• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బ్రిటన్ రాజకుటుంబానికి ప్రిన్స్‌ హ్యారీ దంపతుల గుడ్‌బై-అచ్చు బాహుబలి తరహాలోనే..

|

బ్రిటన్ రాజకుటుంబంలో అతిపెద్ద సంచలనం చోటు చేసుకుంది. బ్రిటన్‌ రాణి ఎలిజబెత్ మనవడు ప్రిన్స్‌ హ్యరీ ఆయన భార్య మేఘన్‌ మార్కెల్‌ రాజకుటుంబాన్ని, బకింగ్‌ హ్యామ్‌ ప్యాలెస్‌ను శాశ్వతంగా వీడాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని రాణి ఎలిజబెత్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ఇకపై రాజకుటుంబ విధుల్లో వారిద్దరూ పాలుపంచుకోరని బకింగ్‌ హ్యామ్‌ ప్యాలెస్‌ కీలక ప్రకటన విడుదల చేసింది. అంతే కాదు వారి విధులను ఇతరులకు అప్పగిచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా తెలిపింది. దీంతో ఈ వ్యవహారం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

 బ్రిటన్‌ రాణి కోటలో సంచలనం

బ్రిటన్‌ రాణి కోటలో సంచలనం

ప్రపంచంలో అత్యంత గౌరవ మర్యాదలు పొందే రాజకుటుంబాల్లో ఒకటైన బ్రిటన్ రాణి ఎలిజబెత్ కుటుంబంలో తాజాగా అతిపెద్ద సంచలనం నమోదైంది. గతంలో రాణి ఎలిజబెత్ కుమారుడు ప్రిన్స్‌ ఛార్లెస్ భార్య డయానా అనుమాస్పద మృతికి ఏమాత్రం తీసిపోని రీతిలో తాజాగా మరో హైడ్రామా చోటు చేసుకుంది. వీరిద్దరి కుమారుడు, బ్రిటన్‌ రాజకుటుంబ వారసుడు ప్రిన్స్‌ హ్యారీ దంపతులు బకింగ్ హ్యామ్‌ ప్యాలెస్‌ను వీడాలని నిర్ణయించుకున్నారు. తొలుత ఏడాది పాటు కోటకు దూరంగా ఉండాలని భావించిన వీరిద్దరూ ఇప్పుడు శాశ్వతంగా దూరం కావాలని తీసుకున్న నిర్ణయం తీవ్ర సంచలనం రేపుతోంది.

 రాజరికానికి ప్రిన్స్‌ హ్యారీ దంపతుల గుడ్‌బై

రాజరికానికి ప్రిన్స్‌ హ్యారీ దంపతుల గుడ్‌బై

బ్రిటన్‌ రాజకుటుంబ వారసుడిగా, డ్యూక్‌ ఆఫ్‌ ససెక్స్‌గా ఉన్న ప్రిన్స్‌ హ్యారీ, డచెస్‌గా ఉన్న ఆయన భార్య మేఘన్ మార్కెల్‌ ఏడాది క్రితమే ఓ నిర్ణయం తీసుకున్నారు. ఏడాది పాటు రాజకుటుంబానికి దూరంగా స్వేచ్ఛగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఏడాది తర్వాత కూడా వారు రాజకుటుంబానికి బయటే ఉండాలని నిర్ణయించుకుని తమ నిర్ణయాన్ని బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌కు చెప్పేశారు. దీంతో చేసేది లేక బకింగ్‌ హ్యామ్‌ ప్యాలెస్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో రాజకుటుంబ విధుల్లో పాలుపంచుకునేందుకు ప్రిన్స్‌ హ్యారీ దంపతులు సిద్ధంగా లేరని, రాజకుటుంబ మర్యాదలకు దూరంగా ఉండాలని వారు నిర్ణయించుకున్నట్లు ప్రకటించింది. కాబట్టి ప్రత్యామ్నాయంగా వారి విధులను ఇతరులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది.

 ఉక్కపోత భరించలేక బయటపడ్డారా ?

ఉక్కపోత భరించలేక బయటపడ్డారా ?

బ్రిటన్‌ రాజకుటుంబాన్ని వీడాలని ప్రిన్స్‌ హ్యారీ దంపతులు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు బ్రిటన్‌ సైన్యంలో సైనికుడుగా కూడా పనిచేసిన ప్రిన్స్‌ హ్యారీకి బకింగ్‌ హ్యామ్ ప్యాలెస్ వ్యవహారాల్లో కీలక పాత్ర ఉంది. అంతకు మించిన మర్యాద ఉంది. రాజకుటుంబ వారసుడిగా అక్కడ తాను చెప్పిందే వేదం. అయినా కూడా నానమ్మ, రాణి ఎలిజబెత్‌ నీడన ఉండిపోవడం ఇష్టం లేక రాజకుటుంబాన్ని వీడాలని ప్రిన్స్‌ హ్యారీ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. ఆర్ధికంగా, స్వేచ్ఛాయుతంగా బతికేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రిన్స్‌ హ్యారీ దంపతులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే వీరిద్దరూ అక్కడ రాజకుటుంబ కట్టుబాట్ల మధ్య ఉండేందుకు ఇష్టపడలేదని అర్ధమవుతోంది.

 అచ్చు బాహుబలి సీన్ తరహాలో...

అచ్చు బాహుబలి సీన్ తరహాలో...

బ్లాక్‌ బస్టర్‌ మూవీ బాహుబలిలో ఎక్కడో కుంతల దేశపు రాకుమారిని ప్రేమించి తన మాహిష్మతి రాజ్యానికి తీసుకొచ్చిన యువరాజు అమరేంద్ర బాహుబలిని తల్లి పెంచిన తల్లి, రాజమాత శివగామి తిరస్కరిస్తుంది. సింహాసనం కావాలో, ప్రేమించిన దేవసేన కావాలో తేల్చుకోమంటుంది. రాజ్యాధికారం, రాజమర్యాదలు, సింహాసనం పోతాయని తెలిసినా ఇచ్చిన మాట కోసం దేవసేనను పెళ్లి చేసుకునేందుకే బాహుబలి మొగ్గు చూపుతాడు. చివరికి సింహాసనంతో పాటు అన్నీ కోల్పోయి దేవసేనతో కలిసి బాహుబలి ఒంటరిగా రాజ్యం వదిలి వెళ్లిపోతాడు. ఇప్పుడు బ్రిటన్‌ ప్రిన్స్‌ హ్యారీ కూడా దాదాపు అదే పరిస్దితుల్లో తాను కోరుకున్న విధంగా స్వేచ్ఛగా ఉండలేక భార్యతో కలిసి రాజకుటుంబాన్ని వదిలి సాధారణ జీవితం గడిపేందుకు వెళ్లిపోవడం విశేషం.

English summary
Britain's Prince Harry will relinquish his honorary military appointments and patronages after confirming to Queen Elizabeth II that he and his wife Meghan Markle will not return as working royals, Buckingham Palace announced Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X