వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా గురించి ఒళ్లు జలదరించే నిజం: బ్రెయిన్ డ్యామేజ్‌..నిర్వీర్యం: లండన్ వర్శిటీ పరిశోధనల్లో

|
Google Oneindia TeluguNews

లండన్: ప్రాణాంతక కరోనా వైరస్ గురించి మరో భయానక వాస్తవం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 5.45 లక్షలకు పైగా ప్రాణాలను బలి తీసుకున్న కరోనా.. మున్ముందు మరింత దుర్భర పరిస్థితులను కల్పించే అవకాశం ఉందని తేలింది. ఓ మనిషి శరీరంపై కరోనా వైరస్ ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందనే కోణంలో ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలను కొనసాగిస్తోన్న నేపథ్యంలో.. కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తూనే వస్తున్నాయి.. ఈ క్రిమి గురించి. కరోనా బారిన పడిన పేషెంట్లు కోలుకున్న తరువాత కూడా సుదీర్ఘకాలం పాటు దాని ప్రభావం మనుషుల శరీరంలోని అవయవాలపై పడుతుందంటూ ఇప్పటికే శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు.

చైనాకు ఆగ్రహం తెప్పించే పని: దలైలామాకు బర్త్‌డే విషెస్ చెప్పని మోడీ: యూఎస్ సైతం గ్రీటింగ్స్చైనాకు ఆగ్రహం తెప్పించే పని: దలైలామాకు బర్త్‌డే విషెస్ చెప్పని మోడీ: యూఎస్ సైతం గ్రీటింగ్స్

బ్రెయిన్ డ్యామేజ్‌కు కారణం..

బ్రెయిన్ డ్యామేజ్‌కు కారణం..

ఇక తాజాగా- బ్రెయిన్ డ్యామేజ్, బ్రెయిన్ స్ట్రోక్స్, బ్రెయిన్ డిస్‌ఫంక్షన్‌కు ఈ క్రిమి కారణమౌతుందని పరిశోధకులు స్పష్టం చేశారు. ఇది కాస్తా క్రమంగా మెదడును స్తంభింపజేయడానికి కారణమౌతుందని అంటున్నారు. ఇన్‌ఫ్లమ్మేషన్, సైకోసిస్, డెలీరియం సహా కొన్ని అవాంఛిత రోగాలు పుట్టుకుని రావడానికి అవకాశం ఉందని స్పష్టం చేశారు. కరోనా వైరస్ వల్ల సంభవించే బ్రెయిన్ డ్యామేజ్ వల్ల న్యూరోలాజికల్ సమస్యలు సైతం తలెత్తుతాయని వెల్లడించారు.

యూనివర్శిటీ కాలేజ్ లండన్ పరిశోధనల్లో..

యూనివర్శిటీ కాలేజ్ లండన్ పరిశోధనల్లో..

యూనివర్శిటీ కాలేజ్ లండన్ (యూఎల్‌సీ) పరిశోధకులు నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కరోనా బారిన పడి చికిత్స పొందుతోన్న కొంతమంది పేషెంట్ల ఆరోగ్య స్థితిగతులపై వారు పరిశోధనలు చేశారు. వారి నుంచి సేకరించిన కొన్ని శాంపిళ్లపై అధ్యయనం చేశారు. వారిలో కొందరు ఇప్పటికే మెదడు సంబంధిత ఇబ్బందులకు గురి అయ్యారని నిర్ధారించారు. కరోనా వైరస్ సోకకముందు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న ఆ పేషెంట్లలో.. కరోనా సోకిన తరువాత మెదడు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

1920, 1930 మధ్యకాలంలో

1920, 1930 మధ్యకాలంలో

మెదడుపై కరోనా వైరస్ ప్రభావం గనక మరింత తీవ్రంగా పడితే.. దాని ఫలితాలు అనూహ్యంగా ఉంటాయని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1920-1930 మధ్య కాలంలో కొన్ని దేశాలను వణికించిన ఎన్సెఫాలిటీస్ లెథార్జిక్‌ ఇన్‌ఫ్లుయెన్జాకు దారి తీసే ప్రమాదం లేకపోలేదని యూనివర్శిటీ కాలేజ్ లండన్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆప్ న్యూరాలజీ ప్రొఫెసర్ మైఖెల్ జాండీ తెలిపారు. ప్రస్తుతానికి కరోనా వైరస్ వల్ల శ్వాసకోశ సమస్యలు, ఊపిరి తిత్తుల్లో ఇబ్బందులు తలెత్తుతాయనే విషయం తెలిసిందేనని, మున్ముందు.. ఇది దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్పారు. మెదడును నిర్వీర్యం చేస్తుందని అన్నారు.

దినచర్యలపై ప్రభావం చూపించేలా..

దినచర్యలపై ప్రభావం చూపించేలా..

మెదడుపై వైరస్ చూపించే ప్రభావం తాత్కాలికమే అయినప్పటికీ..మున్ముందు అది మరింత ముదిరే ప్రమాదం లేకపోలేదని వెస్టర్న్ యూనివర్శిటీ ఇన్ కెనడా న్యూరాలజిస్ట్ విభాగం ప్రొఫెసర్ ఆడ్రియాన్ ఓవెన్ తెలిపారు. దీని ప్రభావం కోలుకున్న పేషెంట్ల దినచర్యపై పడుతుందని, సంజ్ఙాత్మక సందేశాలను త్వరగా అందుకోలేకపోవచ్చని అన్నారు. వారిలో కాగ్నిటివ్ డెఫిషిట్ ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు తమ పరిశోధనలో తేలిందని స్పష్టం చేశారు. కరోనా కోసం వ్యాక్సిన్‌ను రూపొందిస్తోన్న పరిశోధకులు ఈ దిశగా దృష్టి సారించాల్సి ఉంటుందని అన్నారు.

English summary
Scientists warned on Wednesday of a potential wave of coronavirus-related brain damage as new evidence suggested COVID-19 can lead to severe neurological complications, including inflammation, psychosis and delirium. A study by researchers at University College London (UCL)described 43 cases of patients with COVID-19 who suffered either temporary brain dysfunction, strokes, nerve damage or other serious brain effects. The research adds to recent studies which also found the disease can damage the brain.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X