వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూకే-ఇండియా వీక్ 2018-ప్రాంతీయ భాషల్లో హృదయాల్లోకి వెళ్తుంది: డైలీహంట్ ఉమాంగ్ బేడీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

యూకే-ఇండియా లీడర్‌షిప్ వార్షికోత్సవ సమావేశంలో డైలీహంట్ ప్రెసిడెంట్ ఉమాంగ్ బేడీ ప్రసంగించారు. అంతకుముందు, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ మాట్లాడారు.

ఉమాంగ్ బేడీ మాట్లాడుతూ.. 200 మిలియన్ల ప్రజలు ప్రాంతీయ భాషల్లో కంటెంట్‌ను వినియోగిస్తున్నారని తెలిపారు. టెక్నాలజీలోని అవరోధాలు కూడా కంటెంట్ క్రియేట్ చేయడానికి అవకాశాన్ని కల్పిస్తున్నాయని చెప్పారు.

Umang Bedi and Vivek Oberoi on Future of creativity in India

భారత దేశంలో 2020 కల్లా ప్రాంతీయ భాషల్లో మరింత వినియోగం పెరుగుతుందని చెప్పారు. మనం వారి ప్రాంతీయ భాషలలో మాట్లాడితే లేదా కంటెంట్ ఇస్తే అది వారి హృదయాల్లోకి వెళ్తుందని చెప్పారు. ప్రజల అటెన్షన్ కోసం కంటెంట్ తగ్గుతూ వస్తోందన్నారు. వివేక్ ఒబెరాయ్ మాట్లాడుతూ... బాలీవుడ్‌లో తన స్ట్రగుల్‌ను గుర్తు చేసుకున్నారు.

అంతకుముందు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ మాట్లాడారు. భారత ప్రభుత్వం గత నాలుగేళ్లలో అనేక ఆర్థిక సంస్కరణలను తీసుకొచ్చిందన్నారు. భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా నడిపేందుకు ఈ నాలుగేళ్లలో భారీ సంస్కరణలు ప్రవేశపెట్టామన్నారు.

మీ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ తరపున తాను పెట్టుబడిదారులకు హామీ ఇస్తున్నట్లు తెలిపారు. భారత ప్రభుత్వ విదేశీ పెట్టుబడిదారులకు ఆహ్వానం పలుకుతోందని చెప్పారు. ప్రభుత్వంలో ఏమైన తప్పులుంటే చెప్పాలని.. వాటిని సరిచేసుకుంటామని తెలిపారు. పెట్టుబడుల కోసం ప్రధాని మోడీ అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

English summary
UK India Week 2018: Umang Bedi speech in UK India leadership conclave
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X