వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉక్రెయిన్ పార్లమెంటు వద్ద పేలుడు: 100మందికి గాయాలు

|
Google Oneindia TeluguNews

కీవ్: ఉక్రెయిన్‌ పార్లమెంటు ఎదుట సోమవారం బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ఓ పోలీసు మృతి చెందగా, మరో 100మంది పోలీసులు, జర్నలిస్టులు సహా పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి.

గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వేర్పాటువాద ప్రాంతాలకు ఎక్కువ అధికారాలు ఇవ్వడం పట్ల పార్లమెంటు వద్ద పలువురు ఆందోళనకారులు ఆందోళన చేస్తున్న సమయంలో బాంబు పేలుడు సంభవించింది.

Ukraine Kiev protest clashes kill policeman after MPs vote

మరో పురాతన ఆలయం నేల మట్టం

పామిరా: దాదాపు రెండు వేల సంవత్సరాల చరిత్ర గల మరో ఆలయం కాల గర్భంలో కలిసిపోయింది. ఇస్లామిక్ ఉగ్రవాదులు సిరియాలోని చరిత్రాత్మక నగనం పామిరాలో మరో బాల్ ఆలయాన్ని కూల్చి వేశారు.

బాంబులు పెట్టి కూల్చినట్లు సమాచారం. బాంబులు పేలినపుడు వెలువడిన శబ్ధాలు చెవికి చిల్లులు పడే విధంగా ఉన్నయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

అదొక భారీ విస్ఫోటమని స్థానికుడొకరు చెప్పారు. ఆలయం ధ్వంసం సమయంలో ఏర్పడిన దుమ్ము దూళి భారీగా ఎగసి పడినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ ఆలయం క్రీ.శ. 32లో నిర్మించబడింది.

English summary
One policeman has been killed and about 100 more injured outside Ukraine's parliament, after MPs gave initial backing to reforms for more autonomy in the rebel-held east, officials say.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X