వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూకే కొత్త కరోనా స్ట్రెయిన్ అత్యంత ప్రాణాంతకం, అధిక మరణాలకు ఛాన్స్ : బోరిస్ జాన్సన్

|
Google Oneindia TeluguNews

కరోనావైరస్ యొక్క కొత్త స్ట్రెయిన్ మొదట ఇంగ్లాండ్‌లో కనుగొనబడింది . యునైటెడ్ స్టేట్స్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది . ఈ కొత్త స్ట్రెయిన్ అత్యంత ప్రమాదకరమైందని , అధిక స్థాయిలో మరణాలతో సంబంధం కలిగి ఉండవచ్చు అని బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు.

దక్షిణాఫ్రికా కరోనావైరస్ కొత్త స్ట్రెయిన్ పై వ్యాక్సిన్ పనిచేయకపోవచ్చు: యూకే శాస్త్రవేత్తల ఆందోళనదక్షిణాఫ్రికా కరోనావైరస్ కొత్త స్ట్రెయిన్ పై వ్యాక్సిన్ పనిచేయకపోవచ్చు: యూకే శాస్త్రవేత్తల ఆందోళన

కొత్త స్ట్రెయిన్ మరింత ప్రాణాంతకం కావచ్చన్న బ్రిటిష్ ప్రధాని

కొత్త స్ట్రెయిన్ మరింత ప్రాణాంతకం కావచ్చన్న బ్రిటిష్ ప్రధాని

కరోనా క్రొత్త స్ట్రెయిన్, యూకే రకం అసలు వైరస్ కంటే ఎక్కువ ప్రమాదకరమైన వైరస్ గా ఇప్పటికే తెలిసింది. ఇది 30 నుండి 70 శాతం ఎక్కువ ప్రసారం చేయగలదని అధ్యయనాలు సూచించాయి. 10 డౌనింగ్ స్ట్రీట్‌లో కరోనా కొత్త స్ట్రెయిన్ పై మాట్లాడిన బోరిస్ జాన్సన్ కొత్త స్ట్రెయిన్ మరింత ప్రాణాంతకం కావచ్చని పేర్కొన్నారు. ఇంగ్లాండ్ ముఖ్య శాస్త్రీయ సలహాదారు ప్యాట్రిక్ వాలెన్స్ ఒక ఉదాహరణ ఇచ్చారు. ఇంగ్లాండ్‌లోని 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 1,000 మంది పురుషులలో, అసలు వైరస్ 10 మంది ప్రాణాలు తీస్తే, కొత్త వేరియంట్ 13 లేదా 14 మంది ప్రాణాలు తీస్తుందని లెక్క చెప్పారు.

 పాత వైరస్ కంటే కొత్త రకం వల్ల మరణాలు 30 శాతం పెరుగుదల

పాత వైరస్ కంటే కొత్త రకం వల్ల మరణాలు 30 శాతం పెరుగుదల

ఈ కొత్త వైరస్ వల్ల మరణాలు 30 శాతం పెరుగుదలను సూచిస్తున్నాయని పేర్కొన్నారు. గత సంవత్సరం బ్రిటన్లో కొత్త వేరియంట్ కనుగొనబడినప్పటి నుండి, పరివర్తన చెందిన వైరస్ వైరస్ పై పలు ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. మొదటి నుంచి బోరిస్ జాన్సన్ కరోనా కొత్త వైరస్ వల్ల వ్యాప్తి ఎక్కువగా ఉండటమే కాకుండా, అత్యంత ప్రమాదం కూడా సంభవించవచ్చు అని చెప్తూనే ఉన్నారు. ఇప్పటికే యూకే కొత్త వేరియంట్ 50 కి పైగా దేశాలలో కనుగొనబడింది .

యూఎస్ కు వార్నింగ్ ... రెండునెలల్లో కొత్త వేరియంట్ పంజా .. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్

యూఎస్ కు వార్నింగ్ ... రెండునెలల్లో కొత్త వేరియంట్ పంజా .. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్

ఇది యునైటెడ్ కింగ్‌డమ్‌లో ప్రబలంగా ఉంది. యు.ఎస్. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ శాస్త్రవేత్తలు ఇది రెండు నెలల్లో యునైటెడ్ స్టేట్స్ లో కూడా 80 శాతం ప్రబలే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా అటు యూకే లోనూ, యూఎస్ లోనూ కరోనా కొత్త వేరియంట్ ప్రబలంగా వ్యాపిస్తుందని, ఇది అత్యంత ప్రమాదకారి అని, దానిని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండాలని బ్రిటిష్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ మరోమారు స్పష్టం చేశారు.

English summary
British Prime Minister Boris Johnson said Friday that the variant of the coronavirus first detected in England - and spreading around the world, including in the United States - "may be associated with a higher degree of mortality."The new strain was already known to be more infectious than the original virus. Studies have suggested it is 30 to 70 percent more transmissible.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X