• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బ్రిటన్ ఎంపీ దారుణ హత్య - కత్తితో దాడి : చికిత్స పొందుతూ డేవిడ్‌ అమీస్‌ మృతి ..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

బ్రిటన్ కు చెందిన ఒక ఎంపీ దారుణ హత్యకు గురయ్యారు. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఎంపీ డేవిడ్ అమ్మెస్(69) పైన కత్తితో దాడి జరిగింది. బ్రిటన్‌ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు చెందిన కన్జర్వేటివ్ పార్టీ నేత అయిన డేవిడ్‌ అమీస్‌ 1983 నుంచి ఎంపీగా ఉన్నారు. జంతు సమస్యలతోపాటు మహిళల గర్భస్రావాలకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిగా ఆయనకు స్థానికంగా గుర్తింపు ఉంది. ఎసెక్స్‌లోని సౌత్‌ఎండ్‌ వెస్ట్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

శుక్రవారం స్థానికంగా లీ- ఆన్- సీలోని ఓ చర్చిలో పౌరులతో వారాంతపు సమావేశానికి హాజరయ్యారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆయనపై దాడి చేసి, కత్తితో పలుమార్లు పొడిచాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆయన్ను హుటాహుటీన ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. స్థానిక పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ కేసులో ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఘటనా స్థలంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ కౌన్సిలర్, సౌత్‌ఎండ్ మాజీ మేయర్ జాన్ లాంబ్ సైతం కత్తిపోట్ల విషయాన్ని నిర్ధారించారు.

UK MP David Amess dies after being stabbed multiple time
    NTR ని TDP నుండి సస్పెండ్ చేసి.. ఇప్పుడు నాటకాలా.. Vijaysaireddy మాస్ ట్రోలింగ్ || Oneindia Telugu

    డేవిడ్‌ అమీస్‌ మృతిపై తోటి ఎంపీలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనకు నివాళులర్పించారు. ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ ఈ ఘటనను 'భయంకరం.. తీవ్ర దిగ్భ్రాంతికరం'గా అభివర్ణించారు. గతంలోనూ పలువురు బ్రిటీష్ ఎంపీలపై దాడులు జరిగాయి. 2016లో బ్రెగ్జిట్ ప్రజాభిప్రాయ సేకరణకు ముందు లేబర్ పార్టీకి చెందిన ఎంపీ జో కాక్స్‌ను కాల్చి చంపారు. 2010లో లేబర్ పార్టీ ఎంపీ స్టీఫెన్ టిమ్స్ కత్తిపోట్లకు గురయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దుండగుడిని అరెస్ట్ చేశారు. తీవ్రగాయాలతో పడి ఉన్న ఎంపీకి ఎమర్జెన్సీ సర్వీసెస్ ట్రీట్మెంట్ అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

    English summary
    British MP David Amess was on Friday stabbed "multiple times" during an event in his local constituency in southeast England.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X