వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూకే-ఇండియా వీక్ 2018: యూకే-ఇండియా ప్రతినిధుల హైలెవల్ సమావేశం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: యూకే - ఇండియా వీక్ 2018లో యూకే, ఇండియా కేబినెట్ మినిస్టర్స్, ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ఇతర రంగాల్లోని ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

18 జూన్, 2018, లండన్: యూకే-ఇండియా వీక్ సందర్భంగా యూకేకు చెందిన సీనియర్ నేతలు, భారత నేతలతో హైలెవల్ మీటింగ్ నిర్వహిస్తారు. ఇరు దేశాల మధ్య తత్సంబంధాలు కొనసాగుతున్న నేపథ్యంలో వేడుకలు నిర్వహిస్తారు. ఈ సమావేశాలు జూన్ 18-22 వరకు జరుగుతాయి.

యూకే-ఇండియా వీక్ కార్యక్రమాన్ని తాజ్ బకింగ్‌హామ్ గేట్ హోటల్‌లో సోమవారం అంటే జూన్ 18న అంతర్జాతీయ ట్రేడ్ సెక్రరీ ఆర్‌టీ. హాన్ లియామ్ ఫోక్స్ ఎంపీ, ఆర్‌టీ. హాన్ ఎమిలీ థోర్నబెర్రీ ఎంపీ, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ డిజిటల్, కల్చర్, మీడియా, స్పోర్ట్స్ ఆర్‌టీ. హాన్ మాట్ హన్‌కాక్ ఎంపీ.

UK India Week 2018: Don’t miss the 5th Annual UK-India Leadership Conclave

యూకే-ఇండియా అవార్డ్స్ 2018తో శుక్రవారం ముగియనున్న ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా లండన్ మేయర్ సాదిక్ ఖాన్, ఫారెన్ మినిస్టర్ ఆర్‌టీ. హాన్ మార్క్ ఫీల్డ్ ఎంపీ హాజరవనున్నారు. యూకే-ఇండియా వీక్ సందర్భంగా హైలెవల్ చర్చలు, యూకే-ఇండియా 5వ వార్షిక నాయకత్వ సమావేశం జూన్ 20-21మధ్య జరగుతుంది. యూకేకు చెందిన సీనియర్ నేతలు లిబరల్ డెమోక్రాట్స్ పార్టీ లీడర్ ఆర్‌టీ. హాన్ సార్ విన్స్ కేబుల్ ఎంపీ, మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఆర్‌టీ. హాన్ ప్రీతి పటేల్ ఎంపీ, షాడో సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్, క్లైమెట్ ఛేంజ్ ఆర్‌టీ. హాన్ బెర్రీ గార్డినర్ ఎంపీలు ప్రసంగించనున్నారు.

5వ వార్షిక యూకే-ఇండియా లీడర్‌షిప్ సమావేశంలో జూన్ 20-21 లాండ్ మార్క్ ఈవెంట్‌గా చెప్పుకోవచ్చు. భారత సీనియర్ రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, ప్రెసిడెంట్ ఆఫ్ ది కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ అండ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ.. బ్రెగ్జిట్ తర్వాత భాగస్వామ్య అవకాశాలు, యూకేలో పెట్టుబడికి గల అవకాశాలపై ప్రసంగించనున్నారు. ఇరు దేశాల నుంచి సుమారు 200మందికి పైగా ప్రతినిధులు హాజరుకానున్నారు.

యశ్వర్ధన్ సిన్హా తన యూకేకు ఇండియన్ హై కమిషనర్‌గా సాధించిన విజయాలతో యూకే ఇండియా లీడర్‌షిప్ సమావేశం తొలిరోజు ప్రారంభమవుతుంది. ఆర్థికవేత్త, రచయిత, నీతి ఆయోగ్(నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా) వైస్ ఛైర్మన్ డా. రాజీవ్ కుమార్ ప్రస్తుత భారత ఆర్థిక వ్యవస్థపై విశ్లేషిస్తారు.

ఇండియా ఐఎన్‌సీ. ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశంలో భారత రాజకీయ నేతలు ఇంఛార్జ్ ఫారేన్ ఎఫైర్స్, బీజేపీ నేత విజయ్ చౌతియవాలే, భారత పార్లమెంటు సభ్యుడు డా. స్వపన్ దాస్ గుప్తా, రైల్వేస్, కోల్ మినిష్టర్ పీయూష్ గోయల్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఫోరమ్‌కు వీడియో లింక్ ద్వారా పాల్గొంటారు.

బ్రెగ్జిట్ బ్రిటన్, గ్లోబల్ ఇండియాల మధ్య సత్సంబంధాలు, ఇరుదేశాలు సహాయక సహకారాలు, కలిసి అభివృద్ధి సాధించడంపై బకింగ్‌హామ్‌షైర్‌లోని డీవీరీ లాటిమర్ ఎస్టేట్‌లో జరిగే యూకే-ఇండియా లీడర్‌షిప్ సమావేశంలో చర్చించనున్నారు.

డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్రిటీష్ ఇండస్ట్రీ(సీబీఐ) జోష్ హార్డీ.. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ), ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ(ఎఫ్ఐసీసీఐ) ప్రతినిధులతోపాటు ప్రసంగిస్తారు. వీటితోపాటు గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఫోరమ్, పరిశీలనాత్మక సమావేశాలు చర్చలు జరగనున్నాయి.

ఈ ఈవెంట్‌కు డైలీహంట్, ఇండియా #1 న్యూస్, లోకల్ లాంగ్వేజ్ కంటెంట్ అప్లికేషన్, అఫీషియల్ మీడియా పార్ట్‌నర్.

English summary
Delegates will hear from UK and India Cabinet Ministers and senior figures in business, politics and public affairs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X