వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అబ్దుల్ కలాంకు నివాళులర్పించిన బాన్ కీ మూన్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గొప్ప వ్యక్తి అని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ అన్నారు. కలాం మృతిపై ఐక్యరాజ్య సమితి సిగ్నేచర్ బుక్‌లో బాన్ కీ మూన్ సంతకం చేసి శనివారం నివాళులర్పించారు.

ఆయన మరణానంతరం ప్రపంచ వ్యాప్తంగా విచారం వ్యక్తమవడం కలాంకు దక్కిన గౌరవానికి నిదర్శమని అన్నారు. ఎందరో ప్రజలకు కలాం ఆదర్శంగా నిలిచారని, భారత్‌ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత కూడా ఎంతోమందిలో ఆయన స్పూర్తి నింపారని పేర్కొన్నారు.

UN Chief Ban Ki-Moon Condoles President APJ Abdul Kalam's Death

భారత ప్రజలతో పాటు తాము కూడా ఒక గొప్ప రాజనీతజ్ఞుడుకి నివాళులర్పిస్తున్నాని తెలిపారు. ఆయన ఆత్మకు నిత్యం శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు తన సందేశంలో తెలిపారు. న్యూయార్క్‌లోని భారత పర్మినెంట్ మిషన్‌ను ప్రత్యేకంగా సందర్శించి, దేశ ప్రజలకు ప్రగాడ సానుభూతిని ప్రకటించారు.

కలాం జులై 27న షిల్లాంగ్‌లోని ఐఐఎంలో ప్రసంగిస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే.

English summary
Describing former President APJ Abdul Kalam as a "great statesman", UN Secretary-General Ban Ki-moon has said that the outpouring of grief around the world following his death is a testament of the respect and inspiration he has garnered during and after his Presidency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X