వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కూరల వాసన, భారతీయులకు ఇల్లు ఇవ్వం: బ్రిటన్ వాసికి కోర్టు గట్టి షాక్

భారతీయ వంటలు వండుతుంటే తాము భరించలేమని, కాబట్టి వారికి ఇళ్లు అద్దెకు ఇవ్వమని చెప్పిన బ్రిటన్ ఇంటి యజమానికి అక్కడి న్యాయస్థానం షాకిచ్చింది.

|
Google Oneindia TeluguNews

లండన్: భారతీయ వంటలు వండుతుంటే తాము భరించలేమని, కాబట్టి వారికి ఇళ్లు అద్దెకు ఇవ్వమని చెప్పిన బ్రిటన్ ఇంటి యజమానికి అక్కడి న్యాయస్థానం షాకిచ్చింది.

 కూరలు వండుకునే భారతీయులు

కూరలు వండుకునే భారతీయులు

వాసనలు వచ్చే కూరలు వండుకునే భారతీయులు, పాకిస్తానీలకు ఇళ్లు అద్దెకు ఇవ్వనని ఓ బ్రిటన్ వ్యక్తి పట్టుతో ఉన్నాడు. అతనికి బ్రిటన్ న్యాయస్థానంలో చుక్కెదురయింది.

ఈశాన్య ఇంగ్లాండులో వందల

ఈశాన్య ఇంగ్లాండులో వందల

ఫెర్జస్ విల్సన్ అనే 69 ఏళ్ల వ్యక్తికి ఈశాన్య ఇంగ్లాండులో వందల ఇళ్లు ఉన్నాయి. భారత్, పాకిస్తాన్‌లకు చెందిన ఓ వర్ణం ఛాయ కలిగిన వ్యక్తులకు ఇళ్లు అద్దెకు ఇవ్వనని తేల్చి చెప్పారు. సమానత్వం, మానవ హక్కుల కమిషన్ ముందు కూడా ఆయన చెప్పారు.

ఖరాఖండిగా చెప్పడంతో

ఖరాఖండిగా చెప్పడంతో

వారికి ఇళ్లు ఇవ్వనని ఆయన ఖరాఖండిగా చెప్పడంతో కేసు మైడ్ స్టోన్ కౌంటీ కోర్టుకు వెళ్లింది. న్యాయస్థానంలో ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఈ సందర్భంగా ఆయనపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.

అందుకే భారతీయులు

అందుకే భారతీయులు

కూరల వాసన వచ్చే ఇల్లు తమకు వద్దని కొందరు చెబుతున్నారని, దీంతో ఇళ్లను బాగుచేయించేందుకు డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని, అందుకే భారతీయులు, పాకిస్థానీలకు ఇళ్లు అద్దెకి ఇవ్వనని ఆయన తన వాదన వినిపించారు.

సమాజంలో చోటు లేదని జడ్జి వ్యాఖ్యానించారు

సమాజంలో చోటు లేదని జడ్జి వ్యాఖ్యానించారు

విల్సన్ విధానాలు న్యాయవిరుద్ధంగా ఉన్నాయని, ఇలాంటి వాటికి మన సమాజంలో చోటు లేదని జడ్జి వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పును వ్యతిరేస్తే, భారతీయులు, పాక్ జాతీయులపై వివక్ష చూపిస్తే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పింది.

English summary
A UK court has held as unlawful a British landlord’s ban on "coloured" people from India and Pakistan renting his properties because they cooked curry and left behind lingering smells. Fergus Wilson, who owns hundreds of properties in Kent in south-east England, had denied being racist but lost the legal action brought by the UK's human rights watchdog when Maidstone County Court granted an injunction against the policy this week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X