వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డొనాల్డ్ ట్రంప్‌కు షాకిచ్చిన ఉబెర్ సీఈఓ ట్రావిస్: ఎందుకంటే..?

అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవలంభిస్తున్న విధానాలను నిరసిస్తూ ఉబర్ టెక్నాలజీస్ సీఈవో ట్రావిస్ కలానిక్.. బిజినెస్ అడ్వైజరీ కౌన్సిల్ నుంచి తప్పుకున్నారు.

|
Google Oneindia TeluguNews

వాషిం‍గ్టన్: అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవలంభిస్తున్న విధానాలను నిరసిస్తూ ఉబర్ టెక్నాలజీస్ సీఈవో ట్రావిస్ కలానిక్ తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ బిజినెస్ అడ్వయిజరీ గ్రూప్ నుంచి ఆయన వైదొలిగారు.ఇప్పటికే ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్‌బుక్, యాపిల్, అమేజాన్ తదితర కంపెనీల సీఈఓలు బహిరంగంగానే ప్రకటించారు.

డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కఠిన చర్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ఆందోళనలతోపాటు, ఆయనకు మద్దతిస్తున్న సీఈవోలపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో ట్రంప్‌కు గుడ్ బై చెబుతున్నట్టు గురువారం ట్రావిస్ కలానిక్ ప్రకటించారు.

Uber CEO Travis Kalanick quits Donald Trump’s business advisory council

కాగా, ట్రంప్ అడ్వయిజరీ గ్రూప్‌లో ఉన్న ఉబర్‌పై సోషల్ మీడియాలో భారీ ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఉబర్ అకౌంట్లను డిలీట్ చేసి, దాని ప్రత్యర్థి లిఫ్ట్ ఇంక్‌లో చేరమని వాదనలు వినిపించాయి. అకౌంట్ డిలీట్ చేసిన వారు, ఉబర్‌కు ఈమెయిల్స్ సైతం పంపారు. బ్యాన్ నేపథ్యంలో ప్రభావితమయ్యే వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

అంతేగాక, ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉద్యోగులు, కార్యకర్తలు ట్రంప్ వ్యాపార అడ్వయిజరీ గ్రూప్ నుంచి బయటికి వచ్చేయాలని ఉబర్ సీఈవోపై ఒత్తిడి తీవ్ర తరం చేశారు. కాగా, ఉబర్ డ్రైవర్లలో చాలామంది వలసవాదులే ఉన్నారు. ఈ క్రమంలో ట్రావిస్ అడ్వైజరీ కౌన్సిల్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించినట్లు తెలుస్తోంది.

కాగా, ఏడు ముస్లిం దేశాల పౌరులను, వలసవాదులను తాత్కాలికంగా అమెరికాలోకి రాకుండా నిషేధిస్తూ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ ఆర్డర్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ముస్లిం దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించడంపై దేశవ్యాప్తంగా పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ ఆర్డర్లను వ్యతిరేకిస్తూ నిరసనలు జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా ట్రావిస్ మాట్లాడుతూ.. అడ్వయిజరీ గ్రూప్‌లో చేరడం ప్రెసిడెంట్‌ను ఎండోర్స్ మెంట్ తీసుకోవడం లేదా ఆయన అజెండాలను ఫాలోఅవ్వడం కాదని అన్నారు. దురదృష్టవశాత్తు తమను తప్పుగా అర్థం చేసుకున్నారని కలానిక్ వాపోయారు. ఎకానమిక్ పాలసీలో కూడా తాను చేరనని ఉబర్ సీఈవో ప్రెసిడెంట్‌కు స్పష్టంచేశారు.
కాగా, ఉబెర్ సీఈవో ట్రంప్ గ్రూప్ నుంచి వైదొలిగినట్టు కంపెనీ అధికార ప్రతినిధి చెల్సియా కోల్హర్ ధృవీకరించారు.

English summary
Uber CEO Travis Kalanick has removed himself from Donald Trump’s economic advisory group, as first reported by both Recode and the New York Times, and confirmed by TechCrunch.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X