వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లైంగిక వేధింపులు:కన్నీళ్ళు పెట్టుకొన్న ఉబేర్ సిఈఓ, కారణమదేనా?

ఆన్ లైన్ ట్రాన్స్ పోర్టేషన్ నెట్ వర్క్ కంపెనీ ఉబేర్ టెక్నాలజీస్ సిఈఓ ట్రావిస్ కాలనిక్ కన్నీటి పర్యంతమయ్యారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

బ్లూంబర్గ్:ఆన్ లైన్ ట్రాన్స్ పోర్టేషన్ నెట్ వర్క్ కంపెనీ ఉబేర్ టెక్నాలజీస్ సిఈఓ ట్రావిస్ కాలనిక్ కన్నీటి పర్యంతమయ్యారు. కంపెనీ ఉద్యోగులతో నిర్వహించిన అంతర్గత సమావేశంలో ఆయన ఏడ్చారు.

ఉబేర్ కంపెనీలో మహిళ సిబ్బందికి ఎదురౌతోన్న లైంగిక వేధింపులపై ఆయన ఈ రకంగా స్పందించారు. కంపెనీలో మహిళా సిబ్బంది లైంగిక వేధింపులపై మాజీ మహిళా ఉద్యోగి చ ేసిన తీవ్ర ఆరోపణలతో ఆయన ఉద్యోగులతో సమావేశమయ్యారు

Uber CEO, With Tears in His Eyes, Apologises for Company Culture

తాను ఇప్పటివరకు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అన్ని విషయాలను ఆయన నిజాయితీగా ఒప్పుకొన్నారు. ఇక నుండి ఎలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకొంటున్నట్టు ఆయన ప్రకటించారు.

ఉబేర్ సంస్థను మరింత సమర్థవంతంగా తీర్చిద్దేందుకుగాను ఆయన చర్యలు తీసుకొంటున్నారు. మహిళ సిబ్బంది ఏకరువు పెట్టిన సమస్యలను విని ఆయన కన్నీళ్ళు పెట్టుకొన్నారు.

సుమారు గంటన్నరపాటుగా ఆయన మహిళల సమస్యలపై చర్చించారు.8 ఏళ్ళుగా శరవేగంగా ఈ కంపెనీ వృద్ది చెందుతోంది.

మానవవనరుల విభాగంపై ఏమాత్రం దృష్టి కేంద్రీకరించని కారణంగానే ఈ పరిస్థితి తలెత్తినట్టుగా ఆయన అభిప్రాయపడ్డారు. ఉద్యోగ నియామకాల్లో సమతుల్యత పాటించకోపడం వల్లే పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

మహిళా ఉద్యోగుల సమస్యలపై విచారణ పూర్తి చేసి మిగిలిన విషయాలపై దృష్టి కేంద్రీకరిస్తామని ఆయన చెప్పారు.

English summary
At a meeting open to all Uber Technologies Inc. employees on Tuesday, Travis Kalanick apologized for cultural failings at his company after a former employee alleged she was harassed and discriminated against while working there.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X