వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రిటన్‌లో త్రీ పేరెంట్ బేబీలు: బిల్లుకు హౌస్ ఆఫ్ లార్డ్స్ ఆమోదం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

లండన్: బ్రిటన్ పార్లమెంట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ముగ్గురు వ్యక్తులు కలిసి ఓ బిడ్డకు జన్మనిచ్చేందుకు అనుమతించే బిల్లును హౌస్ ఆఫ్ లార్డ్స్ ఆమోదించింది. అంతక ముందు ఈ బిల్లు హౌజ్ ఆఫ్ కామన్స్‌లో కూడా నెగ్గంది. శిశివుకు జన్మనిచ్చే తల్లి అనారోగ్య మైటోకాండ్రియాని కలిగి ఉన్నట్లయితే ప్రాణాంతక వ్యాధులతో కూడిన బేబీలు పుడతారు.

కాబట్టి ఆరోగ్యకరమైన మైటోకాండ్రియా కల్గి ఉన్న వేరొక మహిళ నుండి దాన్ని జన్మనిచ్చే తల్లి పొంది ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మని ప్రసాదించవచ్చనేది ఈ బిల్లు ముఖ్య ఉద్దేశ్యం. ఈ బిల్లుకి బ్రిటన్ పార్లమెంట్ అనుమతి తెలపడంతో త్రీ పేరెంట్ బేబి 2016లోగా జన్మించే అవకాశం ఉంది.

UK approves three-person babies with help of IVF modern technology

ఇక మైటోకాండ్రియా విషయానికి వస్తే ప్రతి కణంలో ఉంటూ ఆహార పదార్థాలను శక్తిగా మారుస్తుంది. ఒకవేళ మైటోకాండ్రియాలో జన్యు లోపాలు ఉన్నట్లయితే గుండె, మెదడు నిర్వహించే కార్యకలాపాలలకు కావల్సినంత శక్తిని అవి అందిచ లేవు. దీనిని అధిగమించడానికి న్యూకాస్టిల్‌లో ఓ టెక్నాలజీ కనిపెట్టారు.

ఇందులో ఆరోగ్యవంత మహిళ మైటోకాండ్రియాను తల్లిదండ్రుల డీఎన్‌ఏతో జతపరుస్తారు. శిశువుల డీఎన్‌ఏలో 0.1 శాతం మాత్రమే రెండో మహిళ నుంచి పుట్టబోయే బేబీకి అందుతుంది. ఇలా చేయడం వల్ల భవిష్యత్ తరాలు ఈ డీఎన్‌ఏతో ఆరోగ్యకరంగా, ఉత్సాహాంగా ఉంటారు.

English summary
The House of Lords has approved the law, and now the fertility regulator will decide how to license the procedure to prevent babies inheriting deadly genetic diseases, the BBC reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X