ్యా?: ఎంపీ రఘురామ

పందితో అభ్యంతరం లేదు..

పందితో అభ్యంతరం లేదు..

వ్యాక్సిన్ లో పందిమాంసంతో తయారైన జెలాటిన్ ఉపయోగిస్తారని వెల్లడైన నేపథ్యంలో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి చెందిన ఇస్లామిక్ సంస్థ యూఏఈ ఫత్వా కౌన్సిల్ కీలక వ్యాఖ్యలు చేసింది. వ్యాక్సిన్ లో పందిమాంసంతో తయారైన జెలటిన్‌ ఉన్నప్పటికీ తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. కరోనా వ్యాక్సిన్ పంపిణీకి తామేమీ అడ్డుచెప్పబోమని వెల్లడించింది. ముస్లింలకు పందిమాంసం వాడకం నిషిద్ధమని ఇస్లాం చెబుతున్న నేపథ్యంలో యూఏఈ ఫత్వా కౌన్సిల్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.

ఔషధంగానే చూడాలి..

ఔషధంగానే చూడాలి..

మరో ప్రత్యామ్నాయం లేని నేపథ్యంలో, పందిమాంసంపై ఇస్లాంలో ఉన్న నిషేధాజ్ఞలను కరోనా వ్యాక్సిన్ విషయంలో అమలు చేయలేమని యూఏఈ ఫత్వా కౌన్సిల్ చైర్మన్ షేక్ అబ్దల్లా బిన్ బయ్యా తెలిపారు. మానవ దేహాన్ని పరిరక్షించుకోవడమే ఇప్పుడు ప్రధానాంశమని, పందిమాంసంతో చేసిన జెలటిన్ ఆహార పదార్థం కాదు గనుక మత విశ్వాసాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని, దానిని కేవలం ఔషధంగానే భావిస్తామని ఫత్వా కౌన్సిల్ వివరించింది. మరోవైపు.

ఇండియా ముస్లిం పెద్దలు కూడా..

ఇండియా ముస్లిం పెద్దలు కూడా..

పంది మాంసం నుంచి తయారు చేసే జెలటిన్లను ఒక స్టెబిలైజ‌ర్‌గా వాడుతార‌ని, దీనివ‌ల్ల వ్యాక్సిన్‌ల జీవితకాలం పెరుగుతుంద‌ని బ్రిటిష్ ఇస్లామిక్ మెడిక‌ల్ అసోసియేష‌న్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌ల్మాన్ వ‌కార్ చెబుతున్నారు. కొన్ని కంపెనీలు పంది మాంసం ఉత్ప‌త్తులు లేని వ్యాక్సిన్‌ల‌ను త‌యారు చేయ‌డానికి చాలా ఏళ్లుగా ప్ర‌య‌త్నిస్తున్నాయి. అయితే ఇప్పుడు డిమాండ్, సప్లై చెయిన్స్‌, ఖ‌రీదు, జీవిత‌కాలం త‌క్కువ కావ‌డం వంటి స‌మ‌స్య‌లు జిలాటిన్ వాడ‌కాన్ని త‌ప్ప‌నిస‌రి చేస్తున్నాయ‌ని వ‌కార్ అన్నారు. పంది మాంసం ఉంది కాబట్టి కరోనా వ్యాక్సిన్లను ముస్లింలు తీసుకోరాదంటూ చేస్తోన్న ప్రచారాన్ని నమ్మొద్దని, ముస్లింలంతా విధిగా వ్యాక్సిన్‌లు తీసుకోవాల‌ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ముస్లిం మ‌త పెద్ద మౌలానా ఖాలిద్ ర‌షీద్ ఫిరంగీ మ‌హాలి పిలుపునిచ్చారు. యూదు మత పెద్దలు కూడా ఇదే తరహా వాదన వినిపిస్తున్నారు.

హలాల్.. హరామ్..

హలాల్.. హరామ్..


కరోనా వ్యాక్సిన్లలో పంది మాంసం వాడకంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా, ప్రముఖ ఫార్మా కంపెనీలు వరుస ప్రకటనలు చేశాయి. త‌మ క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్‌ల‌లో పంది మాంసంతో చేసిన ఉత్ప‌త్తుల‌ను వాడ‌లేద‌ని ఫైజ‌ర్, మోడెర్నా, ఆస్ట్రాజెనెకా సంస్థ అధికార ప్ర‌తినిధులు స్ప‌ష్టం చేశారు. అయితే సదరు వ్యాక్సిన్లలో జెలటిన్ లేద‌ని ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవ‌రూ ధృవీక‌రించ‌క పోవడం విచిత్రం. ముందుగానే కుదుర్చుకున్న ఒప్పందం కార‌ణంగా ఇండోనేషియాలాంటి ముస్లిం దేశాల‌కు ఇలాంటి ధృవీక‌ర‌ణ లేకుండానే ఈ సంస్థ‌లు వ్యాక్సిన్‌ల‌ను పంపించ‌నున్నాయి.

English summary
The United Arab Emirates’ highest Islamic authority, the UAE Fatwa Council, has ruled that coronavirus vaccines are permissible for Muslims even if they contain pork gelatin.The ruling follows growing alarm that the use of pork gelatin, a common vaccine ingredient, may hamper vaccination among Muslims who consider the consumption of pork products “haram,” or forbidden under Islamic law.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X