వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నడకపై అధ్యయనానికి రూ.16.44 కోట్ల నిధులు

|
Google Oneindia TeluguNews

లండన్ ‌: వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. మనుషులు ఎలా నడుస్తున్నారో తెలుసుకునేందుకు అక్షరాలా రూ.16.44కోట్ల ఖర్చు చేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం ముందుకొచ్చింది. షెఫీల్డ్ యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్లు నడకపై అధ్యయనం చేసి కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నానికి తనవంతు సాయం అందించింది. మనిషి నడక తీరును బట్టి వారు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు.. ఎలాంటి రోగాలు వస్తాయన్న విషయం తెలుసుకోవచ్చని రీసెర్చర్లు అంటున్నారు.

<strong>బాగా ఉక్కపోస్తోంది..బట్టలు విప్పేసి, దిగేటప్పుడు వేసుకోవచ్చా? విమాన సిబ్బందికి అనుమతి అడిగిన మహిళ</strong>బాగా ఉక్కపోస్తోంది..బట్టలు విప్పేసి, దిగేటప్పుడు వేసుకోవచ్చా? విమాన సిబ్బందికి అనుమతి అడిగిన మహిళ

నడక ఆధారంగా ఆరోగ్య పరిస్థితి అంచనా

నడక ఆధారంగా ఆరోగ్య పరిస్థితి అంచనా

మనిషి ఎలా నడుస్తాడన్న అంశాన్ని శాస్త్రీయ పరిభాషలో గతిశీలత అని అంటారు. ఇది వ్యక్తుల ఆరోగ్యాన్ని అంచనావేసే కీలకమైన అంశాల్లో ఆరవది. నడకకు సంబంధించి ఇప్పటికే పలు అధ్యయనాలు జరగగా కొన్ని పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. మెల్లగా నడిచేవారు త్వరగా చనిపోయే ప్రమాదం ఉందన్నది అందులో ఒకటి కాగా.. అలా నడిచేవారికి రోగాలు వచ్చే ఛాన్స్ ఎక్కువని, తెలివితేటలు కూడా అంతంత మాత్రమేనని సైంటిస్టులు గుర్తించారు. నెమ్మదిగా అడుగులేసే వారిలో డిమెన్షియా వచ్చే రిస్క్ పెరగగా.. ఎక్కువగా కళ్లు తిరిగి పడిపోయేది కూడా వీరేనని అధ్యయనాల్లో తేలింది.

డిజిటల్ టెక్నాలజీ సాయంతో చికిత్స

డిజిటల్ టెక్నాలజీ సాయంతో చికిత్స

యూరోపియన్ యూనియన్ పాపులేషన్‌లో 65 ఏళ్లు పైబడిన వారు 19శాతానికి మించి ఉన్నారు. జీవితకాలం పెరిగే కొద్దీ సహజంగానే దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారి సంఖ్య పెరుగుతుంది. డిజిటల్ టెక్నాలజీ సాయంతో గతిశీలత తక్కువగా ఉండేవారికి రోగ నిర్థారణ, సరైన వైద్యం అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం నడకపై అధ్యయనంపై దృష్టి పెట్టింది. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్న రీసెర్చర్లకు నిధులు అందజేసింది.

మొబిలైజ్ - డి ప్రాజెక్టు

మొబిలైజ్ - డి ప్రాజెక్టు

టెక్నాలజీ సాయంతో వైద్యం అందించేందుకు ప్రపంచవ్యాప్తంగా 34 కంపెనీలు, యూనివర్సిటీలు మొబిలైజ్ డి పేరుతో ఓ ప్రాజెక్టు ప్రారంభించాయి. నడకకు, రోగాలకు మధ్య సంబంధాన్ని తెలుసుకోవడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం షెఫీల్డ్ యూనివర్సిటీతో పాటు టీచింగ్ హాస్పిటల్ ఎన్‌‍హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్టు కు రూ.16.44కోట్ల నిధులు అందించారు. దీంతో నడకపై అధ్యయనం మరింత వేగవంతం కానుంది.

English summary
Researchers at the University of Sheffield in the UK have been awarded a whopping 2.1 million euros to help develop a technology to monitor how well people walk, a vital sign of health and wellbeing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X