Russia Ukraine war : తక్షణం ఈయూ సభ్యత్వం కోరిన ఉక్రెయిన్- రష్యా వెనక్కి తగ్గాలని వినతి
రష్యా దండయాత్రతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉక్రెయిన్ ఇవాళ తమకు ఈయూ సభ్యత్వం తక్షణం ఇవ్వాలని కోరింది. రష్యా ఆహ్వనంతో బెలారస్ కు చర్చల కోసం వెళ్లిన ఉక్రెయిన్ ప్రతినిధి బృందం ఈ మేరకు విజ్ఢప్తి చేసింది. దీంతో పాటు పలు అంశాలను అంతర్జాతీయ సమాజం ముందు ఉంచింది.
రష్యా దాడి మొదలుపెట్టిన ఐదవ రోజున రష్యా ప్రతినిధులతో చర్చల కోసం తమ ప్రతినిధి బృందం బెలారస్‌కు చేరుకోవడంతో ఉక్రెయిన్ వెంటనే రష్యా కాల్పుల విరమణ, దళాల ఉపసంహరణను డిమాండ్ చేసింది.అనేక ఉక్రేనియన్ నగరాల కోసం పోరాటం కొనసాగుతోందని, రష్యన్ రూబుల్ పతనం నేపథ్యంలో రష్యా దాడి తర్వాత తొలిసారి చర్చల కోసం ఉక్రెయిన్ ప్రతినిధి బృందం రష్యా ప్రతినిధులను కలవబోతోంది. ఉక్రెయిన్‌పై దాడి చేయడానికి రష్యన్ దళాలను అనుమతించిన కీలకమైన రష్యా మిత్రదేశమైన పొరుగున ఉన్న బెలారస్‌లోని సరిహద్దులో ఈ సమావేశం జరుగుతుంది.రష్యన్ ఫెడరేషన్ ప్రతినిధులతో చర్చల్లో పాల్గొనేందుకు ఉక్రేనియన్ ప్రతినిధి బృందం ఉక్రేనియన్-బెలారసియన్ సరిహద్దుకు చేరుకుందని ఉక్రేనియన్ అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

రష్యా-ఉక్రెయిన్ చర్చల్లో ముఖ్యమైన అంశం తక్షణ కాల్పుల విరమణ, ఉక్రెయిన్ నుండి దళాల ఉపసంహరణే అని తెలుస్తోంది. ఉక్రేనియన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఒక ప్రత్యేక ప్రకటనలో రష్యన్ దళాలు తమ పరికరాలను విడిచిపెట్టి, తమ ప్రాణాలను కాపాడుకోవడానికి యుద్ధభూమిని విడిచిపెట్టాలని కోరారు. ఇప్పటికే 4,500 మందికి పైగా రష్యన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.ప్రత్యేక ప్రక్రియ ద్వారా ఉక్రెయిన్‌కు "తక్షణ" సభ్యత్వం ఇవ్వాలని యూరోపియన్ యూనియన్ను ఆయన కోరారు.