వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రిటన్ వెళ్లాలంటే ఇంకో నెల ఆగాల్సిందే: కరోనా ఆంక్షల ఎత్తివేత మరింత ఆలస్యం

|
Google Oneindia TeluguNews

లండన్: భారత్ సహా ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ తీవ్రత ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ ప్రాణాంతక మహమ్మారి వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి విధించుకున్న ఆంక్షలు, లాక్‌డౌన్ తరహా పరిస్థితులు క్రమంగా సడలుతున్నాయి. భారత్‌ కూడా దీనికి మినహాయింపేమీ కాదు. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోండటం వల్ల పలు రాష్ట్రాలు అన్‌లాక్ బాట పట్టాయి. దశలవారీగా వాటిని సడలిస్తూ వస్తోన్నాయి. ఈ పరిస్థితుల్లో కరోనా వైరస్ డెల్టా వేరియంట్.. కొన్ని దేశాలను భయపెడుతోంది. కరోనా ఆంక్షలను పూర్తిగా ఎత్తేయడానికి ఒకట్రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితిని కల్పించింది.

WTC final: భారత్‌లో లైవ్ టెలికాస్ట్ ఎప్పుడు..ఎలా చూడొచ్చు: తెలుగు కామెంటేటర్‌గా ఎంఎస్‌కేWTC final: భారత్‌లో లైవ్ టెలికాస్ట్ ఎప్పుడు..ఎలా చూడొచ్చు: తెలుగు కామెంటేటర్‌గా ఎంఎస్‌కే

కోవిడ్ 19 డెల్టా వేరియంట్‌ను దృష్టిలో ఉంచుకుని బ్రిటన్.. ఆంక్షలను సడలించడానికి వెనుకాడుతోంది. ఇదివరకు వెలుగులోకి వచ్చిన కరోనా బ్రిటన్ వేరియంట్ ఆ దేశాన్ని ఎంతగా భయాందోళనలకు గురి చేసిందో తెలిసిన విషయమే. ఈ అనుభం ఉన్నందున.. డెల్టా వేరియంట్ పట్ల ఆ దేశ ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటోంది. కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టినప్పటికీ- ఆంక్షలను ఎత్తేయడానికి సాహసించట్లేదు. ఆంక్షలను సడలించడం వల్ల డెల్టా వేరియంట్ విజృంభించే ప్రమాదం ఉందనే భయాందోళనలో వ్యక్తమౌతోన్నాయి.

 UK delays lockdown relaxation over spread of Delta variant upto July 19

Recommended Video

Ap Capital Moving to vizag on July 23 | Fans Remembering Sushant as he left this world on this day.

అందుకే- ఏకంగా నెల రోజుల పాటు ఆంక్షలను కొనసాగించాలని నిర్ణయించింది. జులై 19వ తేదీ వరకూ ఆంక్షలను కొనసాగిస్తామని బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ స్పష్టం చేశారు. మరో నాలుగు వారాల పాటు ఆంక్షలను కొనసాగించనున్నట్లు బోరిస్ జాన్సన్ తెలిపారు. ఈ లోగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తామని పేర్కొన్నారాయన. ఈ వ్యవధిలో మరింత మంది తమ దేశ పౌరులు రెండు డోసుల వ్యాక్సిన్‌ను తీసుకోవడానికి అవకాశం ఇచ్చినట్టవుతుందని చెప్పారు. ఆంక్షలను కొనసాగించడం, వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేయడం వల్ల వేలాదిమంది ప్రాణాలను కాపాడినట్టవుతుందని అన్నారు.

English summary
Britain PM Boris Johnson has confirmed that the plan of relaxation of coronavirus restrictions in England will be delayed by until July 19 as a result of the spread of the Delta variant.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X