వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘వికీలీక్స్’ అసాంజె ఆత్మహత్య చేసుకునే అవకాశం -అందుకే అమెరికాకు అప్పగించం: బ్రిటన్ కోర్టు

|
Google Oneindia TeluguNews

అగ్రదేశాల చీకటి వ్యవహారాలు, కీలక రహస్యాలను బట్టబయలు చేసి ఆయా ప్రభుత్వాలు, నేతలు, అధికారులను ముప్పుతిప్పలు పెట్టిన ప్రముఖ జర్నలిస్టు, 'వికీలీక్స్' సంస్థ అధినేత జూలియన్ అసాంజెకు భారీ ఊరట లభించింది. గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న అసాంజె కేసులో అమెరికాకు ఎదురు దెబ్బ తగిలింది.

అసాంజెను అమెరికాకు అప్పగించే విషయమై బ్రిటన్‌ కోర్టు సోమవారం కీలక తీర్పు ఇచ్చింది. అసాంజెను అమెరికాకు అప్పగించలేమని స్పష్టం చేశారు. ఈ మేరకు న్యాయమూర్తి వెనెస్సా బరైట్సర్ సోమవారం తీర్పును ప్రకటించారు. ఈ సందర్భంగా జడ్జి బరైట్సర్ అనూహ్య వ్యాఖ్యలు చేశారు..

 UK judge rules WikiLeaks Julian Assange should not be extradited to United States

''ఏళ్లపాటు బాహ్య ప్రపంచానికి దూరంగా లండన్ లోని ఈక్వెడార్ ఎంబసీలో ఆశ్రయం పొందిన అసాంజె ఇప్పటికే క్లినికల్ డిప్రెషన్, ఆత్మహత్య ఆలోచనలతో బాధపడుతున్న వ్యక్తిగా.. ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఎక్కువగా ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. అందుకే అతణ్ని ఇప్పటికిప్పుడు అమెరికాకు అప్పగించలేం'' అని జడ్జి వెనెస్సా అన్నారు.

రాతి బొమ్మలు పగిలితే ఇంత రచ్చా? తిరుమలలో రాయినే చూసొచ్చావా? -సీపీఐ నారాయణ vs బీజేపీ విష్ణురాతి బొమ్మలు పగిలితే ఇంత రచ్చా? తిరుమలలో రాయినే చూసొచ్చావా? -సీపీఐ నారాయణ vs బీజేపీ విష్ణు

2010-11లో అమెరికా రక్షణ శాఖకు సంబంధించిన కీలక సమాచారం, రహస్య పత్రాలను వికిలీక్స్‌ బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. ఇరాక్‌, అఫ్ఘనిస్థాన్‌ దేశాల్లో అమెరికా యుద్ధనేరాలకు పాల్పడిందని వికీలీక్స్‌ ఆధారాలతో బయటపెట్టడం ప్రపంచ దేశాల్లో ప్రకంపనలు రేపింది. ఈ కేసులో అసాంజె దోషిగా తేలినట్టయితే ఆయనకు 175 ఏండ్ల జైలుశిక్ష విధించే అవకాశముందని భావించారు.

సెక్సీ ఫొటోలతో హారిక వలపువల -డేటింగ్ పేరుతో భారీ చీటింగ్ -భర్త సిక్ - కుటుంబ పోషణకు పక్కదారిసెక్సీ ఫొటోలతో హారిక వలపువల -డేటింగ్ పేరుతో భారీ చీటింగ్ -భర్త సిక్ - కుటుంబ పోషణకు పక్కదారి

ఈక్వెడార్ ఎంబసీ కల్పించిన ఆశ్రయాన్ని వెనక్కి తీసుకోవడంతో లండన్‌లోని మెట్రోపాలిటన్ పోలీసులు 2019 ఏప్రిల్ 11న అసాంజెను అరెస్టు చేశారు. గూఢచర్యలో ఆరోపణలకు తోడు అసాంజేపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు, స్వీడన్‌కు దొరక్కుండా ఉండేందుకు 2012 నుంచి లండన్‌లోని ఈక్వేడార్ దౌత్య కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్నారు.

English summary
Wikileaks founder Julian Assange cannot be extradited to the United States, a court in London has ruled. The judge blocked the request because of concerns over Assange's mental health and risk of suicide in the US. The 49-year-old is wanted over the publication of thousands of classified documents in 2010 and 2011. The US claims the leaks broke the law and endangered lives. Assange has fought the extradition and says the case is politically motivated. The US authorities have said the decision will be appealed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X