వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రెగ్జిట్-వాళ్లే ఓటు వేసి ఉంటే..: విడిపోయేందుకు రెండేళ్లు, ఏ రంగాలపై ప్రభావం?

|
Google Oneindia TeluguNews

లండన్: బ్రెగ్జిట్ నేపథ్యంలో తాము యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగడానికి బ్రిటన్ దరఖాస్తు సమర్పించనుంది. ఈ వ్యవహారం మొత్తం పూర్తయ్యేందుకు రెండేళ్లు పట్టవచ్చునంట. అయితే, బ్రెగ్జిట్ ఫలితం బ్రిటన్, యూరోపియన్ యూనియన్ ఆర్థిక వ్యవస్థ పైన, ఇతర రంగాల పైన బాగానే ఉండనుంది.

బ్రెగ్జిట్ ఎఫెక్ట్, రాజకీయాల్లో కుదుపు: కామెరూన్ రాజీనామా!

ఈయూ నుంచి వైదొలుగుతున్న నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ నిబంధనలు బ్రిటన్‌కు వర్తించవు. ప్రజల అప్పు అరవై శాతం దాటకూడదని, జీడీపీలో మూడు శాతానికి మించి బడ్జెట్ లోటు ఉండవద్దని తదితర నిబంధనలు వర్తించవు. బ్రిటన్ విడిపోయేందుకు రెండేళ్ల గడువు ఉంటుంది.

dacid

బ్రిటన్ సంస్థలు ఈయూలో స్వేచ్ఛా వ్యాపారాన్ని కోల్పోనున్నాయి. ఇతర దేశాల బ్యాంకులు లండన్ వదిలి యూరప్ దేశాలకు తరలి వెళ్తాయి. బ్రిటన్ విద్యుత్ ఇబ్బందులను ఎదుర్కోనుంది. యూఈ నుంచి విడిపోయిన నేపథ్యంలో తమకు లండన్ పైన పెద్ద ఆసక్తి లేదని అమెరికా ఇప్పటికే చెప్పింది.

ఈయూ నుంచి బ్రిటన్ ఔట్: విడిపోదామన్న మెజార్టీ ప్రజలు, ట్రేడింగ్ నిలిపివేసిన జపాన్

కాగా, బ్రిటన్ వాసులు బ్రెగ్జిట్ కోసం నిద్రలేని రాత్రులు గడిపారు. గురువారం మొత్తం వరకు రెఫరెండం కొనసాగింది. శుక్రవారం ఫలితాల కోసం బ్రిటన్ వాసులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు. సామాజిక అనుసంధాన వేదికల్లో పెద్ద ఎత్తున ట్వీట్లు చేశారు. బ్రెడ్జిట్‌కు అనుకూలంగా 17,410,742 ఓట్లు పడగా, వ్యతిరేకంగా 16,141,241 మంది ఓటు వేశారు. రెండింటి మధ్య తేడా 12,69,501 ఓట్లు.

బ్రెగ్జిట్ ఎఫెక్్: భారత్ ఐటీ కంపెనీలపై దెబ్బ, ఎలా?

వాళ్లు ఓటు వేసి ఉంటే...

కీలకమైన రెఫరెండం నేపథ్యంలో దాదాపు 28 శాతం మంది ఓటు వేయలేదు. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్లు ఓటు వేసి ఉంటే తీర్పు మరోలా ఉండేదేమో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బ్రిటన్ వంటి దేశంలో బ్యాలెట్ పెట్టడాన్ని మరికొందరు తప్పుబట్టారు.

ఎక్కడ ఎంత మంది?

ఇంగ్లాండులో 15,188,406 మంది ప్రజలు యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవాలని ఓటు వేయగా, ఈయులో ఉండాలని 13,266,996 మంది ఓటు వేశారు. స్కాట్లాండులో 1,018,322 మంది బ్రెడ్జిట్‌కు అనుకూలంగా, 1,661,191 మంది వ్యతిరేకంగా, ఉత్తర ఐర్లాండులో 3,49,442 మంది అనుకూలంగా, 440, 437 మంది వ్యతిరేకంగా, వేల్స్‌లో 854,527 మంది అనుకూలంగా, 772,347 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు.

English summary
David Cameron to step down as Prime Minister after Brexit from EU.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X