వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అగ్నిపర్వతంపై గ్రహాంతరవాసులు!? పసిగట్టిన శాటిలైట్, అక్కడ వాళ్లేం చేస్తున్నారు?

గ్రహాంతరవాసులు మన చుట్టూనే ఉన్నారా? ఈ భూమ్మీద మనతో పాటు వారు కూడా సంచరిస్తున్నారా? మానవులు అడుగు పెట్టేందుకు సైతం భయపడే ప్రాంతాల్లో వారు సంచరిస్తున్నారా? బద్దలవుతున్న అగ్నిపర్వతం.. వేగంగా ప్రవహిస్

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌ : గ్రహాంతరవాసులు మన చుట్టూనే ఉన్నారా? ఈ భూమ్మీద మనతో పాటు వారు కూడా సంచరిస్తున్నారా? మానవులు అడుగు పెట్టేందుకు సైతం భయపడే ప్రాంతాల్లో వారు సంచరిస్తున్నారా?

బద్దలవుతున్న అగ్నిపర్వతం.. వేగంగా ప్రవహిస్తున్న లావా మధ్యలో ఏలియన్లు ఎలా తిరగగలుగుతున్నారు? మరి భూమ్మీదే గ్రహాంతర వాసులు ఉంటున్నప్పుడు వారెందుకు మనతో ముఖాముఖీ మాట్లాడడం లేదు?

ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం నిరంతర అన్వేషణ సాగుతూనే ఉంది. రెండు నెలల క్రితం అమెరికాలోని ఎల్లోస్టోన్‌ అగ్నిపర్వతం బద్దలైంది. ఇది బద్దలైన సమయంలో ఆ ప్రాంతంలో 2.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. అప్పట్నించి ఈ పర్వతం నిప్పురవ్వలను వెదజల్లుతుండగా.. అందులోంచి వచ్చే లావా కిందకు ప్రవహిస్తూనే ఉంది.

ఎల్లోస్టోన్ అగ్నిపర్వతం నుంచి పుడుతున్న వేడికి.. దాని సమీప ప్రాంతాల్లోకి వెళ్లేందుకు కూడా జనం భయపడుతున్నారు. ఈ అగ్నిపర్వతం ఉన్న ప్రదేశంలో.. అకాశంలో కూడా 40 వేల అడుగుల ఎత్తులోనే ప్రయాణించడానికి సాధ్యమవుతోంది.

ఇటువంటి పరిస్థితుల్లో.. ఒక ఫ్లయింగ్‌ సాసర్‌.. అగ్నిపర్వతం, లావాకు దగ్గరగా తిరిగింది. అంతేకాదు, అది అగ్నిపర్వతం లోపలిదాకా వెళ్లడం, లావా మీద ఏవో ఆకారాలు నడుస్తున్నట్లు కనిపించింది.

ఇదంతా ఓ వీడియోలో రికార్డయింది. ఈ వీడియోను రికార్డ్ చేసింది.. రోదసి నుంచి అగ్నిపర్వతాన్ని పరిశీలిస్తున్న ఓ శాటిలైట్. జూన్‌ 9న ఈ వీడియో రికార్డయినట్లు తెలుస్తోంది. ఒక్క జూన్ 9వ తేదీ మాత్రమే కాదు, జూన్‌ - ఆగస్టు నెలల మధ్య కాలంలో చాలాసార్లు శాటిలైట్లు పలు ఫ్లయింగ్‌ ఆబ్జెక్ట్‌లను గుర్తించాయి.

దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్, సోషల్ మీడియాల్లో హల్ చల్ చేస్తోంది. ఒక కాంతిపుంజం ఆకారంలో ఉన్న ఫ్లయింగ్ ఆబ్జెక్ట్‌ను వీడియోల్లో స్పష్టంగా చూడవచ్చు. ఇది కచ్చితంగా మానవ జాతికి అత్యంత ప్రమాదకర సంకేతాలను పంపేదే అని సైంటిస్టులు చెబుతున్నారు.

ఎల్లోస్టోన్‌ అగ్నిపర్వతం వయసెంతో తెలియదుకానీ, ఈ అగ్నిపర్వతం ప్రతి 6 లక్షల సంవత్సరాలకోసారి బద్దలవుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. అంతేకాదు, ఈ అగ్నిపర్వతానికి చాలాసార్లు గ్రహాంతరవాసులు టూరిస్టుల్లా వచ్చి వెళ్లారని.. ప్రముఖ సైంటిస్ట్ స్కాట్ అంటున్నారు. ఎల్లోస్టోన్‌ అగ్నిపర్వతానికి, గ్రహాంతరవాసులకు ఉన్న సంబంధంపై పరిశోధనలు చేయాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడుతున్నారు.

English summary
A video has surfaced on YouTube which appears to show a craft darting over the potentially catastrophic Yellowstone volcano. The strange craft appears to be metallic and shiny, and darts across the left of the screen. The video was taken on June 9, but only recently uploaded to YouTube with the caption “Impressive UFO near the Yellowstone Volcano”. The Yellowstone National Park has long been a hotspot for alien enthusiasts, with sightings regularly reported there. In late 2016, a sighting of a small drone-like object went viral when it was seen hovering above the supervolcano.Jeanetta Foresta uploaded a video of the sighting under the heading "Things R flying all over - overnight". She posted: "There were more than four at the beginning and this is overnight so there is no sun to reflect off of a plane.” Famed UFO blogger Scott C Waring picked up on the video on websiteufosightingsdaily.com.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X