వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంటి బిడ్డతో ఐఎస్ఐఎస్ లో చేరిన బ్రిటన్ మహిళ

|
Google Oneindia TeluguNews

లండన్: ఒక సంవత్సరం వయస్సు ఉన్న బిడ్డను ఎత్తుకుని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)లో చేరింది ఓ బ్రిటన్ మహిళ. అయితే అక్కడి పరిస్థితులు ఆమెకు అనుకూలించకపోవడంతో గుట్టుచప్పుడు కాకుండా మళ్లీ బ్రిటన్ లో అడుగు పెట్టింది.

విషయం తెలుసుకున్న ఉగ్రవాద నిరోధక దళం అధికారులు బ్రిటన్ కు చెందిన తరీనా షకిల్ (26) అనే మహిళను అరెస్టు చేశారు. ఆమె నేరం చేసిందని కోర్టు తేల్చింది. ఐఎస్ఐఎస్ సభ్యురాలిగా ఉంటూ ఉగ్రవాద చర్యలను ప్రోత్సహించినందుకు బ్రిటన్ కోర్టు ఆమెను దోషిగా ప్రకటించింది.

సోమవారం (ఫిబ్రవరి 1వ తేది) తరీనా షకిల్ కు శిక్ష ఖరారు చెయ్యనున్నారు. సిరియా వెళ్లి ఉగ్రవాదులతో చేతులు కలిపి తిరిగి బ్రిటన్ తిరిగి వచ్చిన తొలి మహిళ తరీనా షకిల్ అని బ్రిటన్ పోలీసు అధికారులు అంటున్నారు.

2014 అక్టోబర్ నెలలో ఏడాది వయస్సు ఉన్న కుమారుడిని తీసుకుని తరీనా షకీల్ విమానంలో టర్కీ చేరుకుంది. అక్కడి నుంచి సిరియా సరిహద్దులు దాటి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఉంటున్న కలిఫత్ చేరుకుంది.

UK woman found guilty of taking son to join ISIS in Syria-2014

అక్కడ మూడు నెలలు గడిపిన తరీనా షకిల్ అక్కడి పరిస్థితులు అనుకూలించకపోవడంతో గుట్టు చప్పుడు కాకుండా గత ఏడాది ఫిబ్రవరిలో బ్రిటన్ లో అడుగు పెట్టింది. విషయం తెలుసుకున్న ఉగ్రవాద నిరోధక దళం అధికారులు ఎయిర్ పోర్టులో ఆమెను అరెస్టు చేశారు.

ఆమె ఏడాది కుమారుడిని తల్లి నుంచి వేరు చేసి ఓ సంరక్షణా సంస్థకు అప్పగించారు. అయితే పోలీసులు చేస్తున్న ఆరోపణలను ఆమె తోసిపుచ్చింది. కఠినమైన ఇస్లామిక్ చట్టాల ప్రకారం తాను జీవించాలని సిరియా వెళ్లానని అంటున్నది.

అంతే కాని తాను ఉగ్రవాదాన్ని ప్రోత్సహించలేదని సమర్థించుకుంది. అయితే ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులతో, ఆ గ్రూపు జెండాలతో తరీనా షకిల్ దిగిన ఫోటోలు, సిరియా వెళ్లే ముందు ఐఎస్ఐఎస్ లో మీరూ చేరండి అంటూ ఆమె చేసిన ట్వీట్లను పోలీసులు కోర్టులో సమర్పించారు.

English summary
Tareena Shakil(26), was convicted of being a member of the ISIS and encouraging acts of terrorism.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X