India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్(73) కన్నుమూత: 40 రోజులు సంతాప దినాలు

|
Google Oneindia TeluguNews

దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరణించినట్లు అధ్యక్ష వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. ఈయన అబుదాబి ఎమిరేట్ పాలకుడు కూడా.

"శుక్రవారం ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరణంతో యూఏఈ ప్రజలకు, అరబ్, ఇస్లామిక్ దేశాలు, ప్రపంచానికి అధ్యక్ష వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంతాపం తెలియజేస్తోంది' అని మంత్రిత్వ శాఖ రాష్ట్ర మీడియాలో ఒక ప్రకటనలో తెలిపింది. మరి ఏ ఇతర వివరాలు వెల్లడించలేదు.

UAE president Sheikh Khalifa bin Zayed dies at 73.

రాజ్యాంగం ప్రకారం.. వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్-మక్తూమ్.. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి 30 రోజులలోపు ఏడు ఎమిరేట్స్ పాలకులు సమావేశమయ్యే వరకు ఫెడరల్ కౌన్సిల్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.

1948లో జన్మించిన ఖలీఫా.. 2014లో స్ట్రోక్‌తో బాధపడుతున్నప్పటి నుంచి చాలా అరుదుగా బహిరంగంగా కనిపించారు. MbZ అని పిలువబడే అతని సవతి సోదరుడు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ జాయెద్, యూఎస్ మిత్రదేశమైన UAE OPEC(చమురు ఉత్పత్తిదారు) వాస్తవ పాలకుడు.

"UAE తన నీతిమంతుడైన కుమారుడిని, 'సాధికారత దశ' నాయకుడిని, దాని ఆశీర్వాద ప్రయాణానికి సంరక్షకుడిని కోల్పోయింది' అని MbZ ట్విట్టర్‌లో ఖలీఫా జ్ఞానం, దాతృత్వాన్ని కొనియాడింది.

యూఏఈ శుక్రవారం నాటికి జెండాలను సగం మాస్ట్‌తో ఎగురవేయడంతో పాటు 40 రోజుల సంతాప దినాలను పాటిస్తుంది. మూడు రోజుల పాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలలో పనిని నిలిపివేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, బహ్రెయిన్ రాజు, ఈజిప్ట్ అధ్యక్షుడు, ఇరాక్ ప్రధాన మంత్రితో సహా అరబ్ నాయకుల నుంచి సంతాపం వెల్లువెత్తింది.

ఖలీఫా మృతి పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంతాపం తెలియజేశారు. హెచ్‌హెచ్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ మరణించిన విషయం తెలిసి నేను చాలా బాధపడ్డాను. అతను గొప్ప రాజనీతిజ్ఞుడు, వివేకవంతమైన నాయకుడు, అతని ఆధ్వర్యంలో భారతదేశం-యూఏఈ సంబంధాలు అభివృద్ధి చెందాయి. భారతదేశ ప్రజల హృదయపూర్వక సంతాపం యూఏఈ ప్రజలకు తెలియజేస్తున్నాం. ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక అని ట్విట్టర్ వేదికగా ప్రధాని వ్యాఖ్యానించారు.

ఖలీఫా 2004లో అత్యంత ధనిక ఎమిరేట్ అబుదాబిలో అధికారంలోకి వచ్చి దేశాధినేత అయ్యాడు. అతను క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ చేత అబుదాబి పాలకుడిగా నియమితులు అవుతారని భావించారు.

గల్ఫ్ దేశం చమురు సంపదలో ఎక్కువ భాగాన్ని కలిగి ఉన్న అబుదాబి, 1971లో ఖలీఫా తండ్రి దివంగత షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్-నహ్యాన్ UAE సమాఖ్యను స్థాపించినప్పటి నుంచి అధ్యక్ష పదవిని నిర్వహించారు.

English summary
UAE president Sheikh Khalifa bin Zayed dies at 73.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X