వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అర్నాబ్ గోస్వామికి భారీ షాక్ -రిపబ్లిక్ టీవీలో విద్వేష ప్రచారం -జరిమానా విధింపు, వార్నింగ్

|
Google Oneindia TeluguNews

జర్నలిజానికి కొత్త అర్థాలు చెబుతూ, వివాదాస్పద ప్రసారాలతో నిత్యం వార్తల్లో నిలిచే రిపబ్లిక్ టీవీ యజమాని అర్నాబ్ గోస్వామికి భారీ షాక్ తగిలింది. ఇండియాలో ఆయన కార్యక్రమాలకు కోర్టులు, ప్రభుత్వాలు సైతం దన్నుగా నిలుస్తోన్నవేళ.. బ్రిటన్ లో మాత్రం ఎదురుదెబ్బ తగిలింది. విద్వేష వ్యాఖ్యలు చేసినందుకుగానూ ఆయనకు జనిమానా పడింది.

జగన్‌ పరువు గంగలోకి -రంగు పడుద్ది -వైసీపీకి వేల కోట్లు ఎక్కడివి? రక్త దోపిడీ ఏంటయ్యా?: ఎంపీ రఘురామజగన్‌ పరువు గంగలోకి -రంగు పడుద్ది -వైసీపీకి వేల కోట్లు ఎక్కడివి? రక్త దోపిడీ ఏంటయ్యా?: ఎంపీ రఘురామ

గతేడాది ప్రసారం చేసిన ఓ కార్యక్రమంలో పాకిస్తాన్‌ ప్రజలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రిపబ్లిక్‌ టీవీ చానల్‌ చీఫ్‌ ప్రమోటర్‌ అర్నాబ్‌ గోస్వామికి చెందిన 'రిపబ్లిక్‌ భారత్‌' చానల్‌కు బ్రిటిష్‌ టీవీ నియంత్రణ సంస్థ 'ఆఫ్‌కామ్‌' 20వేల పౌండ్ల (భారత కరెన్సీలో రూ.19లక్షలు) జరిమానా విధించింది.

UK fines Arnab Goswamis Republic tv for Rs 20 Lakh for Hate Pak speech

బ్రిటన్‌లో హిందీ మాట్లాడే వారి కోసం ఆ దేశంలో అర్నాబ్‌ 'రిపబ్లిక్‌ భారత్‌' చానల్‌ అనుమతులు పొందారు. గత ఏడాది సెప్టెంబర్‌ 6న ఆ టీవీ చానల్‌లో 'పూఛ్‌తా హై భారత్‌' కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. చర్చలో అర్నాబ్‌ గోస్వామితో పాటు ముగ్గురు భారతీయులు, మరో ముగ్గురు పాకిస్తానీలు చర్చలో పాల్గొన్నారు. పాకిస్తానీలు తప్ప యాకర్ సహా ప్యానలిస్టులందరూ పాకిస్తాన్ ను, అక్కడి ప్రజలను కించపర్చేలా వ్యాఖ్యలు చేశారని ఆఫ్ కామ్ పేర్కొంది.

మగాడిలా పుట్టి.. అందాల ఆడబొమ్మగా -Miss Transqueen 2020 షైనీ సోని -భారత్ కీర్తిపతాకమగాడిలా పుట్టి.. అందాల ఆడబొమ్మగా -Miss Transqueen 2020 షైనీ సోని -భారత్ కీర్తిపతాక

'చంద్రయాన్‌-2' మిషన్‌పై చర్చ సందర్భంగా.. భారత్ అంతరిక్ష, సాంకేతిక రంగంలో పురోగమిస్తూ, శాస్త్రవేత్తలను తయారుచేస్తుంటే.. పాకిస్తాన్ మాత్రం తీవ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తూ టెర్రరిస్టుల్ని తయారుచేస్తోందని అర్నాబ్ వ్యాఖ్యానించారు. ఈ పోలికను బ్రిటన్ రెగ్యులేటరీ ఆఫ్‌కామ్‌ తప్పుపట్టింది. పాక్‌లోని పిల్లల నుంచి పండు ముసలి వరకు అందరూ ఉగ్రవాదులేనన్న అర్థం వచ్చేలా ఆ కార్యక్రమంలో ఆయన మాట్లాడినట్టు ఆఫ్‌కామ్ తెలిపింది. భారీ జరిమానా విధించండంతోపాటు నాటి కార్యక్రమాన్ని మరోమారు ప్రసారం చేయొద్దని ఈ సందర్భంగా 'రిపబ్లిక్‌ భారత్‌'ను ఆఫ్‌కామ్ హెచ్చరించింది.

English summary
Republic Bharat was fined approximately Rs 19.73 lakh (20,000 pounds) by the United Kingdom’s communications regulator Office of Communications on Tuesday for broadcasting content that involved “offensive language”, “hate speech” and “ abusive or derogatory treatment of individuals, groups, religions or communities”. The Hindi news channel arm of Republic TV has also been asked to air an apology on the channel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X