వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఎస్ఐఎస్ భరతం పడుతున్న బ్రిటన్

|
Google Oneindia TeluguNews

లండన్/ సిరియా: సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) స్థావరాలపై బ్రిటన్ వైమానిక దాడులు నిర్వహించింది. ఉగ్రవాదులు తలదాచుకున్న అనేక స్థావరాలను నేలపట్టం చేసింది. ఐఎస్ఐఎస్ స్థావరాలపై రాయల్ బ్రిటీష్ ఎయిర్ ఫోర్స్ యుద్ద విమానాలు విరుచుకుపడుతున్నాయి.

మధ్యయుగపు రాక్షసులపై బాంబుల వర్షం కురిపించడానికి అవకాశం ఇవ్వాలని బ్రిటన్ ప్రధాని కామెరాన్ పార్లమెంట్ లో మనవి చేశారు. అదే విదంగా ఇస్లామిక్ స్టేట్ అంతు చూడటానికి ఇదే సరైన అవకాశం అని పిలుపునిచ్చారు.

పార్లమెంట్ లో ఓటింగ్ జరిగింది. 397-223 ఓట్ల తేడాతో కామెరాన్ ప్రభుత్వం ఆమోదం పొందింది. ఇస్లామిక్ స్టేట్ స్థావరాల మీద దాడులు చెయ్యాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం తీసుకున్న కొన్ని గంటలలోనే బ్రిటన్ వైమానిక దాడులు నిర్వహించింది.

UK action against Islamic State in Syria

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల స్థావరాల మీద నాలుగు యుద్ద విమానాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. గతంలో కూడా సిరియాలోని అల్ బషర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైమానిక దాడులు నిర్వహించాలని కామెరూన్ పిలుపునిచ్చారు.

అయితే పార్లమెంట్ లో ఆమోదం పొందలేదు. తరువాత కామెరూన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇటివల ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్యారిస్ లో దాడులు చేసిన నేపద్యంలో వారి అంతు చూడాలని బ్రిటన్ పార్లమెంట్ ఆంగీకారం తెలిపింది.

English summary
MPs have overwhelmingly backed UK air strikes against so-called Islamic State in Syria.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X