వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉబర్ సీఈఓ రాజీనామా: ఏం జరిగింది?

గ్లోబల్ క్యాబ్‌ సర్వీసు దిగ్గజ సంస్థ ఉబర్‌ టెక్నాలజీస్‌ సహ వ్యవస్థాపకుడు ట్రావిస్‌ కలనిక్‌ తన సీఈవో పదవికి రాజీనామా చేశారు. ఉబర్‌ ఇన్వెస్టర్ల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే దీనిపై ఉబర్‌ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్‌: గ్లోబల్ క్యాబ్‌ సర్వీసు దిగ్గజ సంస్థ ఉబర్‌ టెక్నాలజీస్‌ సహ వ్యవస్థాపకుడు ట్రావిస్‌ కలనిక్‌ తన సీఈవో పదవికి రాజీనామా చేశారు. ఉబర్‌ ఇన్వెస్టర్ల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే దీనిపై ఉబర్‌ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

అయితే, ప్రస్తుతం ట్రావిస్‌ తన తల్లి మృతి కారణంగా సెలవులో ఉన్నారు. 2009లో ట్రావిస్‌ కలనిక్‌ తన స్నేహితుడు గరేట్‌ క్యాంప్‌తో కలిసి ఉబర్‌ను ప్రారంభించారు. మొదట్లో ఉబర్‌క్యాబ్‌ పేరుతో సేవలందించారు. ఆ తర్వాత 2011లో సంస్థ పేరును ఉబర్‌ టెక్నాలజీస్‌గా మార్చి.. ట్రావిస్‌ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు.

 Uber founder Travis Kalanick resigns as CEO

కాగా, గత కొంతకాలంగా ట్రావిస్‌పై ఉబర్‌ ఇన్వెస్టర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోట్రావిస్‌ వెంటనే రాజీనామా చేయాలంటూ సంస్థకు చెందిన ఐదుగురు ప్రధాన పెట్టుబడుదారులు తీవ్ర ఒత్తిడి పెంచారు. ఈ మేరకు ట్రావిస్‌కు లేఖ రాసినట్లు ఓ అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలను ప్రచురితం చేశాయి.

'మూవింగ్‌ ఉబర్‌ ఫార్వర్డ్‌' టైటిల్‌తో రాసిన ఈ లేఖలో.. కంపెనీ సిబ్బంది నాయకత్వంలో మార్పును కోరుకుంటున్నారని, ట్రావిస్‌ వెంటనే రాజీనామా చేయాలని ఇన్వెస్టర్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో లేఖ విషయంపై ఉబర్‌ బోర్డు సభ్యులతో చర్చించిన ట్రావిస్‌.. సీఈవో పదవి నుంచి తప్పుకునేందుకు అంగీకరించారు. అయితే ట్రావిస్‌ బోర్డు సభ్యుడిగా మాత్రం ఆయన కొనసాగనున్నట్లు సదరు మీడియా సంస్థ వెల్లడించింది.

'ప్రపంచంలో ఉబర్‌ కంటే ఎక్కువగా నేను దేన్నీ ప్రేమించను. ప్రస్తుతం నేను ఎదుర్కొంటున్న కఠిన పరిస్థితుల్లో పెట్టుబడిదారుల వినతిని ఆమోదించి సీఈవో బాధ్యతల నుంచి తప్పుకుంటున్నా' అని ట్రావిస్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. కాగా, ఇటీవల ఉబర్‌ డ్రైవర్లపై లెంగిక వేధింపుల ఆరోపణలు పెరిగివడం, గూగుల్‌ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కారుకు సంబంధించిన సాంకేతికతను చోరీ చేశారనే ఆరోపణలు రావడంతో కొంత ఇబ్బందికర పరిస్థితులను ఉబర్ ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో కంపెనీ పనితీరు మెరుగుపడాలంటే ఈ చర్య తప్పదని ఇన్వెస్టర్లు స్పష్టం చేశారు.

English summary
Travis Kalanick stepped down Tuesday as chief executive of Uber, the ride-hailing service that he helped found in 2009 and that he built into a transportation colossus, after a shareholder revolt made it untenable for him to stay on at the company.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X