నో యూజ్.. రష్యా ఉక్రెయిన్ చర్చలు విఫలం.. 3 గంటలపాటు డిస్కషన్.. కానీ
ఉక్రెయిన్ రష్యా చర్చలు విఫలం అయ్యాయి. దాదాపు 3 గంటలు డిస్కష్ చేసిన కొలిక్కి రాలేదు. ప్రపంచ దేశాలు భయపడినట్టుగానే అయ్యింది. యుద్ధంతో హోరాహోరీగా తలపడుతున్న రష్యా, ఉక్రెయిన్ల మధ్య సోమవారం మధ్యాహ్నం చర్చలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. బెలారస్ వేదికగా జరిగిన చర్చల్లో ఇరు దేశాలు తమ తమ వాదనలకే కట్టుబడి సాగాయి. డిమాండ్లను ఇరు దేశాలు కూడా పరిగణనలోకి తీసుకులేదు. దీంతో ఒక తీర్మానం కూడా జరగకుండానే ముగిశాయి.
యుద్ధం మొదలైన రెండో రోజుననే ఉక్రెయిన్‌తో తాము చర్చలకు సిద్ధమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతిపాదన చేశారు. బెలారస్ వేదికగా ఉక్రెయిన్ చర్చలకు సిద్ధమైతే తమ దేశ ప్రతినిది బృందాన్ని పంపుతామని ప్రకటించారు. రష్యా మిత్రదేశంగా ఉన్న బెలారస్లో చర్చలకు తొలుత విముఖత వ్యక్తం చేసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ.. ఆ తర్వాత చర్చలకు సరేనన్నారు. సోమవారం మధ్యాహ్నం తర్వాత బెలారస్లో మొదలైన చర్చలకు ఉక్రెయిన్ నుంచి ఆరుగురు, రష్యా నుంచి ఐదుగురు ప్రతినిధులతో కూడిన బృందాలు చర్చలు ప్రారంభించాయి.3 గంటలకు పైగానే చర్చలు జరిపినా... ఏ ఒక్క తీర్మానం లేకుండానే రెండు దేశాలు చర్చలను ముగించాయి.

ఇటు ఉక్రెయిన్‌లో భారత విద్యార్థుల కష్టాలు వర్ణణాతీతం. దేశం విడిచి వెళ్లే మార్గం తెలియక ఆందోళన చెందుతున్నారు. ఉక్రెయిన్ గగనతలం మూసివేయడంతో స్వదేశం చేరడానికి ఇబ్బందులు తప్పడం లేదు. అయితే సరిహద్దు దేశాలకు వెళుతున్నారు. ఇప్పటికే రోమెనియా మీదుగా భారత విద్యార్థులు స్వదేశం చేరుకుంటున్నారు.