వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో విలయం, బ్రిటన్‌లో బీభత్సం.. కరోనా దెబ్బకు అగ్రరాజ్యాలు కుదేలు.. చైనా ఎదురుదాడి..

|
Google Oneindia TeluguNews

ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40లక్షలకు మరణాల సంఖ్య 3లక్షల దిశగా పరుగులు తీస్తోంది. భూమ్మీద మిగతా దేశాలను శాసించే రెండు అగ్రరాజ్యాలు కరోనా వైరస్ దెబ్బకు వణికిపోతున్నాయి. కొవిడ్-19 కేసులు, మరణాల సంఖ్యలో అమెరికా ఇప్పటికే టాప్ లో కొనసాగుతుండగా, ఇటలీ, స్పెయిన్‌ల కంటే దారుణమైన పరిస్థితుల్లోకి బ్రిటన్ దిగజారిపోయింది.

యూరప్‌లో యూకే వరస్ట్

యూరప్‌లో యూకే వరస్ట్


కరోనా విలయం ప్రారంభమైన కొత్తలో చైనా తర్వాత ఇటలీ, స్పెయిన్ తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఆ రెండు దేశాల్లో మరణాలు 20వేలు దాటిన సమయంలోనూ బ్రిటన్ చాలా సేఫ్ పొజిషన్ లో ఉంది. కానీ గడిచిన నాలుగు వారాల్లో అక్కడ పరిస్థితులు తలకిందులయ్యాయి. ఏమాత్రం నియంత్రణ పాటించకపోవడంతో యూకేలో రోజుకు సగటున 700 మరణాలు సంభవించాయి. బుధవారం నాటికి అక్కడ మృతుల సంఖ్య 30 వేలు దాటింది. తద్వారా అమెరికా తర్వాత అత్యధిక చావులను చవిచూసినట్లయింది. యూకేలో మొత్తం 2లక్షలపైచిలుకు పాజిటివ్ కేసులుండగా, అందులో రెండు వేల మంది క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు. ఇప్పటిదాకా ఇటలీలో 29,684 మంది, స్పెయిన్ 25,857, ఫ్రాన్స్లో 25,531మంది ప్రాణాలు కోల్పోయారు.

అమెరికాలో అదుపులేదు..

అమెరికాలో అదుపులేదు..


కరోనా వైరస్ కు సంబందించి మోస్ట్ ఎఫెక్టెడ్ దేశంగా కొనసాగుతోన్న అమెరికాలో కేసులు, మరణాలు అదుపులేకుండా పెరిగిపోతున్నాయి. బుధవారం నాటికి అక్కడ వైరస్ కాటుకు గురైనవాళ్ల సంఖ్య 13లక్షలకు చేరువైంది. మరణాలు 73వేలకు పెరిగాయి. మరో 16వేల మంది పరిస్థితి క్రిటికల్ గా ఉంది. అమెరికాలో వైరస్ ఎపిసెంటర్ న్యూయార్క్ లో పరిస్థితి ఇంకా దారుణంగానే ఉంది. అక్కడ కేసుల సంఖ్య 3.22 లక్షలుకాగా, మృతుల సంఖ్య 25,124గా ఉంది. ఆ తర్వాత అత్యధికంగా న్యూజెర్సీలో 8,244 మంది, మిచిగన్ 4,183, పెన్సిల్వేనియాలో 3,179 మంది ప్రాణాలు కోల్పోయారు.

రీఓపెనింగ్ తప్పదన్న ట్రంప్..

రీఓపెనింగ్ తప్పదన్న ట్రంప్..

కరోనా సంక్షోభం కారణంగా అమెరికాలోని ప్రైవేట్ సెక్టార్ లో ఒక్క ఏప్రిల్ నెలలోనే 20.2మిలియన్ల ఉద్యోగాలు తుడిచిపెట్టుకుపోయినట్లు వెల్లడైంది. సర్వీస్ సెక్టార్ తోపాటు ప్రొడక్షన్ రంగంలోనూ ఉపాధి అవకాశాలు దారుణంగా దెబ్బతిన్నాయని రిపోర్టులు వచ్చాయి. కరోనా విలయం ఇప్పట్లో తగ్గనప్పటికీ, ఆర్థిక లావాదేవీలు పున:ప్రారంభించాలని నిర్ణయించినట్లు ప్రెసిడెంట్ ట్రంప్ తెలిపారు. దేశంలో కొవిడ్-19 మరణాలు లక్షకుపైగానే నమోదు కావొచ్చని ఆయన అన్నారు. కొవిడ్-19 నియంత్రణ కోసం ఏర్పాటైన వైట్ హౌజ్ టాస్క్ ఫోర్స్ మరికొంత కాలం పనిచేస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు.

Recommended Video

AP CM Jagan Launched Fishermen Bharosa Scheme, Rs 10,000 To Beneficiaries
చైనా ఎదురుదాడి..

చైనా ఎదురుదాడి..

కరోనా వైరస్ సాకుతో చైనాకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలను ఎగదోసే ప్రయత్నం జరుగుతున్నదని, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఆ మేరకు కుట్రలు పన్నుతున్నారని చైనా ఎదురుదాడికి దిగింది. ట్రంప్, ఆయన మంత్రులు పదే పదే ప్రచారం చేస్తున్నట్లు కరోనా వైరస్ వూహాన్ లోని వైరాలజీ ల్యాబ్ లో పుట్టిందనడానికి ఒక్క ఆధారం కూడా లేదని తెలిపింది. అమెరికా పక్కకు తప్పుకున్నప్పటికీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ లాంటి అంతర్జాతీయ వేదికలకు చైనా తనవంతు సాయం చేస్తుందని ఆ దేశ ప్రతినిధులు పేర్కొన్నారు.

English summary
The United Kingdom has overtaken Italy to report the highest official death toll from coronavirus disease Covid-19 in Europe, figures released on Tuesday showed. president Trump says U.S. must reopen.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X